Nithya Shetty Drunks In Her Friend Birthday Party, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

ఫ్రెండ్ బర్త్‌ డే పార్టీ.. ఫుల్‌గా తాగేస్తోన్న టాలీవుడ్ యంగ్‌ హీరోయిన్!

Published Thu, Jul 27 2023 2:44 PM | Last Updated on Thu, Jul 27 2023 3:42 PM

 Nithya Shetty Drunks In Her Friend Birthday Party Goes Viral - Sakshi

చైల్ట్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటోన్న భామ నిత్యాశెట్టి. దేవుళ్లు సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరకు పరిచయమైంది. తెలుగుతో పాటు తమిళ సినిమాల్లోనూ నటించింది హైదరాబాద్‌కు చెందిన నిత్యాశెట్టి. ఓ పిట్టకథ, నువ్వు తోపు రా, పడేశావే, వాంటెడ్ పండు గాడ్, అవరట్టం, కాదల్ కాలం లాంటి చిత్రాల్లో మెప్పించింది. పలు టీవీ షోల్లో మెరిసింది.  అయితే తాజాగా తన ఫ్రెండ్‌ బర్త్‌ డేకు హాజరైన ముద్దుగుమ్మ ఫుల్‌గా చిల్‌ అవుతూ కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకుంది.

(ఇది చదవండి: ఈ హీరోయిన్‌ని గుర్తుపట్టారా? తెలుగులో చేసింది ఒకటే సినిమా!)

సెలబ్రీటీలు అన్నాక పార్టీలు, పబ్‌లకు వెళ్లడం సర్వసాధారణమే. అలా తన ఫ్రెండ్‌ పుట్టినరోజు పార్టీకి వెళ్లిన నిత్యా శెట్టి ఫుల్‌గా మందుకొడుతూ కనిపించింది. ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోల్లో ఎంచక్కా షాట్స్ (ఆల్కహాల్) తాగుతూ ఎంజాయ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.  తన ఫ్రెండ్‌కు విష్ చేసిన నిత్యా శెట్టి మందు తాగుతూ కనిపించడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

(ఇది చదవండి: బుల్లితెర నటి ఐవీఎఫ్‌.. నాలుగో ప్రయత్నంలో విజయం.. కానీ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement