
చుక్కల్లో చంద్రుడు!
అందాల అభినేత్రి శ్రీదేవి నుంచి క్యూట్ గాళ్ ఆలియా భట్ వరకూ హిందీ రంగంలో అందరూ ఇష్టపడే ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా.
అందాల అభినేత్రి శ్రీదేవి నుంచి క్యూట్ గాళ్ ఆలియా భట్ వరకూ హిందీ రంగంలో అందరూ ఇష్టపడే ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా. సినిమాల కోసమే కాకుండా పెళ్లిళ్లకూ, పండగలకూ, ఇతర వేడుకలకు తాము ధరించే డ్రెస్సులను దాదాపు మనీష్‌తోనే డిజైన్ చేయించుకుంటారు. తమ అందాన్ని రెట్టింపు చేసే దుస్తులు డిజైన్ చేస్తున్న మనీష్ అంటే తారలందరికీ ఎంతో అభిమానం. అందుకే ఆయన బర్త్‌డే పార్టీని మిస్ కాకూడదనుకున్నారు.
మొన్న శనివారం మనీష్ పుట్టినరోజు వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో శ్రీదేవి, రవీనా టాండన్, కరిష్మా కపూర్, శిల్పాశెట్టి, ఊర్మిళ, కరీనా కపూర్, ఆలియా భట్ తదితర తారలు పాల్గొని, సందడి చేశారు. ట్రెండీ అవుట్‌ఫిట్స్‌లో హాజైరైన తారలు మనీష్‌తో కలిసి బోల్డన్ని ఫొటోలు దిగారు. చుక్కల్లో చుంద్రుడిలా అందాల తారల మధ్యలో మనీష్ చిరునవ్వులు చిందించారు. బహుశా ఈ బర్త్‌డే ఆయనకు ఎప్పటికీ తీపి గుర్తుగా మిగిలిపోతుందని చెప్పొచ్చు.