
బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కించిన చిత్రం డాకు మహారాజ్.

ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు.

ఈ చిత్రం రిలీజ్ అయిన రోజే(జనవరి ) ప్రగ్యా బర్త్‌డే.

దీంతో తాజాగా ‘డాకు మహారాజ్’ యూనిట్ ప్రగ్యా బర్త్‌డేని సెలెబ్రేట్ చేశారు.

బాలకృష్ణ కేక్ కట్ చేసి తనకు తినిపించాడు.

ఇందుకు సంబంధించిన ఫోటోలను ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

'12 -01 -2025.. ఇది నా బెస్ట్ బర్త్‌డే.

నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినవారికి, మా సినిమాను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.

ఇంత మంచి పుట్టినరోజు కానుకను ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు.

ఇది నాకు బ్లాక్‌బస్టర్ బర్త్‌డేగా మధుర జ్ఞాపకంగా మిగిలిపోనుంది.

డాకు మహారాజ్‌పై మీరు చూపిస్తున్న ప్రేమ మరువలేనిది' అని పోస్ట్‌లో రాసుకొచ్చింది.




