మోడలింగ్, ఫ్యాషన్ గురించి ప్రస్తావించగానే స్లిమ్, యంగ్‌గా కనిపించడాన్ని ప్రధానంగా చూస్తారు. వాటికే ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఈమె లేటు వయసులో మోడల్‌గా కెరీర్‌గా ప్రారంభించింది. ఆ ఏజ్‌లో మోడల్‌గా ప్రయత్నించడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. ఎన్నో హేళనలు, అవమానాలు తట్టుకోవాల్సిందే. అన్ని దాటుకుని నిలబడటమే గాక మోడల్ అంటే యవ్వనంగా కనిపించే వాళ్లే కాదు తనలాంటి సీనియర్ సిటిజన్లు కూడా యంగ్ జనరేషన్‌కి ఏ మాత్రం తీసిసోని విధంగా దూసుకుపోతారని ప్రూవ్ చేసింది.
ఆమె పేరు ముక్కాసింగ్. ఆమెనే యాక్సిడెంటల్ మోడల్‌గా చెప్పొచ్చు. లాక్మే ఫ్యాషన్ వీక్ 2024లో ర్యాంప్‌పై డిఫరెంట్ డిజైనర్ వేర్‌తో మెరిసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. సోషల్ మీడియా అర్థం కానీ రీతిలో కొందర్నీ అద్భుతంగా ప్రపంచం ముందు నిలబడేలా చేస్తుంది. అలానే ముక్తాసింగ్ మోడల్ అయ్యేందుకు ఇది ఓ గొప్ప ఫ్లాట్‌ఫామ్‌గా నిలిచింది.
సోషల్ మీడియాలో ఆమె ప్రస్థానం ఆన్‌లైన్ కంటెంట్ క్రియేటర్‌గా ప్రారంభయమయ్యింది. చివరికి 2021 నుంచి ఆమెకు గుర్తింపు లభించడం మొదలయ్యింది. అయితే ఆమె మోడల్‌గా మారడానికి కారణం మాత్రం తన మేనగోడలు వివాహ వేడుక . ఆ ఫంక్షన్‌లో ఆమె కట్టుకున్న చీర అందర్నీ ఆకర్షించింది. ముఖ్యంగా కట్టిన తీరు మెచ్చుకుంటూ ఎన్నో కాంప్లిమెంట్స్ వచ్చాయి.
ఇక అప్పుడే డిసైడ్ అయ్యింది. తనకు తాను స్వతహా ఫ్యాషన్‌ని సెట్ చేసుకుని విన్నూతనంగా కనిపించాలని ఫిక్స్ అయ్యింది. అంతేగాదు ఆ ఫంక్షన్‌లోని తన పిక్స్‌ని నెట్టింట షేర్ చేయగా వేలల్లో వ్యూస్, లైక్‌లు రావడంతో ఈ రంగం వైపు అడుగులు వేసింది ముక్తా సింగ్. అలా ఆమె మోడల్‌గా ర్యాంప్‌పై నడిచి ఫ్యాషన్‌కి కొత్త నిర్వచనం ఇచ్చింది. ముక్తా రానున్న కల్కి2 మూవీలో కూడా నటిస్తోంది కూడా. కాగా, ముక్తాకి 15 ఏళ్ల వయసుకే జుట్టు మెరిసిపోయి అందవిహీనంగా అయిపోయింది.
ఆ తర్వాత పెళ్లి , పిల్లలు బాధ్యతలతో కెరీర్‌పై దృష్టి సారించే అవకాశమే దక్కలేదు. దీనికి తోడు ఆ టైంలోనే ముక్తా తల్లి కేన్సర్ బారిన పడటం, ఇవన్నీ ఆమెను కుంగుబాటుకి గురిచేసి తన ఆహార్యంపై దృష్టిపెట్టే అవకాశం లేకుండా చేశాయి. ఆ గడ్డు పరిస్థితు నుంచి బయటకు రావడానికి ఆమె హార్డ్ రాక్ సంగీతంవైపుకి మళ్లింది. అలా కోలుకుంటూ మళ్లీ ఈ ఫ్యాషన్ ప్రపంచంలోకి వచ్చి..తన కలను నిజం చేసుకుంది ముక్తా. అంతేగాదు ఈ వయసులోనా అని సమాజం నుంచే వచ్చే సవాళ్లకు లెక్క చేయకుండా ధైర్యంగా ముందుకుసాగి ఫ్యాషన్‌కి సరికొత్త వివరణ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment