పెళ్లిది ఏముంది.. ప్రేమ ఉంటే చాలు
పెళ్లిది ఏముంది.. ప్రేమ ఉంటే చాలని చెబుతోంది టీవీ నటి సారా ఖాన్. పెళ్లి మనుషులు సృష్టించుకున్న ఆచారం మాత్రమేనని అంటోంది. స్త్రీ పురుషుల సంబంధానికి సావూజిక ఆమోదం కోసం ఈ ఆచారాన్ని సృష్టించుకున్నారని, స్త్రీ పురుషులు పరస్పరం మనసులు ఇచ్చి పుచ్చుకుంటే వారి మధ్య పెళ్లి జరిగినట్లేనని చెబుతోంది. ‘యే హై ఆషికీ’ పేరిట కులాంతర వివాహాలపై టీవీ షో నిర్వహిస్తున్న సారా ఖాన్, తన షో కోసం ఇలాంటి పాఠాలు చాలానే చెబుతోంది.
తగిన కథ దొరికితే దర్శకత్వానికీ రెడీ..
నటుడిగా ప్రస్తుతం తన జీవితం బాగానే సాగుతోందని, అరుుతే, తగిన కథ దొరికితే దర్శకత్వం చేయుడానికి కూడా తాను సిద్ధమేనని కండల వీరుడు హృతిక్ రోషన్ చెబుతున్నాడు. అలాగని ఇప్పట్లోనే దర్శకత్వం చేపట్టే ఆలోచనేదీ లేదని, అందుకు కొంతకాలం పడుతుందని అంటున్నాడు. హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ హీరోగా తెరవురుగయ్యూక దర్శకత్వం వైపు మళ్లి, సూపర్‌హిట్ చిత్రాలు అందించిన సంగతి తెలిసిందే. హృతిక్ కూడా తండ్రి బాటలోనే కొనసాగుతాడని ఆశించవచ్చు.
తింగరబుచ్చి
చదివేస్తే ఉన్న మతి పోయిందంటే ఇదేనేమో. మంగళ్‌యాన్ సక్సెస్‌ను ఇండియా మొత్తం గ్రేట్‌గా సెలబ్రేట్ చేసుకుంటుంటే.. అసలు విషయం తెలియక కరీనాకపూర్ మాత్రం తికమకపడింది. హెడ్ అండ్ షోల్డర్ ప్రమోటింగ్‌కు వచ్చిన కరీనాను ఓ జర్నలిస్ట్ ‘మంగళ్ యాన్ సక్సెస్ మీద మీ ఒపీనియన్ ఏంట’ని హిందీలో ప్రశ్నించాడు. హిందీ సినిమాల్లో తారస్థాయిలో దూసుకుపోయిన బెబో.. క్వశ్చన్ ఇంగ్లిష్‌లో అడ గమంటూ జవాబు చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేసింది. సదరు జర్నలిస్ట్ ఇంగ్లిష్‌లో కూడా క్వశ్చన్ రిపీట్ చేసే సరికి ఏం చెప్పాలో తెలియక తింగరి సమాధానమిచ్చింది. తనకూ స్పేస్‌లోకి వెళ్లాలని ఉందంటూ నోటికొచ్చింది చెప్పేసింది. అంతేకాదు.., ఆల్రెడీ సైఫ్ స్పేస్‌లోనే ఉన్నాడంటూ వాగేసింది ఈ ముద్దుగుమ్మ.