నటి ప్రేమ పెళ్లి.. అంతలోనే పెను దుమారం!
వివాహం చేసుకుని భర్తతో సుఖసంతోషాలతో గడపాలనుకున్న హీరోయిన్ లిసా హెడాన్ తీవ్ర విమర్శల పాలైంది. హౌస్‌ఫుల్-2, 'క్వీన్' వంటి బాలీవుడ్ సినిమాలతో ఆకట్టుకున్న లిసా ఏడాదినుంచి డేటింగ్ చేస్తున్న ప్రియుడు డినో లల్వానీని వివాహం చేసుకుంది. తన పెళ్లి విషయాలను ఫొటోలు, వీడియోలతో సహా సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. లిసా భర్త డినో లల్వానీ తండ్రి గులు లాల్వానీ పాకిస్థాన్‌లో జన్మించిన బ్రిటన్ వ్యాపారవేత్త.
సోషల్ మీడియాలో నటి పెళ్లి ఫొటోలు హల్ చల్ కావడంతో వివాదం మొదలైంది. ఆమె పాకిస్తాన్ వ్యక్తిని వివాహం చేసుకుందని విమర్శలు వెల్లువెత్తాయి. అందుకు ఆమె మామ గులు లల్వానీ పాకిస్తాన్ లో జన్మించడమే కారణం. అయితే ఆ వదంతులపై నటి లిసా స్పందిస్తూ సోషల్ మీడియా సైట్ ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చుకుంది. ప్రస్తుతం భారత్, పాక్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న తరుణంలో ట్విట్టర్ లో ఆమె భర్త పాకిస్తానీ అంటూ ప్రచారం జరిగింది.
తన మామ గులు లల్వానీ అవిభాజ్య భారత్ గా ఉన్న సమయంలో కరాచీలో పుట్టారని, పాక్ ఏర్పాటు తర్వాత భారత్ లోనే ఉంటున్నారని.. ఆయన భారత పౌరుడని నటి లిసా ట్వీట్ లో పేర్కొంది. భారత్ నుంచి ఆయన బ్రిటన్ వెళ్లి అక్కడ స్థిరపడ్డారని వెల్లడించింది. తన భర్త పాకిస్తాన్ పౌరుడు కాదని వరుస ట్వీట్లలో వివరించింది. ప్రపంచం ఎప్పుడూ ప్రేమను, ప్రేమికులను కోరుకుంటుంది తప్ప ద్వేషాన్ని ఎప్పుడూ కాదని మరో ట్వీట్ లో లిసా హెడాన్ ఘాటుగా స్పందించింది.
Dear @dna my husband is Indian. My father in law - Gulu Lalvani, was born in pre partition India and was thrown out of what is today...
— Lisa Haydon (@HaydonLisa) 2 November 2016
The world needs lovers not haters❤️
— Lisa Haydon (@HaydonLisa) 2 November 2016