అతన్నే పెళ్లి చేసుకోబోతున్నా: హీరోయిన్
బాలీవుడ్ కథానాయిక లిసా హేడెన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నది. 'హౌస్‌ఫుల్-2', 'క్వీన్' వంటి సినిమాలతో బాలీవుడ్‌లో మెరిసిన ఈ సుందరాంగి తాను పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని చాలా స్టైలిష్ గా ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది.
పెదవితో పెదవిని పెనవేసుకొని తన ప్రియుడికి ముద్దుపెడుతున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసి.. 'ఇతన్ని పెళ్లి చేసుకోబోతున్నా' అంటూ కామెంట్ పెట్టింది. ప్రేమికుడు డినో లాల్వానీని ఆమె త్వరలో వివాహం చేసుకోబోతున్నది.
చెన్నైలో పుట్టిన లిసా హేడెన్ తన జీవితం ఎక్కువకాలంలో విదేశాల్లోనే ఉన్నది. ఆస్ట్రేలియా, అమెరికాలో కొన్నాళ్లు ఉన్న ఆమె మోడలింగ్ కోసం ముంబైకి మకాం మార్చింది. మోడలింగ్ నుంచి బాలీవుడ్‌లో ఆరంగేట్రం చేసిన ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తున్నది.
ఆమె ఏడాదికాలంతా డినో లాల్వానీతో డేటింగ్ చేస్తోంది. డినో పాకిస్థాన్‌లో జన్మించిన బ్రిటన్ వ్యాపారవేత్త గుల్లు లాల్వానీ కుమారుడు. 2008లో అతను తండ్రి కంపెనీ బినాటోన్ టెలికంకు చైర్మన్‌గా ఎన్నికయ్యాడు. లండన్‌లో యూనిసెఫ్ హలోవిన్ బాల్ కార్యక్రమం సందర్భంగా తొలిసారిగా చూపులు కలిపిన ఈ జంట ఆ తర్వాత ప్రేమలో పడి.. ఏడాదికాలంగా సన్నిహితంగా ఉంటున్నారు.