Lisa haydon
-
తొలిసారి కూతురు ఫొటో షేర్ చేసిన నటి
బాలీవుడ్ నటి, మోడల్ లీసా హెడెన్ ఇటీవల మూడోసారి తల్లైన సంగతి తెలిసిందే. జూన్ 22న పండంటి బిడ్డకు జన్మనించిన ఆమె ఇప్పటికి వరకు బేబీ ఫొటోలను షేర్ చేయలేదు. అంతేకాదు పుట్టింది ఆడబిడ్డా? మగపిల్లడా? అనేది కూడా స్పష్టం చేయలేదు. రెండు నెలలుగా తన చిన్నారిని చూపించకుండా అభిమానులను సస్పెన్స్‌లో ఉంచిన లిసా తొలిసారి కూతురు ఫొటోలను షేర్ చేసింది. ఈ సందర్భంగా చిన్నారి పేరు లారాగా ఆమె వెల్లడించింది. అయితే అగష్టు 1 నుంచి 7వ తేదీల్లో జరిగిన వరల్డ్ బ్రెస్ట్ ఫీడ్ సెలబ్రెషన్స్ అనంతరం లిసా తన కూతురికి పాలు పడుతున్న ఫొటోను షేర్ చేసింది. అంతేగాక ఈ సందర్భంగా ఆమె పిల్లలకు తల్లి పాల అవశ్యకత గురించి వివరించింది. View this post on Instagram A post shared by Lisa Lalvani (@lisahaydon) కాగా ఓ కొత్త అతిథి జూన్‌లో తమ కుటుంబంలోకి రాబోతున్నారంటూ గత ఫిబ్రవరిలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తన బేబీ బంప్ ఫొటోలను షేర్ చేస్తూ తల్లిపాల అవశ్యకత, పాలు ఇవ్వడం వల్ల కలిగే లాభాల గురించి తల్లులకు అవగాహన కల్పిస్తు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేది. ఇక బిడ్డ పుట్టగానే సోషల్ మీడియా దూరంగా ఆమె తాజాగా కూతురు ఫొటోను షేర్ చేస్తూ సరికొత్తగా తిరిగి ఎంట్రీ ఇచ్చింది. చెన్నైకి చెందిన లీసా హెడెన్ మోడల్‌గా కెరీర్ ఆరంభించింది. తర్వాత ఆమెకు బాలీవుడ్లో అవకాశాలు రావడంతో ముంబైకి వెళ్లింది. హిందీలో 'హౌస్‌ఫుల్ 2', 'క్వీన్' వంటి చిత్రాలలో నటించిన ఆమె 2016లో వ్యాపారవేత్త డినో లల్వానీని పెళ్లాడింది. వీరిద్దరికి ఇద్దరు కుమారులు జాక్, లియో కాగా ఇటీవల కూతురు జన్మించింది. View this post on Instagram A post shared by Lisa Lalvani (@lisahaydon) -
మూడోసారి జన్మనిచ్చిన నటి, సీక్రెట్‌గా ఉంచిందేంటి?
బాలీవుడ్ నటి, మోడల్ లీసా హెడెన్ మూడోసారి తల్లైంది. ఇటీవలే ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే ఈ నటి పసికందు ఫొటోను మాత్రం షేర్ చేయలేదు. దీంతో ఆమెకు పుట్టింది ఆడబిడ్డా? మగపిల్లాడా? అనేది తెలియరాలేదు. ఇదిలా వుంటే ఓ కొత్త అతిథి జూన్‌లో మా కుటుంబంలోకి రాబోతున్నారంటూ గతంలో ఆమె బేబీబంప్ ఫొటోలను షేర్ చేసింది. అంతేకాదు, తల్లిపాల ఆవశ్యకత, పాలు ఇవ్వడం వల్ల కలిగే లాభాల గురించి తల్లులకు అవగాహన కల్పించింది. మరి ఇప్పుడు మూడోసారి తల్లైన ఆమె ఈ విషయాన్ని ఎందుకు సీక్రెట్‌గా ఉంచిందనేది అభిమానులకు అంతు చిక్కడం లేదు. పైగా ఓ బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని కూడా ఆమె తనంతట తానుగా వెల్లడించలేదు. మీ మూడో పాప ఎక్కడున్నారు? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా నా చేతుల్లో ఉంది అని సమాధానమిచ్చింది. దీంతో ఆమె తల్లైన విషయం బయటపడింది. చెన్నైలో జన్మించిన లీసా హెడెన్ మోడల్‌గా కెరీర్ ఆరంభించింది. తర్వాత వెండితెరపై అవకాశాలు రావడంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. 'హౌస్‌ఫుల్ 2', 'క్వీన్' వంటి చిత్రాలతో ప్రేక్షకులకు ఆమె మరింత దగ్గరైంది. 2016లో వ్యాపారవేత్త డినో లల్వానీని పెళ్లాడిన ఆమెకు ఇద్దరు కుమారులు జాక్, లియో ఉన్నారు. చదవండి: ఆ వార్త చూసి నా గుండె కలచివేసింది: సంపూ -
బేబీ బంప్‌తో వర్కవుట్ ఫోటో షేర్ చేసిన నటి
ముంబై : బాలీవుడ్ నటి, మోడల్ లీసా హెడెన్ ఇటీవలె తాను మూడోసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు ఫోటోలను షేర్ చేసుకునే లీసా తాజాగా తన బేబీ బంప్ ఫోటోలను పంచుకుంది. గర్భిణీగా ఉన్నా డాక్టర్ల సూచనలతో వ్యాయామం చేస్తున్నారు. ఈ మేరకు ఇండోర్ సైక్లింగ్ వర్కవుట్ సెషన్‌కు ముందు అద్దంలో చూస్తూ బేబీ బంప్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే లీసా హెడెన్... తల్లి పాల ఆవశ్యకత, పాలు ఇవ్వడం వల్ల కలిగే లాభాల గురించి తల్లులకు అవగాహన కల్పించడం వంటి సామాజిక దృక్పథం కలిగిన అంశాల గురించి ప్రచారం చేస్తున్నారు. కాగా చెన్నైలో జన్మించిన లీసా హేడెన్ మోడల్‌గా కెరీర్ ఆరంభించి బీ-టౌన్లో అడుగుపెట్టారు. చాలా ఏళ్లపాటు, హాంకాంగ్‌లోనే ఉన్న ఆమె... 'హౌస్‌ఫుల్-2', 'క్వీన్' వంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇక 2016లో వ్యాపారవేత్త డినో లల్వానీని పెళ్లాడిన లీసా వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు. వారికి ఇద్దరు కుమారులు జాక్ లల్వానీ, లియో లల్వానీ ఉన్నారు. చదవండి : (మూడోసారి తల్లి కాబోతున్న నటి) (భర్త కోసం ఆ పాత్ర ఒప్పుకున్న దీపిక) -
మూడోసారి తల్లి కాబోతున్న నటి
ముంబై: ‘‘ఈ జూన్‌లో నంబర్ 3 రాబోతున్నారు’’ అంటూ బాలీవుడ్ భామ లీసా హెడెన్ అభిమానులతో శుభవార్త పంచుకున్నారు. తను మూడోసారి తల్లి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ మేరకు.. ‘‘ఇన్నాళ్లు బద్ధకం కారణంగా ఈ ప్రకటన కాస్త ఆలస్యం అయింది. ఇప్పుడు నేను మీతో చాట్ చేయడానికి ఓ కారణం ఉంది’’ అంటూ మంగళవారం ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో లీసా సేదతీరుతూ ఉండగా... ఆమె పెద్ద కుమారుడు జాక్ అక్కడికి వచ్చాడు. దీంతో.. ‘‘జాకీ, అమ్మ పొట్టలో ఎవరు ఉన్నారో వీళ్లకు చెప్తావా?’’ అని తల్లి ప్రశ్నించగా.. ‘‘చెల్లెలు’’ అని చిన్నారి జాక్ సమాధానమిచ్చాడు. ఇక ఈ వీడియోకు ఇప్పటికే 2 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. మూడోసారి తల్లిదండ్రులు కాబోతున్న లీసా దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా చెన్నైలో జన్మించిన లీసా హేడెన్ మోడల్‌గా కెరీర్ ఆరంభించి బీ-టౌన్లో అడుగుపెట్టారు. చాలా ఏళ్లపాటు, హాంకాంగ్‌లోనే ఉన్న ఆమె... 'హౌస్‌ఫుల్-2', 'క్వీన్' వంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇక 2016లో వ్యాపారవేత్త డినో లల్వానీని పెళ్లాడిన లీసా వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు. వారికి ఇద్దరు కుమారులు జాక్ లల్వానీ, లియో లల్వానీ ఉన్నారు. కాగా, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే లీసా హెడెన్... తల్లి పాల ఆవశ్యకత, పాలు ఇవ్వడం వల్ల కలిగే లాభాల గురించి తల్లులకు అవగాహన కల్పించడం వంటి సామాజిక దృక్పథం కలిగిన అంశాల గురించి ప్రచారం చేస్తున్నారు. తల్లి కావడంలోని మాధుర్యాన్ని వివరిస్తూ గతంలో అనేక ఫొటోలు షేర్ చేసిన ఆమె.. ఇప్పుడు మనసుకు హత్తుకునే వీడియోతో గుడ్‌న్యూస్ షేర్ చేసుకున్నారు. చదవండి: జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇంటి వారయ్యారు! చదవండి: ‘సలార్’ స్పెషల్ సాంగ్‌లో ప్రియాంక చోప్రా! -
‘ఈ విషయం నమ్మలేకపోతున్నా’
‘‘వీళ్లిద్దరూ నా హృదయాన్ని తాకారు. మీ ఇద్దరినీ అలా ప్రేమగా చూస్తూ ఉండిపోతాను అంతే. లియో అండ్ జాక్... నేను మీ అమ్మని అనే విషయాన్ని నమ్మలేకపోతున్నా. ఇక ఇది నా వాలెంటైన్ కోసం... నిన్నటితో మనం కలిసి ఐదేళ్లు పూర్తైంది. ఒకనాకొ శుక్రవారం నాడు నా జీవితం పూర్తిగా మారిపోయింది. నాతో కలిసి ఈ కుటుంబాన్ని నిర్మించినందుకు ధన్యవాదాలు’’అంటూ బాలీవుడ్ నటి లీసా హెడెన్ తన భర్త, పిల్లల్ని ఉద్దేశించి ప్రేమ పూర్వక సందేశం పోస్ట్ చేశారు. వాలంటైన్స్‌డే సందర్భంగా తన ఇద్దరు కుమారులు కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. కాగా లీసా హెడెన్ ఇటీవలే రెండోసారి తల్లైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన చిన్న కుమారుడికి లియో అని నామకరణం చేసినట్లు శనివారం ఆమె వెల్లడించారు. కాగా చెన్నైలో పుట్టిన లీసా హేడెన్ మోడల్‌గా కెరీర్ ఆరంభించి బాలీవుడ్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ కాలం విదేశాల్లోనే ఉన్న లీసా... 'హౌస్‌ఫుల్-2', 'క్వీన్' వంటి సినిమాలతో ప్రేక్షకులకు చేరువయ్యారు. 2016లో వ్యాపారవేత్త డినో లల్వానీని లీసా వివాహం చేసుకున్నారు. ఇక సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే లీసా... తల్లి పాల ఆవశ్యకత, పాలు ఇవ్వడం కలిగే లాభాల గురించి తల్లులకు అవగాహన కల్పించడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. View this post on Instagram This little blessing has touched my heart in a way nothing else ever has. Been totally speechless and in love watching you both and can’t believe I get to be your mama. ‘Leo & Zack’ #Brothers And my forever valentine— Yesterday was our 5 year anniversary of the day we met, on Feb 13th one freaky Friday, life has never been the same since. Thank you Hub for building family with me. #HeartRevolution 💙💙💙🧡 A post shared by Lisa Lalvani (@lisahaydon) on Feb 15, 2020 at 12:45am PST -
గర్భిణిగా ర్యాంప్ వాక్
ముంబైలో గురువారం ప్రారంభం అయిన లాక్మే ఫ్యాషన్ వీక్ ర్యాంప్‌పై బాలీవుడ్ నటి, మోడల్ లీసా హేడన్.. క్రికెటర్ హార్థిక్ పాండ్యాతో కలిసి నడిచి తను ధరించిన ‘ఫ్లక్స్’ దుస్తుల కలెక్షన్‌కు రిచ్ లుక్‌ను తెచ్చారు. లీసా ర్యాంప్ వాక్ చేస్తున్నప్పుడు పాండ్యాతో పాటు లీసా దుస్తులను డిజైన్ చేసిన అమిత్ అగర్వాల్ కూడా ఆమెతో పాటు ఉన్నారు. రీసైక్లింగ్ చేసిన ఉత్పత్తులతో డిజైన్ చేయడంలో నిష్ణాతుడైన అమిత్.. లీసా కోసమే ప్రత్యేకంగా దుస్తులను రూపొందించి, ప్రదర్శింపజేశారు. గర్భిణి అయి ఉండి కూడా లీసా ర్యాంప్ వాక్ చెయ్యడం అక్కడొక ముచ్చటగొల్పే విశేషం అయింది. -
శుభవార్త చెప్పిన నటి!
‘పార్టీలో చేరే నాలుగో వ్యక్తి దారిలోనే ఉన్నారు’ అంటూ బాలీవుడ్ బ్యూటీ లీసా హెడెన్ అభిమానులకు శుభవార్త చెప్పారు. తను రెండోసారి తల్లి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా సన్నిహితులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా భర్త డినో లల్వానీ, కుమారుడు జాక్‌తో కలిసి నీటిలో నిలుచున్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ క్రమంలో ఆమెకు శభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోనమ్ కపూర్, పూజా హెగ్డే వంటి బీ-టౌన్ ప్రముఖులు లీసాకు అభినందనలు తెలిపారు. కాగా చెన్నైలో పుట్టిన లీసా హేడెన్ మోడల్‌గా కెరీర్ ఆరంభించి బాలీవుడ్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ కాలంలో విదేశాల్లోనే ఉన్న ఆమె...'హౌస్‌ఫుల్-2', 'క్వీన్' వంటి సినిమాలతో ప్రేక్షకులకు చేరువయ్యారు. 2016లో వ్యాపారవేత్త డినో లల్వానీని లీసా పెళ్లి చేసుకున్నారు. వారికి కుమారుడు జాక్ లల్వానీ ఉన్నాడు. ఇక సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే లీసా... తల్లి పాల ఆవశ్యకత, పాలు ఇవ్వడం కలిగే లాభాల గురించి తల్లులకు అవగాహన కల్పించడంలో తన వంతు పాత్ర పోషించారు. View this post on Instagram Party of four on the way 🥳 A post shared by Lisa Lalvani (@lisahaydon) on Aug 17, 2019 at 3:28am PDT -
పాలివ్వడానికి సిగ్గెందుకు?!
‘‘నువ్వేమైనా పశువ్వా... ఎక్కడపడితే అక్కడ బిడ్డకు పాలివ్వడానికి?’’ అంటూ కుప్పలుతెప్పలు ట్రోలింగ్స్ లిసాహెడెన్కు. ఇంతకీ ఆమె ఎవరు? ‘‘క్వీన్’’సినిమా చూశారా? కంగనా రనౌత్‌కి ఫ్రెండ్‌గా నటించింది. ఆయెషా సినిమా చూసినా తెలుస్తుంది లిసా ఎవరో! బోల్డ్ అండ్ బ్రిలియంట్ యాక్ట్రెస్. మోడల్ కూడా. తల్లిపాల విలువ గురించి ప్రచారం జరుగుతున్న సందర్భంగా అంతే బోల్డ్‌గా లిసా తన బిడ్డకు పాలిస్తున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ‘‘బిడ్డకు పాలివ్వడానికి ఎందుకు సిగ్గుపడాలి? బిడ్డకు ఆకలైనప్పుడు మీరెక్కడున్నా నిరభ్యంతరంగా.. నిస్సంకోచంగా పాలివ్వచ్చు.. నేనూ ఇస్తాను’’ అనే కామెంట్ రాసింది. ఓ మహిళగా.. తల్లిగా.. తల్లిపాల అవసరం గురించి చెప్పడం తన బాధ్యతగా భావించే.. ఆ ఫొటోను పోస్ట్ చేసింది ఆ అమ్మ. కానీ లిసాను అమ్మలా చూడకుండా.. ఓ నటిగా.. సెక్సువల్ ఆబ్జెక్ట్‌గా ట్రీట్ చేస్తూ చవకబారు కామెంట్లతో ఆమెను అబ్యూజ్ చేశారు కొందరు నెటిజన్లు. యేడాది అవుతున్నా ఆ ట్రోలింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. సోషల్ మీడియాలోనే కాదు.. ఆమె ఎక్కడికి వెళ్లినా.. ఏ ఈవెంట్లో కనిపించినా.. ‘‘మీ బిడ్డకు ఇంకా పాలిస్తున్నారా? ఫొటోలు పెట్టట్లేదే?’’ అంటూ ఎగతాళి చేస్తున్నారట. ‘‘ఇలాంటి మాటలు, ప్రశ్నలతో చాలా అన్‌కంఫర్ట్‌గా ఫీలవుతున్నాను. సేమ్‌టైమ్ వాళ్ల మీద జాలి కూడా వేస్తోంది. ఈరకంగా మాట్లాడే వాళ్లంతా మగవాళ్లే. పాపం.. వాళ్లకు తెలియదు కదా తల్లి బాధ్యతేంటో? వాళ్లూ తల్లి అయితే ఇలా మాట్లాడరు’’ అంటుంది లిసా. ఆమె కొడుకు జాక్.. యేడాది వయసు. మాతృత్వపు ఆనందాన్ని ఆస్వాదిస్తోంది. పెళ్లయినా.. ఆడవాళ్లు ఇండిపెండెంట్‌గానే ఉంటున్నారు. చంటిపిల్లను చంకన వేసుకొని బయట పనులు చక్కదిద్దుకోవాల్సిందే. ఏ వర్గం మహిళలైనా ఇందుకు మినహాయింపు కాదు. బిడ్డకు ఆకలేసినప్పుడు తల్లి పాలు ఇవ్వాల్సిందే. బయట.. పది మంది మగాళ్ల మధ్య.. ‘మా అమ్మ ఉంది.. ఆకలేసినా నేను ఓర్చుకోవాలి.. ఏడ్వకూడదు’ అని నెలల బిడ్డకు తెలియదు కదా. ‘అయ్యో నలుగురి మధ్య పాలెలా ఇవ్వాలి’ అని తల్లీ సంకోచించకూడదు. ఆ విషయాన్నే సెలబ్రిటీ హోదాలో లిసా చెప్పింది. దానికి సెక్సువల్ కలర్ ఎందుకు యాడ్ చేయడం? అని చాలా మంది మహిళలు లిసాను సపోర్ట్ చేశారు. ఇలాంటి ఆలోచనలు మారాలనే.. స్త్రీలను సాటి మనుషులుగా చూడాలనే ఈ చైతన్యం అంటున్నారు. ‘‘పోషకాహార లోపం, అందం మీదున్న మమకారం, బిడ్డకు పాలు పట్టడం పట్ల ఉన్న అపోహలు.. పాలు పడని శరీర తత్వం.. ఇలా రకరకాల కారణాలతో తల్లిపాలకు బిడ్డలు దూరమవుతున్నారు. అలాంటి అపోహలన్నిటినీ తొలగించి.. తల్లి పాల మీద తల్లులకు అవేర్నెస్ కల్పించడంలో నేనూ భాగమయ్యానన్న సంతృప్తి ఉంది. అదృష్టవశాత్తు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నా బిడ్డకు పాలివ్వగలిగాను. బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల తల్లికి, బిడ్డకు మధ్య ఏర్పడే అనుబంధం.. అమూల్యమైనది. అది బిడ్డ శారీరకంగానే కాదు మానసికంగానూ దృఢంగా ఉండేలా చేస్తుంది. ఈ విషయాన్నే ప్రతి న్యూ మదర్‌కి చెప్పాలనుకున్నాను.. చెప్పాను.. చెప్తాను కూడా! ట్రోలింగ్స్ బాధపెట్టినా పట్టించుకోను. నిజానికి మదర్ అయ్యాక ఇలాంటివి ఇగ్నోర్ చేసే సహనమూ వచ్చింది (నవ్వుతూ). పిల్లలకు ఆరోగ్యకరమైన బాల్యాన్ని, అంతే హెల్దీ ఫ్యూచర్‌ను ఇవ్వడమే పేరెంట్స్ లక్ష్యం. దాన్నే ప్రచారం చేస్తాను’’ అంటోంది లిసా. – శరాది -
నటి ప్రేమ పెళ్లి.. అంతలోనే పెను దుమారం!
వివాహం చేసుకుని భర్తతో సుఖసంతోషాలతో గడపాలనుకున్న హీరోయిన్ లిసా హెడాన్ తీవ్ర విమర్శల పాలైంది. హౌస్‌ఫుల్-2, 'క్వీన్' వంటి బాలీవుడ్ సినిమాలతో ఆకట్టుకున్న లిసా ఏడాదినుంచి డేటింగ్ చేస్తున్న ప్రియుడు డినో లల్వానీని వివాహం చేసుకుంది. తన పెళ్లి విషయాలను ఫొటోలు, వీడియోలతో సహా సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. లిసా భర్త డినో లల్వానీ తండ్రి గులు లాల్వానీ పాకిస్థాన్‌లో జన్మించిన బ్రిటన్ వ్యాపారవేత్త. సోషల్ మీడియాలో నటి పెళ్లి ఫొటోలు హల్ చల్ కావడంతో వివాదం మొదలైంది. ఆమె పాకిస్తాన్ వ్యక్తిని వివాహం చేసుకుందని విమర్శలు వెల్లువెత్తాయి. అందుకు ఆమె మామ గులు లల్వానీ పాకిస్తాన్ లో జన్మించడమే కారణం. అయితే ఆ వదంతులపై నటి లిసా స్పందిస్తూ సోషల్ మీడియా సైట్ ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చుకుంది. ప్రస్తుతం భారత్, పాక్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న తరుణంలో ట్విట్టర్ లో ఆమె భర్త పాకిస్తానీ అంటూ ప్రచారం జరిగింది. తన మామ గులు లల్వానీ అవిభాజ్య భారత్ గా ఉన్న సమయంలో కరాచీలో పుట్టారని, పాక్ ఏర్పాటు తర్వాత భారత్ లోనే ఉంటున్నారని.. ఆయన భారత పౌరుడని నటి లిసా ట్వీట్ లో పేర్కొంది. భారత్ నుంచి ఆయన బ్రిటన్ వెళ్లి అక్కడ స్థిరపడ్డారని వెల్లడించింది. తన భర్త పాకిస్తాన్ పౌరుడు కాదని వరుస ట్వీట్లలో వివరించింది. ప్రపంచం ఎప్పుడూ ప్రేమను, ప్రేమికులను కోరుకుంటుంది తప్ప ద్వేషాన్ని ఎప్పుడూ కాదని మరో ట్వీట్ లో లిసా హెడాన్ ఘాటుగా స్పందించింది. Dear @dna my husband is Indian. My father in law - Gulu Lalvani, was born in pre partition India and was thrown out of what is today... — Lisa Haydon (@HaydonLisa) 2 November 2016 The world needs lovers not haters❤️ — Lisa Haydon (@HaydonLisa) 2 November 2016 -
ప్రియుడిని పెళ్లి చేసుకున్న హీరోయిన్!
'హౌస్‌ఫుల్-2', 'క్వీన్' వంటి సినిమాలతో ఆకట్టుకున్న బాలీవుడ్ కథానాయిక లిసా హేడెన్ వైవాహిక జీవితంలో అడుగుపెట్టింది. ఏడాదికాలంగా డేటింగ్ చేస్తున్న తన ప్రియుడు డినో లాల్వానీని ఆమె పెళ్లి చేసుకుంది. తాజాగా విడుదలైన ‘యే దిల్ హై ముష్కిల్’ సినిమాలోనూ అలరించిన ఈ ముద్దుగుమ్మ తాను పెళ్లాడిన విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. అందమైన తమ పెళ్లి ఫొటోలను అభిమానులతో పంచుకుంది. చెన్నైలో పుట్టిన లిసా హేడెన్ తన జీవితం ఎక్కువకాలంలో విదేశాల్లోనే ఉన్నది. ఆస్ట్రేలియా, అమెరికాలో కొన్నాళ్లు ఉన్న ఆమె మోడలింగ్ కోసం ముంబైకి మకాం మార్చింది. మోడలింగ్ నుంచి బాలీవుడ్లో ఆరంగేట్రం చేసిన ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తున్నది. ఆమె ఏడాదికాలంతా డినో లాల్వానీతో డేటింగ్ చేస్తోంది. డినో పాకిస్థాన్‌లో జన్మించిన బ్రిటన్ వ్యాపారవేత్త గుల్లు లాల్వానీ కుమారుడు. 2008లో అతను తండ్రి కంపెనీ బినాటోన్ టెలికంకు చైర్మన్‌గా ఎన్నికయ్యాడు. లండన్‌లో యూనిసెఫ్ హలోవిన్ బాల్ కార్యక్రమం సందర్భంగా తొలిసారిగా చూపులు కలిపిన ఈ జంట ఆ తర్వాత ప్రేమలో పడి.. ఏడాదికాలంగా సన్నిహితంగా ఉంటున్నారు. -
అతన్నే పెళ్లి చేసుకోబోతున్నా: హీరోయిన్
బాలీవుడ్ కథానాయిక లిసా హేడెన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నది. 'హౌస్‌ఫుల్-2', 'క్వీన్' వంటి సినిమాలతో బాలీవుడ్లో మెరిసిన ఈ సుందరాంగి తాను పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని చాలా స్టైలిష్ గా ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. పెదవితో పెదవిని పెనవేసుకొని తన ప్రియుడికి ముద్దుపెడుతున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసి.. 'ఇతన్ని పెళ్లి చేసుకోబోతున్నా' అంటూ కామెంట్ పెట్టింది. ప్రేమికుడు డినో లాల్వానీని ఆమె త్వరలో వివాహం చేసుకోబోతున్నది. చెన్నైలో పుట్టిన లిసా హేడెన్ తన జీవితం ఎక్కువకాలంలో విదేశాల్లోనే ఉన్నది. ఆస్ట్రేలియా, అమెరికాలో కొన్నాళ్లు ఉన్న ఆమె మోడలింగ్ కోసం ముంబైకి మకాం మార్చింది. మోడలింగ్ నుంచి బాలీవుడ్లో ఆరంగేట్రం చేసిన ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తున్నది. ఆమె ఏడాదికాలంతా డినో లాల్వానీతో డేటింగ్ చేస్తోంది. డినో పాకిస్థాన్‌లో జన్మించిన బ్రిటన్ వ్యాపారవేత్త గుల్లు లాల్వానీ కుమారుడు. 2008లో అతను తండ్రి కంపెనీ బినాటోన్ టెలికంకు చైర్మన్‌గా ఎన్నికయ్యాడు. లండన్‌లో యూనిసెఫ్ హలోవిన్ బాల్ కార్యక్రమం సందర్భంగా తొలిసారిగా చూపులు కలిపిన ఈ జంట ఆ తర్వాత ప్రేమలో పడి.. ఏడాదికాలంగా సన్నిహితంగా ఉంటున్నారు. -
అనుష్క ముక్కుసూటి మనిషి
తాజాగా సుల్తాన్ సినిమాలో మల్లయోధురాలి పాత్ర పోషించిన అనుష్కా శర్మ.. ఆ సినిమాలో తన పాత్ర లాగే చాలా ముక్కుసూటిగా వ్యవహరించే మనిషట. అదే రణ్‌బీర్ కపూర్ అయితే మాత్రం చాలా కూల్‌గా ఉంటాడట. ఈ విషయాలు ఎవరు చెప్పారని అనుకుంటున్నారా.. ప్రముఖ మోడల్, నటి అయిన లీసా హేడెన్ ఇదంతా తెలిపింది. తాజాగా ఆమె ‘ఏ దిల్ హై ముష్కిల్’ అనే సినిమాలో అతిథిపాత్రలో కనిపిస్తోంది. అందులో రణ్‌బీర్ కపూర్, అనుష్కా శర్మ జంటగా నటిస్తున్నారు. కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లీసా హేడెన్ తళుక్కుమంటుంది. ఐశ్వర్యారాయ్ బచ్చన్ కూడా ఒక ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఐశ్వర్య అందం చూసి తాను ఆమె వద్దకు వెళ్లడానికే కొంత సిగ్గుపడ్డానని, అనుష్క అయితే తనకు ఏం కావాలో, తానేం చేస్తానో ముక్కుసూటిగా చెప్పేస్తుందని లీసా అంటోంది. రణ్‌బీర్ కపూర్ చాలా కూల్‌గా ఉంటాడని, అతడితో కలిసి నటిస్తుంటే ఒకటే నవ్వులు వస్తుంటాయని తెలిపింది. తన పాత్ర చూసి నిజంగా చాలా మంచి కిక్ వచ్చిందని, ప్రస్తుతానికి అది మాత్రమే చెప్పగలనని అంటోంది. -
హృతిక్ ‘బ్రేక్’!
సినిమా షూటింగ్.. ఆపై ప్రమోషన్... దాదాపు ఏడాదిగా క్షణం తీరిక లేకుండా బిజీగా గడిపిన సూపర్ స్టార్ హృతిక్ రోషన్‌కు మైండ్ బ్లాకయినట్టుంది. మరో భారీ వెంచర్‌ను స్టార్ట్ చేసేముందు మానసిక ప్రశాంతత కోరుకుంటున్నాడు. అలాగే ఎప్పుడూ కాస్త వైవిధ్యం ఉంటేనే జీవితం బోరు కొట్టకుండా ఉంటుందంటున్నాడు. తాజాగా రిలీజైన ‘బ్యాంగ్ బ్యాంగ్’ బాక్సాఫీస్‌లో రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పటి వరకు దాదాపు 71.62 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. ఇందులో స్టంట్స్‌కు విపరీతంగా శ్రమించిన హీరో... ‘మెగా వెంచర్‌కు ముందు నూతనోత్సాహం పొందేందుకు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నా’ అన్నాడు. నచ్చితే ఓకే! డబ్బు అంత సవుస్య కాదని అంటోంది బాలీవుడ్ భావు లీసా హైడన్. నచ్చిన పాత్ర దొరికితే పారితోషికం తనకు పెద్ద విషయుమే కాదని సెలవిస్తోంది. తనకు దొరికిన పాత్రను బట్టి, తనతో సినివూ తీసే నిర్మాణ సంస్థ బట్టి పారితోషికం మారుతూ ఉంటుందని, అవేవీ పట్టించుకోకుండా అమాతం తన పారితోషికాన్ని పెంచేయబోనని చెబుతోంది. కంగనా రనౌత్ ఇటీవల తన పారితోషికాన్ని ఏకంగా యూభైశాతం పెంచేయుడంతో లీసా ఆమెపైనే సెటైర్లు వేస్తోందని బాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. సూపర్ రెస్పాన్స తమ దేశానికి చెందిన నటీనటుల చిత్రాల పట్ల భారతీయుుల స్పందన ఆనందంగా ఉందని పాకిస్థానీ నటి హుమైమా మలిక్ హర్షం వ్యక్తం చేస్తోంది. ‘రాజా నట్వర్లాల్’తో తెరంగేట్రం చేసిన హుమైమా, ఇటీవల కరాచీలో ‘ఖూబ్సూరత్’ ప్రీమియుర్ షో తిలకించిన సందర్భంగా మీడియూతో మాట్లాడింది. ‘ఖూబ్సూరత్’లో పాకిస్థానీ నటుడు ఫవద్ ఖాన్ నటించిన సంగతి తెలిసిందే. భారత్-పాక్ సినీరంగాల వుధ్య వుంచి స్నేహపూర్వక వాతావరణం ఉందని, పాకిస్థానీ నటీనటుల ప్రతిభను భారతీయులు ఆదరిస్తున్నారని హుమైమా చెప్పింది.