‘పార్టీలో చేరే నాలుగో వ్యక్తి దారిలోనే ఉన్నారు’ అంటూ బాలీవుడ్ బ్యూటీ లీసా హెడెన్ అభిమానులకు శుభవార్త చెప్పారు. తను రెండోసారి తల్లి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా సన్నిహితులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా భర్త డినో లల్వానీ, కుమారుడు జాక్‌తో కలిసి నీటిలో నిలుచున్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ క్రమంలో ఆమెకు శభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోనమ్ కపూర్, పూజా హెగ్డే వంటి బీ-టౌన్ ప్రముఖులు లీసాకు అభినందనలు తెలిపారు.
కాగా చెన్నైలో పుట్టిన లీసా హేడెన్ మోడల్‌గా కెరీర్ ఆరంభించి బాలీవుడ్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ కాలంలో విదేశాల్లోనే ఉన్న ఆమె...'హౌస్‌ఫుల్-2', 'క్వీన్' వంటి సినిమాలతో ప్రేక్షకులకు చేరువయ్యారు. 2016లో వ్యాపారవేత్త డినో లల్వానీని లీసా పెళ్లి చేసుకున్నారు. వారికి కుమారుడు జాక్ లల్వానీ ఉన్నాడు. ఇక సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే లీసా... తల్లి పాల ఆవశ్యకత, పాలు ఇవ్వడం కలిగే లాభాల గురించి తల్లులకు అవగాహన కల్పించడంలో తన వంతు పాత్ర పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment