
సురేశ్ రైనాకు క్రికెట్ ఆడటం మాత్రమే కాదు పాటలు పాడటం అంటే కూడా ఎంతో ఇష్టం అంటున్నారు రైనా సతీమణి ప్రియాంక. తన భర్తలో దాగి ఉన్న ఈ ప్రతిభ గురించి కొద్ది మందికి మాత్రమే తెలుసునన్నారు. ‘పాటలంటే తనకి బాగా ఇష్టం. తరచుగా పాడుతుంటాడు కూడా. తను మంచి సింగర్ అనండంలో ఎటువంటి సందేహం లేదు’ అంటూ భర్తపై ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా నిదహాస్ ట్రోఫీలో భాగంగా శ్రీలంక టూర్‌లో రైనా పాట పాడిన విషయాన్ని గుర్తుచేశారు.
‘మిస్ ఫీల్డ్’ ప్రోగ్రామ్‌లో భాగంగా రైనా తనకు ఇరవైయేళ్లుగా తెలుసనంటూ.. ఇరు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం గురించి ప్రియాంక చెప్పుకొచ్చారు. ‘ రైనా మా నాన్న గారి స్టూడెంట్. అలాగే రైనా స్పోర్ట్స్ కోచ్ కూడా ఆయనే. అందుకే ప్రతిరోజూ రైనాను దగ్గరిగా గమనించే అవకాశం ఆయనకి దక్కింది. అలాగే మేము వాళ్ల పొరుగింట్లోనే ఉండేవాళ్లం గనుక మా అమ్మగారు, అత్తగారు చాలా స్నేహంగా ఉండేవారు’ అంటూ చిన్న నాటి ఙ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. కాగా స్నేహితులైన రైనా, ప్రియాంకలు 2015లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి గ్రేసియా అనే కుమార్తె ఉంది.
Comments
Please login to add a commentAdd a comment