హార్దిక్‌ పాండ్యాతో కలిసి డ్యాన్స్‌ చేసిన ధోని.. వీడియో వైరల్‌ | MS Dhoni dances with Hardik Pandya to Badshahs tunes at party in Dubai | Sakshi
Sakshi News home page

హార్దిక్‌ పాండ్యాతో కలిసి డ్యాన్స్‌ చేసిన ధోని.. వీడియో వైరల్‌

Nov 27 2022 4:18 PM | Updated on Nov 27 2022 4:25 PM

MS Dhoni dances with Hardik Pandya to Badshahs tunes at party in Dubai - Sakshi

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోనీ ఓ భర్త్‌డే పార్టీలో సందడి చేశాడు. దుబాయ్‌లో తన స్నేహితుడి పుట్టిన రోజు వేడుకకు హాజరైన ధోని.. భారత ఆటగాళ్లు హార్దిక్‌ పాండ్యా,  ఇషాన్‌ కిషన్‌ తో కలిసి డ్యాన్స్‌ చేశాడు. ర్యాపర్ బాద్‌షా పాట పాడుతుంటే హార్ధిక్ పాండ్యా, కిషన్‌తో కలిసి ధోని స్టెప్పులు వేశాడు. ధోని, పాం‍డ్యా మంచి స్టైలిస్‌ లూక్‌లో కనిపించారు.

ఇందుకు సంబంధించిన వీడియోను ధోనీ భార్య సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన హార్ధిక్ పాండ్యాకు వన్డే సిరీస్‌కు విశ్రాంతి ఇచ్చారు.

అదే విధంగా టీ20 సిరీస్‌లో భాగంగా ఉన్న కిషన్‌కు వన్డే జట్టులోకి చోటు దక్కలేదు.  ఈ క్రమంలో నేరుగా హార్దిక్‌, కిషన్‌ నేరుగా న్యూజిలాండ్‌ నుంచి దుబాయ్‌కు చేరుకున్నారు. ఇక ధోని విషయానికి వస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకున్న ధోని ప్రస్తుతం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. భారత తరపున ధోని 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20లు ఆడాడు. మిస్టర్‌ కూల్‌ సారథ్యంలో భారత జట్టు మూడు ఐసీసీ ట్రోఫీలను కైవసం చేసుకుంది.


చదవండి: IND VS NZ 2nd ODI: అందుకే సంజూ శాంసన్‌ను ఆడించలేదు.. టీమిండియా కెప్టెన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement