Is Vijay Devarakonda, Rashmika Mandanna Attends Karan Johar Birthday Party - Sakshi
Sakshi News home page

Vijay Devarakonda-Rashmika: ముంబైలోని గ్రాండ్‌ పార్టీకి దక్షిణాది నుంచి విజయ్‌, రష్మికలకు మాత్రమే ఆహ్వానం

Published Wed, May 25 2022 4:51 PM | Last Updated on Thu, May 26 2022 11:55 AM

Is Vijay Devarakonda, Rashmika Mandanna Attends Karan Johar Birthday Party - Sakshi

ముంబైలో జరిగే ఓ గ్రాండ్‌ పార్టీలో హీరో విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా సందడి చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ రోజు(మే 25) బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ పుట్టిన రోజు. నేటితో ఆయన 50వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. ఈ సందర్భంగా నేడు(బుధవారం) సాయంత్రం తన నివాసంలో గ్రాండ్‌ పార్టీని నిర్వహించాడు కరణ్‌. ఈ సందర్భంగా బాలీవుడ్‌కు చెందిన తారలతో పాటు లైగర్‌ టీం కూడా ఈ బర్త్‌డే పార్టీలో సందడి చేసింది.

ఈ పార్టీకి లైగర్‌ హీరో విజయ్‌ దేవరకొండతో పాటు హీరోయిన్‌ రష్మిక మందన్నాకు కూడా హాజరైంది. అయితే ఈ కార్యక్రమానికి టాలీవుడ్‌ నుంచి కేవలం విజయ్‌ దేవరకొండకు మాత్రమే ఇన్విటేషన్‌ అందడం గమనార్హం. దీంతో ఈ వార్త సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఈ పార్టీకి  బాలీవుడ్‌ నుంచి షారుక్‌ ఖాన్‌, ఆయన భార్య గౌరి ఖాన్‌, మలైకా ఆరోరా, అర్జున్‌ కపూర్‌, జాన్వీ కపూర్‌, కరీనా కపూర్‌, సైఫ్‌ అలీ ఖాన్‌, సారా అలీ ఖాన్‌ రణ్‌బీర్‌ కపూర్‌, ఆయాన్‌ ముఖర్జీ, మనీశ్‌ మల్హోత్రా, రణ్‌వీర్‌ సింగ్‌, అనన్య పాండే పాల్గొన్నారు.

చదవండి: లండన్‌లో ‘పుష్ప’ సింగర్‌ వెడ్డింగ్‌ రిసెప్షన్‌, స్టార్‌ హీరో కూతురు సందడి

హాలీవుడ్‌ మూవీ షూటింగ్‌ కోసం అమెరికా వెళ్లిన అలియా, కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌ కోసం ఫ్రాన్స్‌లో ఉన్న దీపికా పదుకొనెలు నేడు ముంబై చేరుకున్నట్లు తెలుస్తోంది. దక్షిణాది నుంచి విజయ్‌ దేవరకొండతో పాటు రష్మిక మందన్నాకు ఆహ్వానం అందింది. ఇదిలా ఉంటే రష్మిక, విజయ్‌ దేవరకొండలు రిలేషన్‌లో ఉన్నారంటూ కొద్ది రోజుల వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా విజయ్‌ హీరో తెరకెక్కిన ‘లైగర్‌’ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్‌తో కలిసి ధర్మ ప్రొడక్షన్‌లో కరణ్‌ జోహార్‌ నిర్మించాడు.

(చదవండి: డెడ్‌' అని సమంత పోస్ట్‌.. ఆ వెంటనే డిలీట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement