సైఫ్ అలీఖాన్ కూతురు సారాఖాన్ ఫస్ట్ మూవీ ‘కేదార్‌నాథ్’ ఇంకా రిలీజ్ కాలేదు. ఇప్పటికైతే డిసెంబర్ 21న అనుకుంటున్నారు. పూర్తయిన పిక్చర్ రిలీజ్ కాకుండా ఉంటుందా! అవుతుంది. అయితే సారాకే చాన్సులు వస్తాయా అని బాలీవుడ్ ఇండస్ట్రీ డౌట్ పడుతోంది. అదేంటి? పిక్చర్ ఇంకా విడుదల కాకుండానే, అందులో ఆ అమ్మాయి ఎలా యాక్ట్ చేసిందో ప్రేక్షకులు జడ్జిమెంట్ ఇవ్వకుండానే ఈ డౌట్ ఎందుకు? యాక్షన్ మీద డౌట్ కాదు. సారా యాటిట్యూడ్ మీద డౌటు! ఈ స్టార్ కిడ్ బాలీవుడ్‌కి న్యూబీ అయినప్పటికీ రెమ్యునరేషన్‌లో ఓల్డ్ బేబీలను మించి అడుగుతోందని నిర్మాతలు ఆల్రెడీ లబలబలాడ్డం మొదలుపెట్టేశారు. అంటే నెత్తీ నోరూ కొట్టుకోవడం! ‘అందేంటమ్మాయ్.. నలుగురికీ తెలిశాక కదా నీకు పేరొచ్చేది! పేరొచ్చాక కదా నీకు రెమ్యూనరేషన్ పెరిగేది’ అని బుజ్జగించి చెబుతున్నా సారా వినడం లేదు. ‘కొల్తైనా, పాతైనా యాక్షన్ యాక్షనే.. కలెక్షన్ కలెక్షనే’ అంటోంది.
‘అదేనమ్మా.. ఫస్ట్ మూవీకి కలెక్షన్ బాగా వస్తే.. ఫ్యూచర్ నీకు వచ్చే కలెక్షన్ కూడా నిండుగా ఉంటుంది’ అని ఎవరెన్ని లెక్కలేసి చెప్పినా సారా లెక్కే చేయడం లేదు. ‘కేదార్‌నాథ్’ మూవీని అభిషేక్ కపూర్ డైరెక్ట్ చేశాడు. నిర్మాత కూడా ఆయనే. ఒకరిద్దరు ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేశారనుకోండి. ఈ సినిమాకు సారాకు ఎంతిచ్చారో కరెక్ట్ అమౌంట్ బయటికి రాలేదు. ఇప్పుడు ఆమె ఎంత అడుగుతోందో.. అదీ కరెక్ట్‌గా తేల్లేదు. మొత్తానికైతే, సారా అడిగే మొత్తానికి నిర్మాతలకు చుక్కలు కనిపిస్తున్నాయి. కనిపించడం కాదు. సారా చూపిస్తోంది. ఉండాల్సిన పిల్లే. బాలీవుడ్‌లో హీరోలకు ఎక్కువ, హీరోయిన్‌లకు తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చే జాడ్యం పోవాలంటే ఎవరో ఒకరు అడిగేవాళ్లు ఉండాలి. తన ఫస్ట్ మూవీతోనే సారా అడుగుతోంది. తప్పేముంది?
ఉండాల్సిన పిల్లే!
Published Tue, Dec 12 2017 12:17 AM | Last Updated on Tue, Dec 12 2017 12:17 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment