Lock Upp: Sara Khan Reveals Her Ex-Husband Ali Merchant Cheated on Her With Spa Employee - Sakshi
Sakshi News home page

Sara Khan: 'నా మాజీ భర్తకు స్పాలో పనిచేసే మహిళతో అక్రమ సంబంధం'

Published Sat, Mar 19 2022 3:30 PM | Last Updated on Fri, Apr 8 2022 3:25 PM

Lock Upp: Sara Khan Reveals Her Ex Husband Ali Merchant Cheated - Sakshi

Lock Upp: బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న లాకప్‌ షో సంచలనంగా మారింది. ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్లు బయటపెడుతున్న షాకింగ్‌ సీక్రెట్లు విని అభిమానులు ఔరా అంటున్నారు. ఎలిమినేషన్‌ నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి రహస్యాన్ని అయినా చెప్పేందుకు వెనుకాడటం లేదు. తాజాగా మోడల్‌, నటి సారా ఖాన్‌ తన మాజీ భర్త, లాకప్‌ కంటెస్టెంట్‌ అలీ మర్చంట్‌ గురించి ఓ రహస్యాన్ని బయటపెట్టింది. తనకు లోఖండ్‌వాలాలో ఒక స్పా ఉందని, అక్కడ పనిచేసే అమ్మాయితో అలీ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని వెల్లడించింది.

అప్పటికే అతడికి చాలాసార్లు అవకాశాలు ఇచ్చి చూశానని, కానీ అతడు ఎంతకూ మారకపోవడంతో విడాకులు తీసుకోక తప్పలేదని స్పష్టం చేసింది. తాను మనసారా ప్రేమించిన మొట్టమొదటి వ్యక్తి అతడేనని, అందుకే అతడు అడ్డంగా దొరికిపోయినా పోనీలే అనుకుని మరో అవకాశం ఇచ్చేదాన్నని తెలిపింది. ఇలా సుమారు మూడున్నరేళ్ల కాలంలో 300 ఛాన్సులు ఇచ్చానని, కానీ అతడు దాన్ని నిలబెట్టుకోలేకపోయాడని పేర్కొంది. విడాకుల తర్వాత తిరిగి మామూలు మనిషిని కావడానికి తనకు దాదాపు నాలుగున్నర సంవత్సరాలు పట్టిందని చెప్పుకొచ్చింది.

కాగా కొంతకాలం పాటు డేటింగ్‌ చేసుకున్న సారా, అలీ 2010లో బిగ్‌బాస్‌ షోలో పెళ్లి చేసుకున్నారు. ఇలా షోలో పెళ్లి చేసుకోవడానికి వారికి రూ.50 లక్షలు ముట్టజెప్పారంటూ కొన్ని వదంతులు కూడా పుట్టుకొచ్చాయి. ఏదేమైనా సెన్సేషనల్‌గా మారిన వారి పెళ్లి ఎంతోకాలం నిలవలేదు. వివాహం చేసుకున్న రెండు నెలలకే విడాకులు తీసుకున్నారు.

చదవండి: పెళ్లయ్యాక 25 మంది పిల్లలను కంటాం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement