Report Says Bidaai Fame TV Actress Sara Khan Dating Pilot Shantanu Raje - Sakshi
Sakshi News home page

Sara Khan: అతడిని రిజెక్ట్‌ చేసింది, పైలట్‌తో ప్రేమలో మునిగి తేలుతోంది!

Published Thu, Jul 14 2022 7:31 PM | Last Updated on Thu, Jul 14 2022 8:20 PM

Sara Khan Dating A Pilot Shantanu Raje, Couple To Make Relationship Official Soon - Sakshi

హిందీ రియాలిటీ షో లాకప్‌తో ఇటీవలే అభిమానులను అలరించింది సారా ఖాన్‌. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ప్రేమలో మునిగి తేలుతోందట. థానేకు చెందిన పైలట్‌ శాంతను రాజేతో డేటింగ్‌ చేస్తుందట. వీళ్లిద్దరికీ సోషల్‌ మీడియా ద్వారా పరిచయం ఏర్పడగా కొంతకాలానికే మంచి ఫ్రెండ్స్‌గా మారారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడగా అది కాస్తా ప్రేమకు దారి తీసింది. ఏడాదిగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఈ లవ్‌బర్డ్స్‌ ఇటీవలే ఈద్‌ పండగను సైతం కలిసి సెలబ్రేట్‌ చేసుకున్నారు.

అంతేకాదు వీళ్లిద్దరూ త్వరలో మోహిత్‌ చౌహన్‌ పాడిన మ్యూజిక్‌ ఆల్బమ్‌లో జంటగా కనిపించనున్నారు. ఈ విషయాన్ని శాంతను సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. కొద్ది నెలలుగా జంట ఫొటోలను షేర్‌ చేస్తూ మురిసిపోతున్న వీరిద్దరూ త్వరలోనే తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. కాగా సారా ఖాన్‌ లాకప్‌ షోలో ఉన్నప్పుడు శివం శర్మ ఆమెకు ప్రపోజ్‌ చేశాడు. కానీ ఆమె మాత్రం ఆ ప్రపోజ్‌ను నిర్మొహమాటంగా తిరస్కరించింది. తను ఆల్‌రెడీ లవ్‌లో ఉండటం వల్లే శివం శర్మ ప్రేమను అంగీకరించలేదంటున్నారు నెటిజన్లు.

చదవండి: స్టేజీపైనే యాంకర్‌ శ్యామలపై సీరియస్‌ అయిన ఆర్జీవీ
 అద్దంలో చూసుకుని ఏంట్రా ఇలా అయిపోయా అనుకునేవాడిని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement