Sara Khan
-
ఇదన్నమాట సంగతి, పైలట్‌తో లవ్‌లో పడ్డ సారా!
హిందీ రియాలిటీ షో లాకప్‌తో ఇటీవలే అభిమానులను అలరించింది సారా ఖాన్. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ప్రేమలో మునిగి తేలుతోందట. థానేకు చెందిన పైలట్ శాంతను రాజేతో డేటింగ్ చేస్తుందట. వీళ్లిద్దరికీ సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడగా కొంతకాలానికే మంచి ఫ్రెండ్స్‌గా మారారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడగా అది కాస్తా ప్రేమకు దారి తీసింది. ఏడాదిగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఈ లవ్‌బర్డ్స్ ఇటీవలే ఈద్ పండగను సైతం కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. అంతేకాదు వీళ్లిద్దరూ త్వరలో మోహిత్ చౌహన్ పాడిన మ్యూజిక్ ఆల్బమ్‌లో జంటగా కనిపించనున్నారు. ఈ విషయాన్ని శాంతను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. కొద్ది నెలలుగా జంట ఫొటోలను షేర్ చేస్తూ మురిసిపోతున్న వీరిద్దరూ త్వరలోనే తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. కాగా సారా ఖాన్ లాకప్ షోలో ఉన్నప్పుడు శివం శర్మ ఆమెకు ప్రపోజ్ చేశాడు. కానీ ఆమె మాత్రం ఆ ప్రపోజ్‌ను నిర్మొహమాటంగా తిరస్కరించింది. తను ఆల్రెడీ లవ్‌లో ఉండటం వల్లే శివం శర్మ ప్రేమను అంగీకరించలేదంటున్నారు నెటిజన్లు. View this post on Instagram A post shared by Shantanu Raje 💎 (@shantanu_raje) View this post on Instagram A post shared by Shantanu Raje 💎 (@shantanu_raje) చదవండి: స్టేజీపైనే యాంకర్ శ్యామలపై సీరియస్ అయిన ఆర్జీవీ అద్దంలో చూసుకుని ఏంట్రా ఇలా అయిపోయా అనుకునేవాడిని -
నా దగ్గర పనిచేసే అమ్మాయితో ఎఫైర్, అందుకే విడాకులు
Lock Upp: బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న లాకప్ షో సంచలనంగా మారింది. ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్లు బయటపెడుతున్న షాకింగ్ సీక్రెట్లు విని అభిమానులు ఔరా అంటున్నారు. ఎలిమినేషన్ నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి రహస్యాన్ని అయినా చెప్పేందుకు వెనుకాడటం లేదు. తాజాగా మోడల్, నటి సారా ఖాన్ తన మాజీ భర్త, లాకప్ కంటెస్టెంట్ అలీ మర్చంట్ గురించి ఓ రహస్యాన్ని బయటపెట్టింది. తనకు లోఖండ్వాలాలో ఒక స్పా ఉందని, అక్కడ పనిచేసే అమ్మాయితో అలీ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని వెల్లడించింది. అప్పటికే అతడికి చాలాసార్లు అవకాశాలు ఇచ్చి చూశానని, కానీ అతడు ఎంతకూ మారకపోవడంతో విడాకులు తీసుకోక తప్పలేదని స్పష్టం చేసింది. తాను మనసారా ప్రేమించిన మొట్టమొదటి వ్యక్తి అతడేనని, అందుకే అతడు అడ్డంగా దొరికిపోయినా పోనీలే అనుకుని మరో అవకాశం ఇచ్చేదాన్నని తెలిపింది. ఇలా సుమారు మూడున్నరేళ్ల కాలంలో 300 ఛాన్సులు ఇచ్చానని, కానీ అతడు దాన్ని నిలబెట్టుకోలేకపోయాడని పేర్కొంది. విడాకుల తర్వాత తిరిగి మామూలు మనిషిని కావడానికి తనకు దాదాపు నాలుగున్నర సంవత్సరాలు పట్టిందని చెప్పుకొచ్చింది. కాగా కొంతకాలం పాటు డేటింగ్ చేసుకున్న సారా, అలీ 2010లో బిగ్‌బాస్ షోలో పెళ్లి చేసుకున్నారు. ఇలా షోలో పెళ్లి చేసుకోవడానికి వారికి రూ.50 లక్షలు ముట్టజెప్పారంటూ కొన్ని వదంతులు కూడా పుట్టుకొచ్చాయి. ఏదేమైనా సెన్సేషనల్‌గా మారిన వారి పెళ్లి ఎంతోకాలం నిలవలేదు. వివాహం చేసుకున్న రెండు నెలలకే విడాకులు తీసుకున్నారు. చదవండి: పెళ్లయ్యాక 25 మంది పిల్లలను కంటాం -
బాత్ రూమ్ క్లిప్‌పై నటి వివరణ
సోషల్ మీడియా అప్డేట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలనే విషయం మరోసారి రుజువైంది. హిందీ సీరియల్ నటి సారా ఖాన్(28).. బాత్ టబ్‌లో నగ్నంగా స్నానం చేస్తున్న ఓ క్లిప్, కొన్ని ఫోటోలు వైరల్ కావటం తెలిసిందే. దీంతో పలువురు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే తన సోదరి చేసిన తప్పిదంతోనే అది జరిగిందంటూ సారా వివరణ ఇచ్చుకున్నారు. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న సారా ఖాన్.. ఆమె సోదరి ఆర్యా అక్కడి సరదా మూమెంట్స్‌ను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో మూడు, నాలుగు రోజుల రోజుల క్రితం సారా సోదరి అర్యా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. బాత్ టబ్‌లో సారా నగ్నంగా స్నానం చేస్తున్న వీడియో అది. అది చూసి నెటిజన్లు ఖంగుతిని ‘సిగ్గు లేదా?’ అంటూ సారాను తిట్టి పోశారు. అయితే కాసేటికే ఆర్య ఆ వీడియోను డిలేట్ చేశారు. సారా స్పందన... అయితే అప్పటికే వీడియోలోని స్క్రీన్ షాట్లు కొన్ని నెట్లో వైరల్ అయ్యాయి. దీంతో జరిగిన పొరపాటుపై సారా మీడియా ముందుకొచ్చారు. మద్యం మత్తులోనే తన సోదరి అలా చేసిందని, సరదా కోసం చేయబోతే అలా వికటించిందని ఆమె ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ‘ప్రపంచం ఇప్పుడు ఎంతో వేగంగా ఉంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతీ ఒక్కరి అప్డేట్లు వేగంగా వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో ప్రతీ ఒక్కరూ గమనిస్తున్నారు. ఇలాంటి సమయంలో అప్రమత్తంగా ఉండాల్సింది మేమే. లేకపోతే ఘోరాలు జరిగిపోయే ప్రమాదం ఉంది. ఇక నుంచి అలాంటి పోరపాట్లు జరగకుండా చూసుకుంటా’ అని సారా తెలిపారు. కాగా, సారా ఖాన్ పలు సీరియళ్లతోపాటు బిగ్ బాస్-4 సీజన్లో కంటెస్టెంట్‌గా కూడా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం ‘వో అప్నా సా’ సీరియల్లో ఆమె నటిస్తున్నారు. -
తైక్వాండోలో సారాఖాన్కు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: జాతీయ జూనియర్ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో రాష్ట్రానికి చెందిన మసీరా సారా ఖాన్ మెరిసింది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఈ టోర్నీలో సారా పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. మహిళల 63–68 వెయిట్ కేటగిరీలో ఆమె విజేతగా నిలిచింది. ఈ విజయంతో ఆమె అంతర్జాతీయ తైక్వాండో చాంపియన్‌షిప్‌కు ఎంపికైంది. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో రాణించిన సారా ఖాన్‌ను బుధవారం శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఖాతాలో 9 పతకాలు... జాతీయ స్కూల్ గేమ్స్ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్ర బృందం ఆకట్టుకుంది. నల్లగొండలో జరిగిన ఈ టోర్నీలో 3 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి మొత్తం 9 పతకాలను సాధించింది. నందీశ్వర్ (21–23కేజీలు), హన్షిక సింగ్ (24–26 కేజీలు), హిమాన్షు (50 కేజీలు) ముగ్గురూ రన్నరప్‌లుగా నిలిచి రజతాలను సాధించారు. శివ కిరణ్ (25–27 కేజీలు), నైనా బాయి (18–20 కేజీలు), రమ్య (22–24 కేజీలు), త్రిలోక్ (32 కేజీలు), అక్షిత (38 కేజీలు), సంతోష్ (అండర్–18కేజీలు) కాంస్యాలను గెలుచుకున్నారు. -
ఉండాల్సిన పిల్లే!
సైఫ్ అలీఖాన్ కూతురు సారాఖాన్ ఫస్ట్ మూవీ ‘కేదార్నాథ్’ ఇంకా రిలీజ్ కాలేదు. ఇప్పటికైతే డిసెంబర్ 21న అనుకుంటున్నారు. పూర్తయిన పిక్చర్ రిలీజ్ కాకుండా ఉంటుందా! అవుతుంది. అయితే సారాకే చాన్సులు వస్తాయా అని బాలీవుడ్ ఇండస్ట్రీ డౌట్ పడుతోంది. అదేంటి? పిక్చర్ ఇంకా విడుదల కాకుండానే, అందులో ఆ అమ్మాయి ఎలా యాక్ట్ చేసిందో ప్రేక్షకులు జడ్జిమెంట్ ఇవ్వకుండానే ఈ డౌట్ ఎందుకు? యాక్షన్ మీద డౌట్ కాదు. సారా యాటిట్యూడ్ మీద డౌటు! ఈ స్టార్ కిడ్ బాలీవుడ్‌కి న్యూబీ అయినప్పటికీ రెమ్యునరేషన్లో ఓల్డ్ బేబీలను మించి అడుగుతోందని నిర్మాతలు ఆల్రెడీ లబలబలాడ్డం మొదలుపెట్టేశారు. అంటే నెత్తీ నోరూ కొట్టుకోవడం! ‘అందేంటమ్మాయ్.. నలుగురికీ తెలిశాక కదా నీకు పేరొచ్చేది! పేరొచ్చాక కదా నీకు రెమ్యూనరేషన్ పెరిగేది’ అని బుజ్జగించి చెబుతున్నా సారా వినడం లేదు. ‘కొల్తైనా, పాతైనా యాక్షన్ యాక్షనే.. కలెక్షన్ కలెక్షనే’ అంటోంది. ‘అదేనమ్మా.. ఫస్ట్ మూవీకి కలెక్షన్ బాగా వస్తే.. ఫ్యూచర్ నీకు వచ్చే కలెక్షన్ కూడా నిండుగా ఉంటుంది’ అని ఎవరెన్ని లెక్కలేసి చెప్పినా సారా లెక్కే చేయడం లేదు. ‘కేదార్నాథ్’ మూవీని అభిషేక్ కపూర్ డైరెక్ట్ చేశాడు. నిర్మాత కూడా ఆయనే. ఒకరిద్దరు ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేశారనుకోండి. ఈ సినిమాకు సారాకు ఎంతిచ్చారో కరెక్ట్ అమౌంట్ బయటికి రాలేదు. ఇప్పుడు ఆమె ఎంత అడుగుతోందో.. అదీ కరెక్ట్‌గా తేల్లేదు. మొత్తానికైతే, సారా అడిగే మొత్తానికి నిర్మాతలకు చుక్కలు కనిపిస్తున్నాయి. కనిపించడం కాదు. సారా చూపిస్తోంది. ఉండాల్సిన పిల్లే. బాలీవుడ్లో హీరోలకు ఎక్కువ, హీరోయిన్లకు తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చే జాడ్యం పోవాలంటే ఎవరో ఒకరు అడిగేవాళ్లు ఉండాలి. తన ఫస్ట్ మూవీతోనే సారా అడుగుతోంది. తప్పేముంది? -
పెళ్లిది ఏముంది.. ప్రేమ ఉంటే చాలు
పెళ్లిది ఏముంది.. ప్రేమ ఉంటే చాలని చెబుతోంది టీవీ నటి సారా ఖాన్. పెళ్లి మనుషులు సృష్టించుకున్న ఆచారం మాత్రమేనని అంటోంది. స్త్రీ పురుషుల సంబంధానికి సావూజిక ఆమోదం కోసం ఈ ఆచారాన్ని సృష్టించుకున్నారని, స్త్రీ పురుషులు పరస్పరం మనసులు ఇచ్చి పుచ్చుకుంటే వారి మధ్య పెళ్లి జరిగినట్లేనని చెబుతోంది. ‘యే హై ఆషికీ’ పేరిట కులాంతర వివాహాలపై టీవీ షో నిర్వహిస్తున్న సారా ఖాన్, తన షో కోసం ఇలాంటి పాఠాలు చాలానే చెబుతోంది. తగిన కథ దొరికితే దర్శకత్వానికీ రెడీ.. నటుడిగా ప్రస్తుతం తన జీవితం బాగానే సాగుతోందని, అరుుతే, తగిన కథ దొరికితే దర్శకత్వం చేయుడానికి కూడా తాను సిద్ధమేనని కండల వీరుడు హృతిక్ రోషన్ చెబుతున్నాడు. అలాగని ఇప్పట్లోనే దర్శకత్వం చేపట్టే ఆలోచనేదీ లేదని, అందుకు కొంతకాలం పడుతుందని అంటున్నాడు. హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ హీరోగా తెరవురుగయ్యూక దర్శకత్వం వైపు మళ్లి, సూపర్‌హిట్ చిత్రాలు అందించిన సంగతి తెలిసిందే. హృతిక్ కూడా తండ్రి బాటలోనే కొనసాగుతాడని ఆశించవచ్చు. తింగరబుచ్చి చదివేస్తే ఉన్న మతి పోయిందంటే ఇదేనేమో. మంగళ్యాన్ సక్సెస్‌ను ఇండియా మొత్తం గ్రేట్‌గా సెలబ్రేట్ చేసుకుంటుంటే.. అసలు విషయం తెలియక కరీనాకపూర్ మాత్రం తికమకపడింది. హెడ్ అండ్ షోల్డర్ ప్రమోటింగ్కు వచ్చిన కరీనాను ఓ జర్నలిస్ట్ ‘మంగళ్ యాన్ సక్సెస్ మీద మీ ఒపీనియన్ ఏంట’ని హిందీలో ప్రశ్నించాడు. హిందీ సినిమాల్లో తారస్థాయిలో దూసుకుపోయిన బెబో.. క్వశ్చన్ ఇంగ్లిష్‌లో అడ గమంటూ జవాబు చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేసింది. సదరు జర్నలిస్ట్ ఇంగ్లిష్‌లో కూడా క్వశ్చన్ రిపీట్ చేసే సరికి ఏం చెప్పాలో తెలియక తింగరి సమాధానమిచ్చింది. తనకూ స్పేస్‌లోకి వెళ్లాలని ఉందంటూ నోటికొచ్చింది చెప్పేసింది. అంతేకాదు.., ఆల్రెడీ సైఫ్ స్పేస్‌లోనే ఉన్నాడంటూ వాగేసింది ఈ ముద్దుగుమ్మ. -
నా కూతురు సినిమాల్లోకి వస్తుందో..రాదో తెలియదు!
తన కూతురికి సినిమాల్లోకి రావాలనే ఉద్దేశం ఉందో లేదో తనకు తెలియదని బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీ ఖాన్ తెలిపారు. మాజీ భార్య అమృత సింగ్, సైఫ్ ఆలీ ఖాన్ లకు సారా, ఇబ్రహీంలనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాలీవుడ్ లోకి సారా ఎంట్రీ ఇస్తున్నట్టు ఇటీవల కాలంలో మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాల్లో సారా నటించడంపై సైఫ్ స్పందించారు. నా పిల్లలకు అవసరమైనంత స్వేచ్చ ఇచ్చాను. వాళ్ల ఇష్టాలకు వ్యతిరేకంగా ఎప్పుడూ ప్రయత్నించలేదు. సారాకు సినిమాల్లో నటించాలని ఇంట్రస్ట్ ఉంది. కాని ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటోంది అని సైఫ్ అన్నారు. కొలంబియా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పుచ్చుకున్నాకా.. ఏం చేయాలనుకుంటే సారా తన ఇష్టప్రకారం చేయవచ్చు అని సైఫ్ అన్నారు. సారా ప్రభుత్వ ఏజెన్సీలో పనిచేయాలనుకుంటున్నట్టు తెలుసు.. సినిమా ప్రవేశం గురించి తనకు తెలియదని సైఫ్ అన్నారు. పరిణితి చోప్రా అంటే సారాకు చెప్పలేనంత ఇష్టమని సైఫ్ అన్నారు. Follow @twitter