హృతిక్ ‘బ్రేక్’! | Hrithik Roshan decided to take rest | Sakshi

హృతిక్ ‘బ్రేక్’!

Published Sun, Oct 5 2014 11:59 PM | Last Updated on Sat, Sep 2 2017 2:23 PM

హృతిక్ ‘బ్రేక్’!

హృతిక్ ‘బ్రేక్’!

సినిమా షూటింగ్.. ఆపై ప్రమోషన్... దాదాపు ఏడాదిగా క్షణం తీరిక లేకుండా బిజీగా గడిపిన సూపర్ స్టార్ హృతిక్ రోషన్‌కు మైండ్ బ్లాకయినట్టుంది. మరో భారీ వెంచర్‌ను స్టార్ట్ చేసేముందు మానసిక ప్రశాంతత కోరుకుంటున్నాడు. అలాగే ఎప్పుడూ కాస్త వైవిధ్యం ఉంటేనే జీవితం బోరు కొట్టకుండా ఉంటుందంటున్నాడు. తాజాగా రిలీజైన ‘బ్యాంగ్ బ్యాంగ్’ బాక్సాఫీస్‌లో రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పటి వరకు దాదాపు 71.62 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. ఇందులో స్టంట్స్‌కు విపరీతంగా శ్రమించిన హీరో... ‘మెగా వెంచర్‌కు ముందు నూతనోత్సాహం పొందేందుకు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నా’ అన్నాడు.
 
నచ్చితే ఓకే!
డబ్బు అంత సవుస్య కాదని అంటోంది బాలీవుడ్ భావు లీసా హైడన్. నచ్చిన పాత్ర దొరికితే పారితోషికం తనకు పెద్ద విషయుమే కాదని సెలవిస్తోంది. తనకు దొరికిన పాత్రను బట్టి, తనతో సినివూ తీసే నిర్మాణ సంస్థ బట్టి పారితోషికం మారుతూ ఉంటుందని, అవేవీ పట్టించుకోకుండా అమాతం తన పారితోషికాన్ని పెంచేయబోనని చెబుతోంది. కంగనా రనౌత్ ఇటీవల తన పారితోషికాన్ని ఏకంగా యూభైశాతం పెంచేయుడంతో లీసా ఆమెపైనే సెటైర్లు వేస్తోందని బాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
 
సూపర్ రెస్పాన్‌‌స
దేశానికి చెందిన నటీనటుల చిత్రాల పట్ల భారతీయుుల స్పందన ఆనందంగా ఉందని పాకిస్థానీ నటి హుమైమా లిక్ హర్షం వ్యక్తం చేస్తోంది. ‘రాజా నట్వర్‌లాల్’తో తెరంగేట్రం చేసిన హుమైమా, ఇటీవల కరాచీలో ‘ఖూబ్‌సూరత్’ ప్రీమియుర్ షో తిలకించిన సందర్భంగా మీడియూతో మాట్లాడింది. ‘ఖూబ్‌సూరత్’లో పాకిస్థానీ నటుడు ఫవద్ ఖాన్ నటించిన సంగతి తెలిసిందే. భారత్-పాక్ సినీరంగాల వుధ్య వుంచి స్నేహపూర్వక వాతావరణం ఉందని, పాకిస్థానీ నటీనటుల ప్రతిభను భారతీయులు ఆదరిస్తున్నారని హుమైమా చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement