బాలీవుడ్ నటి, మోడల్ లీసా హెడెన్ ఇటీవల మూడోసారి తల్లైన సంగతి తెలిసిందే. జూన్ 22న పండంటి బిడ్డకు జన్మనించిన ఆమె ఇప్పటికి వరకు బేబీ ఫొటోలను షేర్ చేయలేదు. అంతేకాదు పుట్టింది ఆడబిడ్డా? మగపిల్లడా? అనేది కూడా స్పష్టం చేయలేదు. రెండు నెలలుగా తన చిన్నారిని చూపించకుండా అభిమానులను సస్పెన్స్‌లో ఉంచిన లిసా తొలిసారి కూతురు ఫొటోలను షేర్ చేసింది. ఈ సందర్భంగా చిన్నారి పేరు లారాగా ఆమె వెల్లడించింది. అయితే అగష్టు 1 నుంచి 7వ తేదీల్లో జరిగిన వరల్డ్ బ్రెస్ట్ ఫీడ్ సెలబ్రెషన్స్ అనంతరం లిసా తన కూతురికి పాలు పడుతున్న ఫొటోను షేర్ చేసింది. అంతేగాక ఈ సందర్భంగా ఆమె పిల్లలకు తల్లి పాల అవశ్యకత గురించి వివరించింది.
కాగా ఓ కొత్త అతిథి జూన్‌లో తమ కుటుంబంలోకి రాబోతున్నారంటూ గత ఫిబ్రవరిలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తన బేబీ బంప్ ఫొటోలను షేర్ చేస్తూ తల్లిపాల అవశ్యకత, పాలు ఇవ్వడం వల్ల కలిగే లాభాల గురించి తల్లులకు అవగాహన కల్పిస్తు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేది. ఇక బిడ్డ పుట్టగానే సోషల్ మీడియా దూరంగా ఆమె తాజాగా కూతురు ఫొటోను షేర్ చేస్తూ సరికొత్తగా తిరిగి ఎంట్రీ ఇచ్చింది. చెన్నైకి చెందిన లీసా హెడెన్ మోడల్‌గా కెరీర్ ఆరంభించింది. తర్వాత ఆమెకు బాలీవుడ్‌లో అవకాశాలు రావడంతో ముంబైకి వెళ్లింది. హిందీలో 'హౌస్‌ఫుల్ 2', 'క్వీన్' వంటి చిత్రాలలో నటించిన ఆమె 2016లో వ్యాపారవేత్త డినో లల్వానీని పెళ్లాడింది. వీరిద్దరికి ఇద్దరు కుమారులు జాక్, లియో కాగా ఇటీవల కూతురు జన్మించింది.
Comments
Please login to add a commentAdd a comment