లీసా హేడన్
ముంబైలో గురువారం ప్రారంభం అయిన లాక్మే ఫ్యాషన్ వీక్ ర్యాంప్‌పై బాలీవుడ్ నటి, మోడల్ లీసా హేడన్.. క్రికెటర్ హార్థిక్ పాండ్యాతో కలిసి నడిచి తను ధరించిన ‘ఫ్లక్స్’ దుస్తుల కలెక్షన్‌కు రిచ్ లుక్‌ను తెచ్చారు. లీసా ర్యాంప్ వాక్ చేస్తున్నప్పుడు పాండ్యాతో పాటు లీసా దుస్తులను డిజైన్ చేసిన అమిత్ అగర్వాల్ కూడా ఆమెతో పాటు ఉన్నారు. రీసైక్లింగ్ చేసిన ఉత్పత్తులతో డిజైన్ చేయడంలో నిష్ణాతుడైన అమిత్.. లీసా కోసమే ప్రత్యేకంగా దుస్తులను రూపొందించి, ప్రదర్శింపజేశారు. గర్భిణి అయి ఉండి కూడా లీసా ర్యాంప్ వాక్ చెయ్యడం అక్కడొక ముచ్చటగొల్పే విశేషం అయింది.
Comments
Please login to add a commentAdd a comment