
మైదానంలోకి దూసుకొచ్చి ఫీల్డ్ అంపైర్లతో వాదనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనిని భారత మాజీ కెప్టెన్ గంగూలీ వెనకేసుకొచ్చాడు. ‘ధోని మనలాంటి మనిషే. భావోద్వేగాలు సహజం. అయితే ఆటలో అతని పోటీతత్వం ఏంటో మనందరికీ తెలుసు. అది అసాధారణం’ అని అన్నాడు. ఒక చిన్న ఘటనతో అతన్ని తక్కువ చేయలేమని గంగూలీ వ్యాఖ్యానించాడు.
గంగూలీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం ధోని చర్యను తప్పుబట్టాడు. ధోనిపై కనీసం రెండు లేదా మూడు మ్యాచ్‌లు నిషేధం విధిస్తే బాగుండేదని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.