నా కూతురు సినిమాల్లోకి వస్తుందో..రాదో తెలియదు! | Don't know if my daughter wants to get into movies: Saif Ali Khan | Sakshi
Sakshi News home page

నా కూతురు సినిమాల్లోకి వస్తుందో..రాదో తెలియదు!

Published Sat, Jun 21 2014 3:06 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

నా కూతురు సినిమాల్లోకి వస్తుందో..రాదో తెలియదు! - Sakshi

నా కూతురు సినిమాల్లోకి వస్తుందో..రాదో తెలియదు!

తన కూతురికి సినిమాల్లోకి రావాలనే ఉద్దేశం ఉందో లేదో తనకు తెలియదని బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీ ఖాన్ తెలిపారు. మాజీ భార్య అమృత సింగ్, సైఫ్ ఆలీ ఖాన్ లకు సారా, ఇబ్రహీంలనే  ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాలీవుడ్ లోకి సారా ఎంట్రీ ఇస్తున్నట్టు ఇటీవల కాలంలో మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాల్లో సారా నటించడంపై సైఫ్ స్పందించారు.
 
నా పిల్లలకు అవసరమైనంత స్వేచ్చ ఇచ్చాను. వాళ్ల ఇష్టాలకు వ్యతిరేకంగా ఎప్పుడూ ప్రయత్నించలేదు. సారాకు సినిమాల్లో నటించాలని ఇంట్రస్ట్ ఉంది. కాని ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటోంది అని సైఫ్ అన్నారు. కొలంబియా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పుచ్చుకున్నాకా.. ఏం చేయాలనుకుంటే సారా తన ఇష్టప్రకారం చేయవచ్చు అని సైఫ్ అన్నారు. సారా ప్రభుత్వ ఏజెన్సీలో పనిచేయాలనుకుంటున్నట్టు తెలుసు.. సినిమా ప్రవేశం గురించి తనకు తెలియదని సైఫ్ అన్నారు. పరిణితి చోప్రా అంటే సారాకు చెప్పలేనంత ఇష్టమని సైఫ్ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement