శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోని నీరు రెండు రోజులుగా రంగు మారుతోంది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోని నీరు రెండు రోజులుగా రంగు మారుతోంది. నీరు పూర్తిగా పచ్చ రంగులోకి మారింది. ఎందుకు ఇలా మారుతుందో అర్థం కావటం లేదని అధికారులు అంటున్నారు. స్థానిక ప్రాంతాలలో కురిసిన వ ర్షాల వల్ల మూడు రోజులుగా ప్రాజెక్ట్‌లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటిలో ఎక్కడైనా రసాయానాలు కలుస్తున్నాయేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.