
ఘనంగా బర్త్‌డే పార్టీ చేసుకుందామనుకున్న అమ్మాయిల బృందం ఒక హోటల్‌కు వెళ్లింది. అయితే బిల్లు చెల్లించే విషయంలో వారి మధ్య వివాదం తలెత్తింది. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దానిలో ఆ యువతులు ఎలా గొడవ పడ్డానేది కనిపిస్తోంది. ఈ ఉదంతం అమెరికాలో చోటుచేసుకుంది.
ఈ వీడియోను విక్టర్ క్రిస్టియన్ పేరుతో టిక్‌టాక్‌లో షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 14 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఎంతో ఫన్నీగా కనిపిస్తున్న ఈ వీడియో నెటిజన్ల మధ్య చర్చకు తావిస్తోంది. కొంతమంది యువతులు భోజనం టేబుల్ వద్ద గొడవపడటం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
ఎన్‌వైటీ రిపోర్టును అనుసరించి ఒక యువతి తన బర్త్‌డే సందర్భంగా స్నేహితురాళ్లకు డిన్నర్ పార్టీ ఇచ్చింది. అయితే బిల్లు రూ. 3 లక్షలు($4,600) దాటడంతో ఆ స్నేహితురాళ్ల మధ్య వివాదం చెలరేగింది. ఇంతలో ఒక యువతి ఈ భారీ బిల్లును సమానంగా పంచుకుని, ఎవరి పేమెంట్ వారు చేసుకుంటే సరిపోతుందని సలహా ఇచ్చింది. అయితే ఈ సూచన మిగిలిన స్నేహితురాళ్లకు ఏమాత్రం నచ్చలేదు.
ఈ యువతుల వివాదానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన 28 ఏళ్ల విక్టర్ కూడా ఆ పార్టీలో పాల్గొంది. ఆమె మాట్లాడుతూ.. ‘మేము ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉన్నాం. అయితే మా స్నేహం మునుపటిలా లేదు. అయితే త్వరలోనే ఇది సమసిపోతుందని భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు. పార్టీలో తాను స్ప్రైట్, కలామారి ఆర్డర్ చేశానని, వాటి ధర 25 డాలర్ల కన్నా తక్కువేనని, పార్టీలోని మిగిలినవారు ఖరీదైన ఆహార పదార్థాలు ఆర్డర్ చేశారని తెలిపింది.
తాను బిల్లు షేర్ చేసేందుకు ఇష్టపడలేదని, ఎందుకంటే తాను తక్కువ ఆహారపదార్థాలనే ఆర్డర్ చేశానని తెలిపింది. ఇతరుల బిల్లు నేనెందుకు చెల్లించాలని ఆమె ప్రశ్నించింది. ఎవరు బర్త్‌డే పార్టీ ఇచ్చారో వారే బిల్లు చెల్లించాలని విక్టర్ డిమాండ్ చేసింది. కాగా ఈ వీడియో చూసిన నెటిజన్లు దీనిని ప్రాంక్ అని అంటున్నారు. కొందరు ఆహారం ఆర్డర్ చేసేముందే బ్లిలు గురించి ఆలోచించాలని అంటుండగా, మరికొందరు డైనింగ్ టేబుల్‌ను క్రీడల మైదానంగా చేశారని కామెంట్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఎత్తుకెళ్లిన విగ్రహాలన్నీ తిరిగి వస్తున్నాయి
I went to a birthday dinner — and fought over splitting the $4.6K bill https://t.co/48P3UB3oAs pic.twitter.com/LPdjcBE55i
— New York Post (@nypost) July 19, 2023
Comments
Please login to add a commentAdd a comment