సాక్షి, చెన్నై: తాను ఏర్పాటు చేసిన బర్త్‌డే పార్టీకి ప్రియుడు రాలేదన్న కోపంతో మహిళా కానిస్టేబుల్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. విల్లుపురానికి చెందిన శివ కుమార్తె శరణ్య (22) రైల్వే కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ పెరంబూరు రైల్వే క్వార్టర్స్‌లో ఉంటోంది. ప్రస్తుతం కరోనా భద్రత నిమిత్తం ఎస్ ప్లనేడు పోలీసుస్టేషన్‌లో విధులు కేటాయించారు. సాయుధ బలగాల విభాగంలో పనిచేస్తున్న ఏలుమలైతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో గురువారం ఏలుమలై బర్త్‌డే కావడంతో శరణ్య విధుల్నిత్వరగా ముగించుకుని ప్రియుడి బర్త్‌డే వేడుకలకు సిద్ధం చేసింది. సాయంత్రం ఆరు గంటల్లోపు క్వార్టర్స్‌కు రావాలని ఏలుమలైకు ఆమె సూచించింది.
అయితే, ఏలుమలైకుపేదలకు ఆహారం అందించే ప్రాంతాల్లో భద్రతా విధులు కేటాయించారు. దీంతో శరణ్య చెప్పిన సమయానికి వెళ్లకపోవడంతో విషయం వివరించడానికి రాత్రి తొమ్మిది గంటల సమయంలో శరణ్యకు ఫోన్ చేయగా ఆమె స్పందించలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించక పోవడంతో అదే క్వార్టర్స్‌లో ఉన్న ఆమె మిత్రురాలు రాజేశ్వరికి సమాచారం ఇచ్చాడు. తొమ్మిదిన్నర గంటల సమయంలో ఆమె వెళ్లి చూడగా శరణ్య అప్పటికే ఫ్యాన్‌కు ఉరివేసుకొని వేలాడుతుండడంతో ఓట్టేరి పోలీసులకు సమాచారం అందించింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసును దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment