బాలికకు మత్తుమందిచ్చి.. స్నేహితుల గ్యాంగ్‌రేప్ | delhi girl gang raped by friends after giving sedation | Sakshi
Sakshi News home page

బాలికకు మత్తుమందిచ్చి.. స్నేహితుల గ్యాంగ్‌రేప్

Published Fri, Dec 16 2016 11:23 AM | Last Updated on Mon, Sep 4 2017 10:53 PM

బాలికకు మత్తుమందిచ్చి.. స్నేహితుల గ్యాంగ్‌రేప్

బాలికకు మత్తుమందిచ్చి.. స్నేహితుల గ్యాంగ్‌రేప్

దేశ రాజధానిలో ఘోరం జరిగింది. 13 ఏళ్ల బాలికపై ఆమె స్నేహితులిద్దరు కలిసి అత్యాచారం చేశారు. పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్ ప్రాంతంలో జరిగిన ఓ బర్త్‌డే పార్టీలో కూల్‌డ్రింకులో మత్తుమందు కలిపి ఆమెకు ఇచ్చి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటన ఈనెల 13న జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన స్నేహితుడు ఒకరు తనను అతడి పుట్టినరోజు పార్టీకి పిలిచినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. అక్కడ మత్తుమందు కలిపిన కూల్‌డ్రింకు తాగగానే ఆమె స్పృహ కోల్పోయింది. తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. 
 
తర్వాత ఆమెను నిందితులు కలిసి అక్కడకు సమీపంలోని ఓ ఆస్పత్రి వద్ద వదిలేసి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఆమెను చూసి ఆస్పత్రి వర్గాలకు చెప్పడంతో విషయం తెలిసింది. తర్వాత ఎలాగోలా ఇంటికి చేరుకుని తన తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పడంతో.. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల్లో 17 ఏళ్ల మైనర్ కూడా ఉండటంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. 18 ఏళ్ల సాహిల్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సెక్షన్ 376-డి (గ్యాంగ్ రేప్‌), పోస్కో చట్టాల కింద కేసులు నమోదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement