యువతిపై సామూహిక అత్యాచారం | Gang rape of a young woman | Sakshi
Sakshi News home page

యువతిపై సామూహిక అత్యాచారం

Published Tue, May 31 2016 4:09 AM | Last Updated on Wed, Aug 1 2018 2:15 PM

Gang rape of a young woman

బెంగళూరు (బనశంకరి): స్నేహితుడి బర్త్‌డే పార్టీకి వెళ్లిన ప్రేమజంటను బెదిరించి యువతిపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈఘటన బెంగళూరులో ఆలస్యంగా వెలుగుచూసింది. రాజాజీనగర్‌కు చెందిన ప్రేమజంట ఈ నెల 14న రామనగర జిల్లా కగ్గలిపురలో ఉన్న కంబిపుర లేఔట్‌లో స్నేహితుడి బర్త్‌డే పార్టీకి వెళ్లారు. వేడుక అనంతరం ఇద్దరూ అక్కడే ఒక ఇంట్లో బసచేశారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉంటున్న శరత్‌యాదవ్, హనుమంతరాజు, ఉదయ్‌కుమార్, మను, హరీశ్ ఆ ఇంట్లోకి ప్రవేశించి.. ప్రేమజంటను బెదిరించి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీడియో తీశారు. యువకుడి వద్ద ఉన్న బంగారు చైన్ లాక్కున్నారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఆసక్తి చూపలేదు. అయితే.. ఈ నెల 25న కగ్గలిపుర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులను సోమవారం అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement