
బర్త్‌డే పార్టీ..గాల్లోకి కాల్పులు
హైదరాబాద్: పుట్టిన రోజు సందర్భంగా ఓ వ్యక్తి గాల్లోకి కాల్పులు జరిపిన ఘటన నగరంలో కలకలం రేపింది. అంతే కాకుండా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పోలీసులు దీనిపై దృష్టి సారించారు. ఈ ఘటన ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈనెల 10వ తేదీన రాత్రి జరిగినట్లు భావిస్తున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
స్థానికంగా జరిగిన ఓ పుట్టినరోజు వేడుక సందర్భంగా షోయబ్ అనే యువకుడు తన తుపాకీతో గాల్లోకి 12 రౌండ్ల వరకు కాల్పులు జరిపాడు. ఈ దృశ్యాలు సోషల్‌మీడియాలోకి అప్‌లోడ్ చేయడంతో అటూఇటూ తిరిగి పోలీసుల కంట పడ్డాయి. ఇంకా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.