ఢిల్లీ బాలికపై ఎనిమిది మంది అత్యాచారం | Delhi girl gang raped in Faridabad | Sakshi
Sakshi News home page

ఢిల్లీ బాలికపై ఎనిమిది మంది అత్యాచారం

Jan 1 2014 10:07 PM | Updated on Sep 2 2017 2:11 AM

ఢిల్లీకి చెందిన ఓ బాలికను ఎనిమిదిమంది దుండగులు అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఫరీదాబాద్: ఢిల్లీకి చెందిన ఓ బాలికను ఎనిమిదిమంది దుండగులు అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు బాధితురాలు తన స్నేహితుడిని కలిసేందుకు ఫరీదాబాద్కు వచ్చింది. బల్లాభ్గఢ్ బస్టాండ్లో ఆమె బస్సు కోసం వేచియుండగా, గమ్యస్థానానికి చేరుస్తామంటూ ఐదుగురు వ్యక్తులు మాయమాటలు చెప్పి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. మరో ముగ్గురు వారితో జతకలిశారు.

ఎనిమిది మంది కలసి బాలికను అత్యాచారం చేశారు. అనంతరం బాధితురాలిని బస్టాండ్ వద్ద పడేసి వెళ్లిపోయారు. ఆమె పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఏడుగురి నిందితుల్ని అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరచగా, జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement