
ధోనితో పంత్ (PC: Sakshi Singh Instagram)
MS Dhoni- Rishabh Pant: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ముగిసిన అనంతరం పంత్.. ఐపీఎల్ 2023 మినీ వేలం ముగించుకున్న ధోని దుబాయ్ చేరుకున్నారు. అక్కడ ధోని కుటుంబాన్ని కలుసుకున్న పంత్.. వారితో కలిసి డిన్నర్‌కు వెళ్లాడు.
ఇందుకు సంబంధించిన ఫొటోను ధోని భార్య సాక్షి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. లక్షల్లో లైకులు వస్తున్నాయి. ఇక టీమిండియా ఫ్యాన్స్ ఈ ఫొటోపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘హే పంత్.. అప్పుడే దుబాయ్‌కు వెళ్లిపోయావా? నీ గురువు ధోనితో కలిసి హాలీడే ట్రిప్ ఆస్వాదిస్తున్నావ్ కదా! చాలా రోజుల తర్వాత మిమ్మల్ని ఇలా చూస్తుంటే సంతోషంగా ఉంది’’ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో రిషభ్ పంత్ అద్భుత ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ విలువైన 93 పరుగులు చేశాడు. మరోవైపు.. చెన్నై సూపర్ కింగ్స్ సారథి ధోని వేలంలో తన వ్యూహాలు అమలు చేశాడు. బెన్ స్టోక్స్ వంటి కీలక ఆటగాళ్లను కొనుగోలు చేయడంలో సఫలమై.. భవిష్యత్ కెప్టెన్‌ను తయారు చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు.
చదవండి: Babar Azam: పాంటింగ్ రికార్డు బద్దలు కొట్టిన బాబర్ ఆజం! సెహ్వాగ్‌లా అలా!
1089 రోజుల తర్వాత ఏకంగా డబుల్ సెంచరీ.. తొలి బ్యాటర్‌గా! కానీ అంతలోనే..
Comments
Please login to add a commentAdd a comment