
చిత్తరవు సంతకం
నిన్నటిని రేపటి దోసిట్లో పెట్టి మురిపించి మైమరపించేదే ఫొటో. అందుకే వేడుకేదైనా ఇది నేటి సమాజంలో ప్రతి ఒక్కరి జీవితంలో భాగమయింది.
నిన్నటిని రేపటి దోసిట్లో పెట్టి మురిపించి మైమరపించేదే ఫొటో. అందుకే వేడుకేదైనా ఇది నేటి సమాజంలో ప్రతి ఒక్కరి జీవితంలో భాగమయింది. పెళ్లి, బర్త్‌డే పార్టీల్లో ఫొటో షూట్‌లు, వీడియో రికార్డింగ్‌లు కామనే. కపుల్స్‌కు తమ కలల పంటపై ఆశలు బోలెడు. తాము పేరెంట్స్ హోదాను పొందే ముందు తీసుకున్న ఫొటోషూట్‌లుంటే భలే కదా! ఆ పాత మధురాలను కళ్లారా చూడడాన్ని మించిన అనుభూతి ఏముంటుంది. బంజారాహిల్స్ రోడ్ నం2 లోని ‘బర్త్ ప్లేస్’లో ఆ స్వీట్ మెమోరీస్ అందుబాటులోకి వచ్చాయి. గర్భం దాల్చిన దశ నుంచే భార్య, భర్తల అనురాగ జీవన అపురూప దృశ్యాల్ని చిత్రీకరించి అందిస్తున్నారు.
కడుపులోని బిడ్డను ఆప్యాయంగా ముద్దాడే తండ్రి, తమ గారాల పాపాయిని తనివితీరా తాకే తల్లి వంటి అద్భుతమైన ఫొటోలు ఈ షూట్‌లో ఉంటున్నాయి. ప్రెగ్నెంట్స్‌కు యోగా, సూచనలు, ఉదర సంబంధ జాగ్రత్తలు, శిశువుల సంరక్షణ, పోషకాహార సలహాలు, గర్భం దాల్చే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తరగతుల్ని సైతం నిర్వహిస్తున్నారు. నిపుణులైన వైద్యుల సలహాలు,సేవలు కూడా కాబోయే తల్లిదండ్రులకు అందుబాటులో ఉండడం విశేషం.
శిరీష చల్లపల్లి