ప్రియుడిని పెళ్లి చేసుకున్న హీరోయిన్‌! | Lisa Haydon married to boyfriend Dino Lalvani | Sakshi
Sakshi News home page

ప్రియుడిని పెళ్లి చేసుకున్న హీరోయిన్‌!

Published Sun, Oct 30 2016 11:22 AM | Last Updated on Mon, Sep 4 2017 6:46 PM

Lisa Haydon married to boyfriend Dino Lalvani

'హౌస్‌ఫుల్‌-2', 'క్వీన్‌' వంటి సినిమాలతో ఆకట్టుకున్న బాలీవుడ్‌ కథానాయిక లిసా హేడెన్‌ వైవాహిక జీవితంలో అడుగుపెట్టింది. ఏడాదికాలంగా డేటింగ్‌ చేస్తున్న తన ప్రియుడు డినో లాల్వానీని ఆమె పెళ్లి చేసుకుంది. తాజాగా విడుదలైన ‘యే దిల్‌ హై ముష్కిల్‌’ సినిమాలోనూ అలరించిన ఈ ముద్దుగుమ్మ తాను పెళ్లాడిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది. అందమైన తమ పెళ్లి ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

చెన్నైలో పుట్టిన లిసా హేడెన్‌ తన జీవితం ఎక్కువకాలంలో విదేశాల్లోనే ఉన్నది. ఆస్ట్రేలియా, అమెరికాలో కొన్నాళ్లు ఉన్న ఆమె మోడలింగ్‌ కోసం ముంబైకి మకాం మార్చింది. మోడలింగ్‌ నుంచి బాలీవుడ్‌లో ఆరంగేట్రం చేసిన ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తున్నది.

ఆమె ఏడాదికాలంతా డినో లాల్వానీతో డేటింగ్‌ చేస్తోంది. డినో పాకిస్థాన్‌లో జన్మించిన బ్రిటన్‌ వ్యాపారవేత్త గుల్లు లాల్వానీ కుమారుడు. 2008లో అతను తండ్రి కంపెనీ బినాటోన్‌ టెలికంకు చైర్మన్‌గా ఎన్నికయ్యాడు. లండన్‌లో యూనిసెఫ్‌ హలోవిన్‌ బాల్‌ కార్యక్రమం సందర్భంగా తొలిసారిగా చూపులు కలిపిన ఈ జంట ఆ తర్వాత ప్రేమలో పడి.. ఏడాదికాలంగా సన్నిహితంగా ఉంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement