లాక్మే ఫ్యాషన్ వీక్
కొత్త తరం ధాటికి తెరవెలుగులకు దూరమైనా... ర్యాంప్‌పై మెరుపుల్లో మాత్రం వారి కంటే... ముందున్నారు నిన్నటి స్టార్ హీరోయిన్లు. ఫ్యాషన్ షోలలో తాజా లాక్మె ఫ్యాషన్ సమ్మర్ రిసార్ట్ షో దీనికి ఓ చక్కని నిదర్శనం. ముంబైలోని జియోగార్డెన్స్‌లో జరిగిన ‘లాక్మే ఫ్యాషన్ వీక్’లో మిడిల్ ఏజ్డ్ బాలీవుడ్ హీరోయిన్లు వన్నెతరగని సౌందర్యంతో వేదికను కళకళలాడించారు. షబానా ఆజ్మీ మొదలుకుని సంగీతా బిజిలానీ, జూహీ చావ్లా, లారా దత్తా, సుస్మితా సేన్, ప్రీతి జింటా, టాబూ... డిజైనర్ల క్రియేటివిటీకి తమ అందంతో ఆకర్షణను జత చేశారు. వీరిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మాత్రం ఇటీవలే తల్లిగా మారినా కరీనా కపూర్‌ని చెప్పాలి.
కుమారుడు తైమూర్ అలీఖాన్‌కు జన్మనిచ్చి సరిగ్గా 46 రోజుల్లోనే ఫ్యాషన్ పట్ల తనకున్న సహజసిద్ధమైన ఆసక్తితో ఆమె లాక్మె గ్రాండ్ ఫినాలే రోజున టాప్ డిజైనర్ అనితా డోంగ్రే దుస్తుల్లో దేవతను తలపించారు. అతి తక్కువ మేకప్‌తో ‘లిక్విడ్ గోల్డ్’ థీమ్‌కు తగినట్టుగా దుస్తులు ధరించి మెరిశారు. అరుదుగా మాత్రమే సినిమాల్లో కనిపిస్తూన్న మరో సీనియర్ హీరోయిన్ సుస్మితా సేన్ డిజైనర్ శశి వంగపల్లి రూపొందించిన పర్పుల్ కలర్ గౌన్‌లో ర్యాంప్‌పై వన్నెచిన్నెలు చిలకరించి, హర్షధ్వానాలు అందుకున్నారు. విచిత్రమేమిటంటే... ర్యాంప్‌వాక్ చేసిన పురుషుల్లో మాత్రం వరుణ్ ధావన్, అర్జున్ కపూర్, అమితాదాస్... వంటి యువహీరోలే ఉన్నారు.
నాటి స్టార్‌ల అట్రాక్షన్...
Published Mon, Feb 6 2017 11:35 PM | Last Updated on Tue, Sep 5 2017 3:03 AM
Advertisement
Advertisement