బేబీ బంప్‌తో వర్కవుట్‌ ఫోటో షేర్‌ చేసిన నటి | Lisa Haydon Share A Mirror Selfie Flaunting Her Baby Bump | Sakshi
Sakshi News home page

బేబీ బంప్‌తో వర్కవుట్‌ ఫోటో షేర్‌ చేసిన నటి

Published Sat, Feb 20 2021 12:51 PM | Last Updated on Sat, Feb 20 2021 12:55 PM

Lisa Haydon Share A Mirror Selfie Flaunting Her Baby Bump - Sakshi

ముంబై : బాలీవుడ్‌ నటి, మోడల్‌ లీసా హెడెన్‌ ఇటీవలె తాను మూడోసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు ఫోటోలను షేర్‌ చేసుకునే లీసా తాజాగా తన బేబీ బంప్‌ ఫోటోలను పంచుకుంది. గర్భిణీగా ఉన్నా డాక్టర్ల సూచనలతో వ్యాయామం చేస్తున్నారు. ఈ మేరకు ఇండోర్‌ సైక్లింగ్‌  వర్కవుట్‌ సెషన్‌కు ముందు అద్దంలో చూస్తూ బేబీ బంప్‌ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. 

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే లీసా హెడెన్‌... తల్లి పాల ఆవశ్యకత, పాలు ఇవ్వడం వల్ల కలిగే లాభాల గురించి తల్లులకు అవగాహన కల్పించడం వంటి సామాజిక దృక్పథం కలిగిన అంశాల గురించి ప్రచారం చేస్తున్నారు. కాగా చెన్నైలో జన్మించిన లీసా హేడెన్‌ మోడల్‌గా కెరీర్‌ ఆరంభించి బీ-టౌన్‌లో అడుగుపెట్టారు. చాలా ఏళ్లపాటు, హాంకాంగ్‌లోనే ఉన్న ఆమె... 'హౌస్‌ఫుల్‌-2', 'క్వీన్‌' వంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇక 2016లో వ్యాపారవేత్త డినో లల్వానీని పెళ్లాడిన  లీసా వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు. వారికి ఇద్దరు కుమారులు జాక్‌ లల్వానీ, లియో లల్వానీ ఉన్నారు. 

చదవండి : (మూడోసారి తల్లి కాబోతున్న నటి)
(భర్త కోసం ఆ పాత్ర ఒప్పుకున్న దీపిక)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement