కూతురితో క్రికెటర్ సరదాగా..
ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమైన టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా.. ప్రస్తుతం విహారయాత్రలో ఉన్నాడు. తాజాగా విమానంలో కూతురు గ్రేషియాతో కలిసి దిగిన ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నాడు. రైనా భార్య విదేశంలోని హెఎస్ బీసీ బ్యాంకు ఉద్యోగిని కావడంతో అక్కడే గ్రేషియాకు జన్మనిచ్చింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో భార్య ప్రసవం కారణంగా కొద్ది రోజుల పాటు రైనా విదేశం వెళ్లవలసి వచ్చింది. ఆ తర్వాత తన ఫామ్ ను కోల్పోయిన రైనా కూతురితో గడిపేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడు. కాగా, ఇంగ్లాండ్ తో జరగనున్న వన్డేలు, మూడు టీ20ల సిరీస్ లలో రైనాకు చోటు దక్కడం కష్టమే.