IPL 2023 CSK Vs GT Live Updates:
గిల్ సూపర్ ఇన్నింగ్స్.. సీఎస్‌కేపై గుజరాత్ ఘన విజయం
ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్ బోణీ కొట్టింది. అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గుజరాత్ విజయం సాధించింది. 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
గుజరాత్ బ్యాటర్లలో శుబ్‌మన్ గిల్( 36 బంతుల్లో 63) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రషీద్ ఖాన్ మాత్రం ఆఖరిలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం మూడు బంతుల్లోనే 10 పరుగులు సాధించాడు. ఇక సీఎస్‌కే బౌలర్లలో అరంగేట్ర బౌలర్ హంగర్గేకర్ మూడు వికెట్లతో అదరగొట్టాడు.
ఇక తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగుల భారీ స్కోర్ సాధించింది. చెన్నై బ్యాటర్లలో రుత్‌రాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 50 బంతులు ఎదుర్కొన్న రుత్‌రాజ్.. 9 సిక్స్‌లు, 4 ఫోర్లతో 92 పరుగులు చేశాడు. ఆఖరిలో కెప్టెన్ ధోని(7 బంతుల్లో 14 పరుగులు) రాణించాడు. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ,రషీద్ ఖాన్, జోషఫ్ తలా రెండు వికెట్లు సాధించారు.
ఐదో వికెట్ కోల్పోయిన గుజరాత్..
గుజరాత్ ఐదో వికెట్ కోల్పోయింది. 21 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్‌తో 27 పరుగులు చేసిన విజయ్ శంకర్.. హంగర్గేకర్ బౌలింగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు. గుజరాత్ విజయానికి 12 బంతుల్లో 23 పరుగులు అవసరం.
గిల్ ఔట్..
138 పరుగుల వద్ద గుజరాత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 36 బంతుల్లో 63 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్.. తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో రుత్‌రాజ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
హార్దిక్ ఔట్..
గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది. 11 బంతుల్లో 8 పరుగులు చేసిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యి వెనుదిరిగాడు. దీంతో 111 పరుగుల వద్ద గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది.
గిల్ హాఫ్ సెంచరీ..
గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ సాధించాడు. 31 బంతుల్లో ఐదు ఫోర్లు రెండు సిక్సర్లతో దూసుకుపోతున్నాడు.
రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్..
గుజరాత్ టైటాన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 17 బంతుల్లో 22 పరులుగు చేసిన సాయి సుదర్శన్.. హంగర్గేకర్ బోలింగ్‌లో ధోనీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రసుత్తు గిల్(38), హార్దిక్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.
8 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 82/1
8 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్ గిల్(33), సాయిసుదర్శన్(19) పరుగులతో ఉన్నారు. గుజరాత్ విజయానికి 72 బంతుల్లో 97 పరుగులు కావాలి.
తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్
179 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన సాహా.. రాజవర్ధన్ హంగర్గేకర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి ఇంపాక్ట్ ప్లేయర్‌గా సాయి సుదర్శన్ క్రీజులోకి వచ్చాడు.
3 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 29/0
179 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 3 ఓవర్లు ముగిసే సరికి 29 పరుగులు చేసింది. క్రీజులో వృద్ధిమాన్ సాహా(20), శుబ్‌మన్ గిల్(8) పరుగులతో ఉన్నారు.
రుత్‌రాజ్ విధ్వంసం.. గుజరాత్ టార్గెట్ 179 పరుగులు
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగుల భారీ స్కోర్ సాధించింది. చెన్నై బ్యాటర్లలో రుత్‌రాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 50 బంతులు ఎదుర్కొన్న రుత్‌రాజ్.. 9 సిక్స్‌లు, 4 ఫోర్లతో 92 పరుగులు చేశాడు. ఆఖరిలో కెప్టెన్ ధోని(7 బంతుల్లో 14 పరుగులు) రాణించాడు. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ,రషీద్ ఖాన్, జోషఫ్ తలా రెండు వికెట్లు సాధించారు.
Photo Credit : IPL Website
వరుస క్రమంలో వికెట్లను కోల్పోయిన సీఎస్‌కే
వరుస క్రమంలో జడేజా, దుబే వికెట్లను సీఎస్‌కే కోల్పోయింది. 19 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 165/7. క్రీజులో ధోని, శాంట్నర్ ఉన్నారు.
Photo Credit : IPL Website
ఐదో వికెట్ కోల్పోయిన సీఎస్‌కే
సీఎస్‌కే ఐదో వికెట్ కోల్పోయింది. 92 పరుగులు చేసిన రుత్‌రాజ్ గైక్వాడ్.. జోషఫ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. దూకుడుగా ఆడుతున్న రుత్‌రాజ్ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లు ఉన్నాయి.
Photo Credit : IPL Website
నాలుగో వికెట్ కోల్పోయిన సీఎస్‌కే..
121 పరుగుల వద్ద చెన్నై నాలుగో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన రాయుడు.. లిటిల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులో గైక్వాడ్(76), దుబే ఉన్నారు.
Photo Credit : IPL Website
రుత్‌రాజ్ హాఫ్ సెంచరీ..
సీఎస్‌కే ఓపెనర్ రుత్‌రాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 23 బంతుల్లోనే రుత్‌రాజ్‌ను అర్ధశతకాన్ని అందుకున్నాడు. 10 ఓవర్లు ముగిసే సరికి సీఎస్‌కే స్కోర్: 93/3. క్రీజులో రుత్‌రాజ్(57), రాయుడు(3) పరుగులతో ఉన్నారు.
మూడో వికెట్ కోల్పోయిన చెన్నై
సీఎస్‌కే మూడో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన బెన్ స్టోక్స్.. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులో గైక్వాడ్(37),అంబటి రాయుడు(1) ఉన్నారు. 8 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 72/3
Photo Credit : IPL Website
రెండో వికెట్ కోల్పోయిన సీఎస్‌కే
50 పరుగుల వద్ద సీఎస్‌కే రెండో వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన మొయిన్ అలీ.. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.
Photo Credit : IPL Website
తొలి వికెట్ కోల్పోయిన సీఎస్‌కే
14 పరుగుల వద్ద చెన్నై సూపర్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన డెవాన్ కాన్వే.. షమీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి మొయిన్ అలీ వచ్చాడు.
Photo Credit : IPL Website
2 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 13/0
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే రెండు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. క్రీజులో కాన్వే(1), రుత్‌రాజ్ గైక్వాడ్(11) పరుగులతో ఉన్నారు.
ఐపీఎల్-2023 సీజన్ తొలి మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా డిఫెండింగ్ చాంపియన్స్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), చెన్నై సూపర్ కింగ్స్(CSK) జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
తుది జట్లు:
చెన్నై సూపర్ కింగ్స్
డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, శివమ్ దూబే, ఎంఎస్ ధోని (కెప్టెన్ కమ్ వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, రవీంద్ర జడేజా, అంబటి రాయుడు, దీపక్ చాహర్, రాజవర్ధన్ హంగర్గేకర్
గుజరాత్ టైటాన్స్
వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుబ్‌మన్ గిల్, కేన్ విలియమ్సన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, జాషువా లిటిల్
ఇక మ్యాచ్ ప్రారంభానికి ముందు ఓపెనింగ్ సెర్మనీ అదిరిపోయింది. ఆరంభ వేడుకల్లో ప్రముఖ బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్, పాన్ ఇండియా బ్యూటీలు రష్మిక మంధాన, మిల్కీ బ్యూటీ తమన్నాలు తమ డాన్స్‌తో అభిమానులను అలరించారు. ఈ కార్యక్రమానికి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ సహా కార్యదర్శి జై షా తదితరులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment