gracia
-
ఈ విషయం కొద్దిమందికే తెలుసు : ప్రియాంక రైనా
సురేశ్ రైనాకు క్రికెట్ ఆడటం మాత్రమే కాదు పాటలు పాడటం అంటే కూడా ఎంతో ఇష్టం అంటున్నారు రైనా సతీమణి ప్రియాంక. తన భర్తలో దాగి ఉన్న ఈ ప్రతిభ గురించి కొద్ది మందికి మాత్రమే తెలుసునన్నారు. ‘పాటలంటే తనకి బాగా ఇష్టం. తరచుగా పాడుతుంటాడు కూడా. తను మంచి సింగర్ అనండంలో ఎటువంటి సందేహం లేదు’ అంటూ భర్తపై ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా నిదహాస్ ట్రోఫీలో భాగంగా శ్రీలంక టూర్లో రైనా పాట పాడిన విషయాన్ని గుర్తుచేశారు. ‘మిస్ ఫీల్డ్’ ప్రోగ్రామ్‌లో భాగంగా రైనా తనకు ఇరవైయేళ్లుగా తెలుసనంటూ.. ఇరు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం గురించి ప్రియాంక చెప్పుకొచ్చారు. ‘ రైనా మా నాన్న గారి స్టూడెంట్. అలాగే రైనా స్పోర్ట్స్ కోచ్ కూడా ఆయనే. అందుకే ప్రతిరోజూ రైనాను దగ్గరిగా గమనించే అవకాశం ఆయనకి దక్కింది. అలాగే మేము వాళ్ల పొరుగింట్లోనే ఉండేవాళ్లం గనుక మా అమ్మగారు, అత్తగారు చాలా స్నేహంగా ఉండేవారు’ అంటూ చిన్న నాటి ఙ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. కాగా స్నేహితులైన రైనా, ప్రియాంకలు 2015లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి గ్రేసియా అనే కుమార్తె ఉంది. -
రైనా కుమార్తె పుట్టిన రోజు వేడుకల్లో చెన్నై అటగాళ్ల సందడి
-
గ్రేసియా పుట్టినరోజు.. చెన్నై సందడి..
న్యూఢిల్లీ : చెన్నై సూపర్‌కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా కుమార్తె గ్రేసియా పుట్టిన రోజు వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాళ్లు ధోనీ, బ్రావో, హర్భజన్ సింగ్‌లు హాజరై ఆటపాటలతో అలరించారు. ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ అధికారిక ట్విటర్ నుంచి ఓ వీడియోను విడుదల చేసింది. లీగ్ మ్యాచ్‌లలో భాగంగా మంగళవారం ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో చెన్నై తలపడనుంది. రైనా గారాలపట్టి వేడుకకు బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. వేడుకల సందర్భంగా ఆటగాళ్లు సందడి చేసిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. Here is your midnight dose of cuteness to begin a super happy Wednesday! #WhistlePodu #GraciaTurns2 @ImRaina @_PriyankaCRaina @msdhoni @DJBravo47 @Geeta_Basra 🦁💛 pic.twitter.com/UbIRi7m0F6 — Chennai Super Kings (@ChennaiIPL) 15 May 2018 -
కూతురితో క్రికెటర్ సరదాగా..
ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమైన టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా.. ప్రస్తుతం విహారయాత్రలో ఉన్నాడు. తాజాగా విమానంలో కూతురు గ్రేషియాతో కలిసి దిగిన ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నాడు. రైనా భార్య విదేశంలోని హెఎస్ బీసీ బ్యాంకు ఉద్యోగిని కావడంతో అక్కడే గ్రేషియాకు జన్మనిచ్చింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో భార్య ప్రసవం కారణంగా కొద్ది రోజుల పాటు రైనా విదేశం వెళ్లవలసి వచ్చింది. ఆ తర్వాత తన ఫామ్ ను కోల్పోయిన రైనా కూతురితో గడిపేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడు. కాగా, ఇంగ్లాండ్ తో జరగనున్న వన్డేలు, మూడు టీ20ల సిరీస్ లలో రైనాకు చోటు దక్కడం కష్టమే.