న్యూఢిల్లీ: కదులుతున్న కారులో ఒక యువతి (25)పై ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారు. ఢిల్లీలో గురువారం తెల్లవారుజామున 3.15 గంటలకు హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన యువతి... స్నేహితురాలితో కలసి వసంత్ విహార్‌లో ఒక మల్టీప్లెక్స్ నుంచి ఇంటికి వెళ్తుండగా కారులో వచ్చిన దుండగులు ఆమెను లోపలికి లాక్కున్నారు. రక్షించడానికి ప్రయత్నించిన స్నేహితురాలిని తోసేసి ఉడాయించారు. స్నేహితురాలు కారు నంబర్ నోట్‌చేసుకొని పోలీసులకు ఫోన్ చేసింది.
వారు గీతాకాలనీలో కారును గుర్తించి నిందితుల్ని అరెస్ట్ చేశారు. అప్పుడు కారులో యువతి లేదు. ఆ తర్వాత ఆమె తన స్నేహితురాలికి ఫోన్‌చేసి తనను పూర్వి మార్గ్‌లో వదిలేశారని చెప్పింది. ఆమెను ఆస్పత్రికి తరలించారు.
ఢిల్లీలో కారులో గ్యాంగ్‌రేప్
Published Fri, Jun 17 2016 3:50 AM | Last Updated on Wed, Aug 1 2018 2:15 PM
Advertisement
Advertisement