శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి తగ్గింది.
శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి తగ్గింది. ప్రాజెక్ట్‌పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వదర తగ్గడంతో ప్రస్తుతం ప్రాజెక్ట్ 9 గేట్లు ఎత్తి 50 వేల క్యూసెక్కుల నీరు కిందకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో కూడా 50 వేల క్యూసెక్కులు స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయంలో 90 టీఎంసీల నీరు ఉంది.