ముంబై: ‘‘ఈ జూన్‌లో నంబర్ 3 రాబోతున్నారు’’ అంటూ బాలీవుడ్ భామ లీసా హెడెన్ అభిమానులతో శుభవార్త పంచుకున్నారు. తను మూడోసారి తల్లి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ మేరకు.. ‘‘ఇన్నాళ్లు బద్ధకం కారణంగా ఈ ప్రకటన కాస్త ఆలస్యం అయింది. ఇప్పుడు నేను మీతో చాట్ చేయడానికి ఓ కారణం ఉంది’’ అంటూ మంగళవారం ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో లీసా సేదతీరుతూ ఉండగా... ఆమె పెద్ద కుమారుడు జాక్ అక్కడికి వచ్చాడు. దీంతో.. ‘‘జాకీ, అమ్మ పొట్టలో ఎవరు ఉన్నారో వీళ్లకు చెప్తావా?’’ అని తల్లి ప్రశ్నించగా.. ‘‘చెల్లెలు’’ అని చిన్నారి జాక్ సమాధానమిచ్చాడు.
ఇక ఈ వీడియోకు ఇప్పటికే 2 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. మూడోసారి తల్లిదండ్రులు కాబోతున్న లీసా దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా చెన్నైలో జన్మించిన లీసా హేడెన్ మోడల్‌గా కెరీర్ ఆరంభించి బీ-టౌన్‌లో అడుగుపెట్టారు. చాలా ఏళ్లపాటు, హాంకాంగ్‌లోనే ఉన్న ఆమె... 'హౌస్‌ఫుల్-2', 'క్వీన్' వంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇక 2016లో వ్యాపారవేత్త డినో లల్వానీని పెళ్లాడిన లీసా వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు. వారికి ఇద్దరు కుమారులు జాక్ లల్వానీ, లియో లల్వానీ ఉన్నారు.
కాగా, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే లీసా హెడెన్... తల్లి పాల ఆవశ్యకత, పాలు ఇవ్వడం వల్ల కలిగే లాభాల గురించి తల్లులకు అవగాహన కల్పించడం వంటి సామాజిక దృక్పథం కలిగిన అంశాల గురించి ప్రచారం చేస్తున్నారు. తల్లి కావడంలోని మాధుర్యాన్ని వివరిస్తూ గతంలో అనేక ఫొటోలు షేర్ చేసిన ఆమె.. ఇప్పుడు మనసుకు హత్తుకునే వీడియోతో గుడ్‌న్యూస్ షేర్ చేసుకున్నారు.
చదవండి: జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇంటి వారయ్యారు!
Comments
Please login to add a commentAdd a comment