బాలీవుడ్ నటి, మోడల్ లీసా హెడెన్ మూడోసారి తల్లైంది. ఇటీవలే ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే ఈ నటి పసికందు ఫొటోను మాత్రం షేర్ చేయలేదు. దీంతో ఆమెకు పుట్టింది ఆడబిడ్డా? మగపిల్లాడా? అనేది తెలియరాలేదు. ఇదిలా వుంటే ఓ కొత్త అతిథి జూన్‌లో మా కుటుంబంలోకి రాబోతున్నారంటూ గతంలో ఆమె బేబీబంప్ ఫొటోలను షేర్ చేసింది.
అంతేకాదు, తల్లిపాల ఆవశ్యకత, పాలు ఇవ్వడం వల్ల కలిగే లాభాల గురించి తల్లులకు అవగాహన కల్పించింది. మరి ఇప్పుడు మూడోసారి తల్లైన ఆమె ఈ విషయాన్ని ఎందుకు సీక్రెట్‌గా ఉంచిందనేది అభిమానులకు అంతు చిక్కడం లేదు. పైగా ఓ బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని కూడా ఆమె తనంతట తానుగా వెల్లడించలేదు. మీ మూడో పాప ఎక్కడున్నారు? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా నా చేతుల్లో ఉంది అని సమాధానమిచ్చింది. దీంతో ఆమె తల్లైన విషయం బయటపడింది.
చెన్నైలో జన్మించిన లీసా హెడెన్ మోడల్‌గా కెరీర్ ఆరంభించింది. తర్వాత వెండితెరపై అవకాశాలు రావడంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. 'హౌస్‌ఫుల్ 2', 'క్వీన్' వంటి చిత్రాలతో ప్రేక్షకులకు ఆమె మరింత దగ్గరైంది. 2016లో వ్యాపారవేత్త డినో లల్వానీని పెళ్లాడిన ఆమెకు ఇద్దరు కుమారులు జాక్, లియో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment