ramp
-
లాక్మే ఫ్యాషన్ వీక్ ర్యాంప్: ‘తగ్గేదెలే’ అంటున్న స్పెషల్ బ్యూటీ
మోడలింగ్, ఫ్యాషన్ గురించి ప్రస్తావించగానే స్లిమ్, యంగ్‌గా కనిపించడాన్ని ప్రధానంగా చూస్తారు. వాటికే ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఈమె లేటు వయసులో మోడల్‌గా కెరీర్‌గా ప్రారంభించింది. ఆ ఏజ్‌లో మోడల్‌గా ప్రయత్నించడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. ఎన్నో హేళనలు, అవమానాలు తట్టుకోవాల్సిందే. అన్ని దాటుకుని నిలబడటమే గాక మోడల్ అంటే యవ్వనంగా కనిపించే వాళ్లే కాదు తనలాంటి సీనియర్ సిటిజన్లు కూడా యంగ్ జనరేషన్‌కి ఏ మాత్రం తీసిసోని విధంగా దూసుకుపోతారని ప్రూవ్ చేసింది. ఆమె పేరు ముక్కాసింగ్. ఆమెనే యాక్సిడెంటల్ మోడల్‌గా చెప్పొచ్చు. లాక్మే ఫ్యాషన్ వీక్ 2024లో ర్యాంప్‌పై డిఫరెంట్ డిజైనర్ వేర్‌తో మెరిసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. సోషల్ మీడియా అర్థం కానీ రీతిలో కొందర్నీ అద్భుతంగా ప్రపంచం ముందు నిలబడేలా చేస్తుంది. అలానే ముక్తాసింగ్ మోడల్ అయ్యేందుకు ఇది ఓ గొప్ప ఫ్లాట్‌ఫామ్‌గా నిలిచింది.సోషల్ మీడియాలో ఆమె ప్రస్థానం ఆన్లైన్ కంటెంట్ క్రియేటర్‌గా ప్రారంభయమయ్యింది. చివరికి 2021 నుంచి ఆమెకు గుర్తింపు లభించడం మొదలయ్యింది. అయితే ఆమె మోడల్‌గా మారడానికి కారణం మాత్రం తన మేనగోడలు వివాహ వేడుక . ఆ ఫంక్షన్లో ఆమె కట్టుకున్న చీర అందర్నీ ఆకర్షించింది. ముఖ్యంగా కట్టిన తీరు మెచ్చుకుంటూ ఎన్నో కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఇక అప్పుడే డిసైడ్ అయ్యింది. తనకు తాను స్వతహా ఫ్యాషన్‌ని సెట్ చేసుకుని విన్నూతనంగా కనిపించాలని ఫిక్స్ అయ్యింది. అంతేగాదు ఆ ఫంక్షన్‌లోని తన పిక్స్‌ని నెట్టింట షేర్ చేయగా వేలల్లో వ్యూస్, లైక్‌లు రావడంతో ఈ రంగం వైపు అడుగులు వేసింది ముక్తా సింగ్. అలా ఆమె మోడల్‌గా ర్యాంప్‌పై నడిచి ఫ్యాషన్‌కి కొత్త నిర్వచనం ఇచ్చింది. ముక్తా రానున్న కల్కి2 మూవీలో కూడా నటిస్తోంది కూడా. కాగా, ముక్తాకి 15 ఏళ్ల వయసుకే జుట్టు మెరిసిపోయి అందవిహీనంగా అయిపోయింది. View this post on Instagram A post shared by Mukta Singh (@mukta.singh) ఆ తర్వాత పెళ్లి , పిల్లలు బాధ్యతలతో కెరీర్‌పై దృష్టి సారించే అవకాశమే దక్కలేదు. దీనికి తోడు ఆ టైంలోనే ముక్తా తల్లి కేన్సర్ బారిన పడటం, ఇవన్నీ ఆమెను కుంగుబాటుకి గురిచేసి తన ఆహార్యంపై దృష్టిపెట్టే అవకాశం లేకుండా చేశాయి. ఆ గడ్డు పరిస్థితు నుంచి బయటకు రావడానికి ఆమె హార్డ్ రాక్ సంగీతంవైపుకి మళ్లింది. అలా కోలుకుంటూ మళ్లీ ఈ ఫ్యాషన్ ప్రపంచంలోకి వచ్చి..తన కలను నిజం చేసుకుంది ముక్తా. అంతేగాదు ఈ వయసులోనా అని సమాజం నుంచే వచ్చే సవాళ్లకు లెక్క చేయకుండా ధైర్యంగా ముందుకుసాగి ఫ్యాషన్‌కి సరికొత్త వివరణ ఇచ్చింది. View this post on Instagram A post shared by Mukta Singh (@mukta.singh) (చదవండి: ఓ పచ్చని నీడ! గ్రీన్ వారియర్..పద్నాలుగేళ్లకే..!) -
ఈ మోడల్ ధరించిన కాస్ట్యూమ్ చూస్తే..నోరెళ్లబెట్టడం ఖాయం!
మోడలింగ్ చేసే అమ్మాయిలు కాస్ట్యూమ్స్ చాలా వెరైటీగా ఉంటాయి. కానీ ఇక్కడ ఓ మోడలింగ్ వేసుకున్న కాస్ట్యూమ్ చూస్తే మాటలు రావు. ఆమె ఎలా ధరించిందా అనే సందేహం వస్తుంది. వాట్ ఏ కాస్ట్యూమ్ అని అనుకుండా ఉండలేరు. అంత వెరైటీగా, షాకింగ్‌గా ఉంటుంది ఆ కాస్ట్యూమ్. చెన్నైలోని ఓ ఫ్యాషన్ షోలో ఓ మోడల్ చాలా వెరైటీ కాస్ట్యూమ్ వేసుకొచ్చింది. ఓ సాగరకన్య మాదిరిగా డ్రస్ వేసుకొచ్చింది. అక్కడితో ఆగలేదు. చక్కగా హోయలోలికిస్తూ నడస్తు ర్యాప్‌పై రాగా ఓ వ్యక్తి ఓ సంచిలో చేపలను తీసుకొచ్చి..ఆమె కాస్ట్యూమ్‌కి అమర్చిని బౌల్లో వేశాడు. ఏకంగా లైవ్ ఫిష్‌తో కూడాని కాస్ట్యూమ్‌తో ధగ ధగ మెరిసిపోయింది. అక్కడ ఉన్నవాళ్లంతా ఆ కాస్ట్యుమ్ని చూసి నిర్ఘాంతపోయారు. అందుకు సంబంధించని వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. ఐతే నెటిజన్ల మాత్ర ఓ రేంజ్‌లోనే ఫైర్ అయ్యారు. ఇలా జంతువులతో ఫ్యాషన్ షోల కోసం కామెడీ వేషాలు వేయొద్దని ఘాటు వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Make over by Preethi (@ohsopretty_makeover) (చదవండి: బ్లాక్ యాపిల్ గురించి విన్నారా? ఒక్కొక్కటి ఏకంగా..) -
సారా అలీ ఖాన్ ధరించిన డ్రెస్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
సారా అలీ ఖాన్.. బాలీవుడ్లో ఎంటర్ అవడానికి ఆమెకున్న నటనా వారసత్వం ఒక ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగపడి ఉండొచ్చు కానీ ఆమె నిలబడింది మాత్రం అచ్చంగా తనలోని ప్రతిభతోనే! ఫ్యాషన్‌లోనూ ఆ స్టార్ స్టయిల్ సెపరేటే! అమ్మ, నానమ్మ.. మేనత్తల ఇన్ఫ్లుయెన్స్ ఇంచ్ కూడా ఉండదు. ఆమెకు ఆ ప్రత్యేకతను అలంకరిస్తున్న బ్రాండ్స్‌లో ఇవీ ఉన్నాయి.. చిన్న వస్తువు క్కూడా బోలెడంత ఖర్చు పెడుతుంటారు సెలబ్రిటీలు అని అనుకుంటారు కదా! కానీ నన్ను మినహాయించొచ్చు. ఎందుకంటే నేను అంతగా ఖర్చు పెట్టను.. ముఖ్యంగా డ్రెసెస్ మీద. పెద్ద పెద్ద ఫంక్షన్స్‌కి, షోస్‌కి కూడా నేను రెంటల్ డ్రెసెస్‌నే ఫ్రిఫర్ చేస్తాను! పునీత్ బలానా.. ‘వార్డ్‌రోబ్‌లోని మన కలెక్షన్.. మన ఫ్యాషన్ గురించే కాదు, మన గురించీ చెప్తాయి’ అంటాడు పునీత్ బలానా. అందుకే అతని డిజైన్స్ అన్నిటిలోనూ తన స్వస్థలమైన రాజస్థాన్ సంస్కృతి ప్రతిబింబిస్తుంటుంది. ఆధునికతకు దేశీ సంప్రదాయాన్ని జోడించిన డిజైన్స్ అతని ప్రత్యేకత. కాబట్టే ఈ బ్రాండ్ సెలబ్రిటీస్ ఫేవరెట్‌గా మారింది. ధర కాస్త ఎక్కువ. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. సారాఖాన్ ధరించి డ్రెస్ బ్రాండ్ పునీత్ బలానా ఖరీదు రూ. 1, 55, 000/-. జేకేజే జ్యూలర్స్ ఇది ఎనిమిది తరాల వారసత్వ వ్యాపారం. 1868లో రతన్‌గఢ్ అనే చిన్న పట్టణంలో సత్యనారాయణ జీ మోసున్తో ప్రారంభమై.. నేడు జైపూర్‌లోనే ఉత్తమ ఆభరణాలను అందించే బ్రాండ్‌గా స్థిరపడింది. రాజస్థానీ సంప్రదాయ నగలను ప్రపంచ దేశాలకూ పరిచయం చేస్తుండడంతో ఈ బ్రాండ్ కీర్తి అంతర్జాతీయ స్థాయికీ చేరుకుంది. ధర జ్యూలరీ డిజైన్, నాణ్యత పై ఆధారపడి ఉంటుంది. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేసే వీలుంది. ఇక సారాఖాన్ ధరించిన జేకేజే జ్యూలర్స్ ధర ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. --దీపిక కొండి (చదవండి: ఆ ఊరిలోని మహిళలంతా ఐదు రోజులు దుస్తులు లేకుండా ఎందుకుంటారో తెలిస్తే..షాకవ్వుతారు!) -
అన్నంత పని చేస్తున్న కిమ్! 'ఆయుధాలను పెంచాలని పిలుపు'
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరోసారి బెదిరింపులకు తెగబడ్డాడు. ఈ మేరకు కిమ్ మరిన్ని అణ్వాయుధాల ఉత్పత్తిని పెంచాలని, శక్తిమంతమైన ఆయుధాలను తయారు చేయాలని పిలుపునిచ్చాడు. గతంలో ఆయన మరిన్నీ ఆయుధాలు పెంచుతానంటూ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడూ దాన్నే నిజం చేస్తూ.. కిమ్ ఇలా అణ్వాయుధా సంస్థ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే తన అణ్వాయుధాలను ఎప్పుడైనా ఎక్కడైనా ఉపయోగించడాని రెడీగా ఉండాలని చెప్పారు. మరింత ముందుచూపుతో అణు ఆయుధాలను తయారు చేసేలా అణు పదార్థాల ఉత్పత్తిని పెంచాలాని ఆదేశించారు. మనం ఆయుధాలను దోషరహితంగా ముందుచూపుతో సిద్ధం చేస్తే.. శత్రువు మనకు భయపడతాడని అన్నారు. తద్వారా దేశ సార్వభౌమాధికారాన్ని, వ్యవస్థను, ప్రజలను రెచ్చగొట్టే సాహసం చేయలేడని చెప్పారు. గతేడాదే ఉత్తరకొరియా తిరుగులేని శక్తిగా ప్రకటించుకుంది. ప్రస్తుతం మరిన్ని అణ్వాయుధాల ఉత్పత్తికి పిలుపునిచ్చి తన మాటను నిజం చేసుకుంది. అమెరికా, దక్షిణ కొరియా మంగళవారమే ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహించాలని షెడ్యూల్ ఖరారు చేసుకున్న నేపథ్యంలోనే ఉత్తర కొరియా నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. కాగా, ఇటీవలే ఉత్తరకొరియా తన అణ్వాయుధాలను వైవిధ్యపరిచేలా సరికొత్తగా నీటి అడుగున అణుదాడి చేసే డ్రోన్ సంబంధిత పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఇది సముద్రంలో సునామీ సృష్టించి తీర ప్రాంతాలను తుడిచిపెట్టేలా చేయడం లేదా నౌక స్థావరాలను ముంచేయడం వంటి విధ్వంసాలను సృష్టిస్తుంది. (చదవండి: ఇదొక జబ్బులా ఉంది! స్కూల్ ఘటనపై జోబైడెన్ ఫైర్) -
పారిస్ ఫ్యాషన్ వీక్‌లో మెరిసిపోయిన ఐశ్యర్యా రాయ్
సాక్షి, ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోయిన్, అందాల తార ఐశ్వర్యరాయ్ బచ్చన్ మరోసారి ర్యాంప్‌పై దేవతలా మెరిసిపోయింది. పారిస్ ఫ్యాషన్ వీక్‌లో కాస్మెటిక్ బ్రాండ్ లోరియల్ అక్టోబర్ 3న నిర్వహించిన ఈవెంట్లో వైట్ కలర్ దుస్తుల్లో ర్యాంప్ వ్యాక్ చేసి అక్కడున్నవారినందరినీ మెస్మరైజ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా విభిన్న సెలబ్రిటీ మహిళలతో ఈఫిల్ టవర్ దగ్గర నిర్వహించిన ఈవెంట్లో ఐశ్యర్య రాయ్ సందడి ట్రెండింగ్‌లో నిలిచింది. ‘లే డిఫైల్ లోరియల్ పారిస్ 2021 విమెన్స్ వేర్ సమ్మర్ 2022 షో’ పారిస్‌లో ఘనంగా నిర్వహించారు. మహిళా సాధికారత, వేధింపులకు వ్యతిరేకంగా ప్రచారం థీమ్‌తో ఈ ఏడాది ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్టు ఎల్ ఓరియల్ పారిస్ గ్లోబల్ బ్రాండ్ ప్రెసిడెంట్ డెల్ఫిన్ విగుయర్-హోవాస్సే ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను లోరియల్ పారిస్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈఫిల్ టవర్ బ్యాక్ గ్రౌండ్లో ప్రముఖ యాక్టర్స్ హెలెన్ మిరెన్, కేథరీన్ లాంగ్‌ఫోర్డ్, గాయని కెమిలా కాబెల్లో, అంబర్ హర్డ్ తదితర ప్రపంచవ్యాప్త సూపర్ సూపర్ మోడల్స్ తో ఈ వేడుక జరుపుకోవడం విశేషం. ఈ ఈవెంట్ కోసం ఐశ్వర్య భర్త అభిషేక్ బచ్చన్ , కుమార్తె ఆరాధ్యతో కలిసి గత వారమే పారిస్ వెళ్లింది. ఈ క్రమంలో అభిషేక్ ఒక వీడియోను కూడా షేర్ చేశాడు. కాగా 2018, 2019 లో ఫ్యాషన్ వీక్‌లో కూడా ఐశ్వర్య మెరిసిన సంగతి తెలిసిందే. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) When she walk around the corner looks like a diamond in the water 💧 I know this girl make me crazy this love is a natural love ❤️ #AishwaryaInParis #AishwaryaRaiBachchan #AishwaryaRai pic.twitter.com/xZwz7IuU4P — Aishwarya Rai (@my_aishwarya) October 3, 2021 View this post on Instagram A post shared by L'Oréal Paris Official (@lorealparis) -
ఉప్పర్‌పల్లి ర్యాంప్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై రెండు ర్యాంపులు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఉప్పర్‌పల్లిలో పీవీఆర్ ఎక్స్‌ప్రెస్‌వేకు కనెక్టివిటీగా నిర్మించిన ర్యాంపును శనివారం ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ర్యాంపు ద్వారా ఐటీ ప్రాంతానికి వేగంగా ప్రయాణించే అవకాశం కలిగిందని అన్నారు. రూ. 22 కోట్లతో అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 164 దగ్గర ర్యాంపుల నిర్మాణం జరిగింది. ఈ ర్యాంపును హెచ్ఎండీఏ సంస్థ నిర్మించింది. ఈ ర్యాంపుల అందుబాటుతో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైటెక్ సిటీ వైపు వెళ్లే ప్రయాణికులు ఉప్పర్‌పల్లి వద్ద దిగి టోలీచౌకి, ఐటీ కారిడార్, ఇతర ప్రాంతాలకు త్వరగా చేరవచ్చని ఆయన తెలిపారు. ఈ ర్యాంపుల అందుబాటుతో రాజేంద్రనగర్, ఉప్పర్‌పల్లి, బుద్వేల్ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ తగ్గనుంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్ర రెడ్డి, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసి, నగర మేయర్ జి విజయ లక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు. MA&UD Minister @KTRTRS inaugurated the newly constructed ramps of PVNR Expressway at Upparpally today. pic.twitter.com/TeaI0pnJ2L — Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 29, 2021 చదవండి: వృద్ధాప్య పింఛన్ రూ.1,500 నుంచి రూ.3,016కు పెంపు -
శ్యామ్‌ని చూసి.. మిషెల్ ముగ్ధులైపోయారు
పెద్దయ్యాక ఏమౌతావ్? పిల్లల్ని అడుగుతాం. వాళ్లకేం తెలుసు ఏమవ్వాలో?! ఏదో ఒకటి చెబుతారు. అవడానికి ఏమేం ఉన్నాయో.. ముందు మనం చెప్పాలి వాళ్లకు. శ్యామ్ చెబుతున్నాడు. యు కెన్ బి ఎనీ థింగ్’అంటూ.. పెద్దయ్యాక ఏమేం అవొచ్చో ‘ర్యాప్’ డ్యాన్స్‌తో చూపిస్తున్నాడు. శ్యామ్‌ని చూసి.. మిషెల్ ముగ్ధులైపోయారు. శ్యామ్ వైట్కి ఆరేళ్లు. నల్లవాళ్లబ్బాయి. ర్యాప్‌తో సీన్లోకి వచ్చాడు! ‘ఆల్ఫాబెట్ ర్యాప్’ అని.. వాళ్ల డాడీ శ్యామ్ పాడి, ఆడిన ఆ వీడియోకి పేరు పెట్టాడు. ఆఫ్రికన్ స్టెయిల్లో చేతులు, తల ఆడిస్తూ ఎ ఫర్ ఆర్కిటెక్ట్, బి ఫర్ బయోకెమిస్ట్.. అని శ్యామ్ తీసిన దిద్దనక రాగాల ర్యాప్‌ను చూసి మిషల్ ఒబామా కూడా నవ్వును ఆపుకోలేకపోయారు! వాడి ఫీలింగ్స్, ఆ ఊగడం అది. ‘‘నాకు తెలుసు. ఇవి ఒత్తిళ్లతో కూడిన కాలాలు. ఈ వీడియో నా ముఖంపై స్ట్రెస్‌ను పోగొట్టి నన్ను ఆహ్లాదపరిచింది. అందుకని మీకు షేర్ చేస్తున్నాను. మనమంతా మన కిడ్స్ కోసం ఒక్కక్షణం ఆగి ఆలోచించేలా చేస్తాడు శ్యామ్. భవిష్యత్తులో వాళ్లను ఎలా చూడాలని అనుకుంటున్నామో మనకో ఆలోచన ఉంటుంది. అయితే శ్యామ్ ‘ఎబిసి ర్యాప్’ వెర్షన్ వేరేలా ఉంది. తనేం అంటాడంటే.. ‘యు కెన్ బి ఎనీ థింగ్’ అంటాడు. అవును. పిల్లల్ని తమకు ఇష్టమైన కలను కనమని శ్యామ్ చెబుతున్నాడు’’ అని మిషెల్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. శ్యామ్ కెమెరాను చూస్తూ నిలబడి పాడుతుంటాడు. తండ్రి బాబీ వైట్ కొడుకు వెనుక బల్ల ముందు కూర్చొని బీట్ ఇస్తుంటాడు. అదొక లయబద్ధమైన స్ఫూర్తి గీతం. రెండున్నర నిముషాల క్లిప్. ఇలా మొదలౌతుంది. ముందు తండ్రి అతడిని అడుగుతాడు. పెద్దయ్యాక ఏమౌతావ్ అని. ఏమైనా అవ్వొచ్చు అంటాడు శ్యామ్! ‘అంటే?’ అని తండ్రి అడుగుతాడు. ఇక శ్యామ్ ప్రారంభిస్తాడు. యు కెన్ బి ఎ ‘ఎ’.. యు కెన్ బి యాన్ ఆర్కిటెక్ట్! క్యాచ్ ఎ బిల్డింగ్ టు కిస్ ద స్కై. (నువ్వు ఆర్కిటెక్ట్ అవొచ్చు. ఆకాశాన్ని కిస్ చెయ్చొచ్చు.) యు కెన్ బి ఎ ‘బి’. యు కెన్ బి ఎ బయోకెమిస్ట్. మేక్ మెడిసిన్స్.. సేవ్ లైవ్స్. (నువ్వు బయోకెమిస్ట్ కావొచ్చు. మందులు కనిపెట్టి, ప్రాణలను నిలపొచ్చు). యు కెన్ బి ఎ ‘సి’. కంప్యూటర్ సాఫ్ట్వేర్ డెవలపర్. (నువ్వు సాఫ్ట్వేర్ డెవలపర్ కావచ్చు. ప్రోగ్రామ్స్ రాయొచ్చు)... ఇలా ఎ టు జడ్.. ర్యాప్ సాగుతుంది. శ్యామ్ పాటకు, స్టెప్స్‌కి చక్కగా జోడీ కుదిరింది. కొరియోగ్రఫీ కూడా శ్యామ్దే! ఎ నుంచి జడ్ వరకు ఎలా చెప్పగలిగాడు అనిపిస్తుంది. కెమెరా వైపు చూస్తూ శ్యామ్ ర్యాప్ కొట్టడానికి టెలీ ప్రాంప్టరేం లేదు. గుర్తుపెట్టుకున్నాడు! ర్యాపింగ్ నైపుణ్యాలను మధ్యమధ్య కుమారుడికి కొంత అద్దాడు తండ్రి. ‘యు కెన్ బి ఎ ‘డి’. ఎ డెంటిస్ట్. బికాజ్ ఎవ్రీబడీ లవ్స్ టు స్మైల్ అన్నప్పుడు.. నవ్వినట్లుగా పెదవులను సాగదీయమని చెబుతాడు. ఇంగ్లిష్ ఆల్ఫాబెట్స్‌లో చివరికి వచ్చేసరికి ఎవరికైనా కొంచెం ప్రాబ్లమ్ ఉంటుంది. వీడియో చూస్తూ ఉన్నప్పుడు మనకూ అనిపిస్తుంది ఈ పిల్లాడు ఎక్స్, వై, జడ్లకు ఏం చెబుతాడో అని. జడ్ కి ‘జలస్లీ స్ట్రైవ్’ అంటాడు. అసూయతో రగిలిపోతూ కష్టపడి సాధించమని. ‘వై’కి యువర్ ఓన్ బాస్ అంటాడు. నువ్వే నీకు బాస్‌వి కమ్మని. ‘ఎక్స్’ ప్రత్యేకంగా చెప్పలేదు. సమ్ ‘ఎక్స్’.. ఏదైనా అవ్వు కానీ, సోమరిగా మాత్రం ఉండిపోకు అని చెబుతాడు. ర్యాప్ ముగియగానే తండ్రి ఆనందం పట్టలేక గట్టిగా పిడికిలితో బల్లను గుద్దుతాడు. ఈ తండ్రీ కొడుకులది యు.ఎస్.లోని టెన్నెనీ రాష్ట్రంలోని మెంఫిస్. శ్యామ్ తన కడుపులో ఉండగా శ్యామ్ తల్లి పుస్తకాలు బాగా చదివారట. రెండేళ్ల వయసులోనే శ్యామ్ పుస్తకాలు చదివేందుకు ప్రయత్నించేవాడని కూడా ఈ ‘యు కెన్ బి ఎనీథింగ్’ ర్యాప్కి వచ్చిన స్పందనకు చూసి ఆ తల్లి ఉప్పొంగిపోతూ చెబుతున్నారు. స్టెఫానీ ఆమె పేరు. గత సెప్టెంబరులోనే శ్యామ్‌కు ఆరో ఏడు వచ్చింది. తండ్రి రాసి ఇచ్చిన ఏబీసీ ర్యాప్‌ను లిరిక్ లైన్స్ గుర్తుపెట్టుకుని పాడటానికి శ్యామ్ యాభైసార్లకు పైగా మననం చేసుకున్నాడు. ఇప్పటికింకా వైరల్ అవుతూనే ఉన్న ఈ వీడియోకు గత ఐదు రోజుల్లో యూట్యూబ్‌లో రెండు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఫేస్బుక్లో మూడు లక్షలసార్లు షేర్ అయింది. నువ్వు ఏమైనా అవొచ్చు అంటున్న శ్యామ్.. ఇంతకీ తను ఏమవ్వాలని అనుకుంటున్నాడు? ఆర్కెటెక్ట్ అవుతాడట. ఆకాశాన్ని చుంబించే భవంతులకు ప్లాన్లు గీయడం కోసం. View this post on Instagram Robert Samuel raps about career choices for kids. A post shared by Sam (@rsamuelw3) on Oct 26, 2020 at 12:14pm PDT -
దర్జాగా దోపిడీ
ఆచంట :కోడేరు ఇసుక ర్యాంపునకు లారీలు క్యూ కట్టాయి. సుదీర్ఘకాలం పాటు మూతపడిన ఇసుక ర్యాంపు గురువారం తెరుచుకోవడంతో ర్యాంపునకు వాహనాల తాకిడి పెరిగింది. సందట్లో సడేమియాగా నిర్వాహకులు వాహనాల నుంచి అధిక మొత్తంలో ఎగుమతి చార్జీల కింద సొమ్ములు వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. జిల్లాలో ఇసుక ర్యాంపులన్నీ మూత పడడంతో ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా నుంచి మాత్రమే ఇసుక లభ్యమవుతోంది. ఈ నేపథ్యంలో ర్యాంపు తెరుచుకున్న గంటల వ్యవధిలోనే పెద్ద ఎత్తున లారీలు తరలివచ్చాయి. యంత్రాలను వినియోగించి యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారు. ఇసుక డిమాండ్ నేపథ్యంలో సిండికేట్లు, కాంట్రాక్టర్లు, వినియోగదారులు అడిగినంత చెల్లించి ఇసుకను తీసుకువెళ్లవలసి వస్తోంది. ఆవేదనలో వినియోగదారులు ప్రభుత్వం ఇసుక ఉచిత విధానం ప్రవేశపెట్టడంతో నియోజకవర్గంలోని కోడేరు ఇసుక ర్యాంపు కొద్ది రోజుల పాటు నడిచింది. అధిక ధరలు వసూలు చేస్తుండడంతో అప్పట్లో పోలీసుల సమక్షంలో అమ్మకాలు సాగించారు. గత అగస్టులో గోదావరికి వరదలు రావడంతో ర్యాంపు మూతపడింది. అప్పట్లో గ్రామస్తులు సిండికేట్‌గా ఏర్పడి ర్యాంపు ఏర్పాటు వేసుకున్నారు. ర్యాంపు ఎక్కువ రోజులు నడవకపోవడంతో గ్రామస్తులు నిరుత్సాహపడ్డారు. ఆశించన మేరకు పెట్టుబడికి తగ్గ సొమ్ములు రాలేదు. దీంతో మరోసారి వారంతా ఏకమై ర్యాంపును పునరుద్ధరించారు. అయితే ర్యాంపు ఏర్పాటులో గ్రామస్తులతో పాటు అధికారపార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులతో పాటు, నాయకులు పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. వీరిలో అవినీత పరులంతా ఏకమై ఎగుమతి రేట్లు అమాంతంగా పెంచేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం యూనిట్ ఇసుక ఎగుమతికి రూ.350 దాటి వసూలు చేయరాదు. అయితే ప్రస్తుతం యూనిట్ ధర రూ.600 వరకూ వసూళ్లకు పాల్పడుతున్నారు. దీంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. అక్రమ నిల్వలు ర్యాంపు నుంచి తరలిపోతున్న ఇసుకను కొందరు సిండికేట్లు, కాంట్రాక్టర్లు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తరలించి పెద్ద ఎత్తున గుట్టులు గుట్టలుగా పెడుతున్నట్టు సమాచారం. ర్యాంపు ఎన్నిరోజుల పాటు నడుస్తుందోనన్న ఆందోళనతో ర్యాంపునకు వాహనాలు క్యూ కడుతున్నాయి. అధిక వసూళ్లపై అటు పోలీసులు గాని, ఇటు సంబంధిత అధికారులు గాని కన్నెత్తి చూడడం లేదు. ఇందుకుగాను పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారినట్టు ప్రచారం జరగుతోంది. ఇప్పటికే పెరిగిన ఇంటి సామగ్రితో పాటు ఇసుక ధర కూడా చుక్కలనంటడంతో వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు. తక్షణమే పభుత్వం ప్రకటించిన ప్రకారం ఇసుక ఎగుమతులు చేయాలని కోరుతున్నారు. -
కూలీల పొట్ట కొడతారా?
తహసీల్దార్ తీరుపై ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అసహనం మందపల్లి ఇసుక ర్యాంపు నిలిపివేతపై ఆగ్రహం ర్యాంపు గేటు తాళం తొలగించిన జగ్గిరెడ్డి మందపల్లి(కొత్తపేట) : ఇసుక ర్యాంపుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న సుమారు 500 మంది జట్టు కూలీల కష్టార్జితాన్ని దోచుకుంటున్న దళారులకు కొమ్ముకాస్తారా? అందుకు ర్యాంపును మూసేసి కూలీల పొట్ట కొడతారా? అధికారులుగా మీరు తీసుకునే నిర్ణయం సరైనదా? అంటూ కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తహసీల్దార్ ఎన్.శ్రీధర్‌ను ప్రశ్నిస్తూ అసహనం వ్యక్తం చేశారు. కొత్తపేట మండలం మందపల్లి ఇసుక ర్యాంపును ఈ నెల 2న తెరిచారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఇసుక ఎగుమతి, బాట నిర్వహణ ఖర్చులు మాత్రమే తీసుకుని ఇసుక ఎగుమతి చేయాలని అధికారులు జట్టు సంఘాలకు సూచించారు. 12 జట్టు కూలీ సంఘాలకు చెందిన సుమారు 500 మంది కూలీలు ఇసుక ఎగుమతులు చేస్తున్నారు. ఇదిలా వుండగా బాట నిర్వహణ పేరుతో వసూలు చేస్తున్న సొమ్మును జట్టు మేస్త్రీ కూడా కాని అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి ర్యాంపును నిర్వహిస్తూ మిగిలిన సొమ్మును పంచకుండా తన గుప్పెట్లో పెట్టుకుని లెక్కలు చెప్పడం లేదని కూలీల ఆరోపణ. ఆ నేపథ్యంలో ఆ వ్యక్తికి వ్యతిరేక వర్గాల కూలీలందరూ బాట నిర్వహణ బాధ్యత నెలలో 15 రోజులు తాము చేపడతామని అధికారులను కోరారు. దానిపై ఈ నెల 18 న తహసీల్దార్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఇసుక కమిటీ.. జట్టు సంఘాల మేస్త్రీలతో చర్చించారు. బాట నిర్వహణ సొమ్ము వీఆర్వో వసూలు చేసి అధికారుల జాయింట్ అకౌంట్లో జమ చేయగా బాటకు ఎంత ఖర్చు అవుతుందో అంత డ్రా చేసి ఇస్తామని శ్రీధర్ తెలిపారు. సోమవారం ర్యాంపు గేటు తెరవకపోవడంతో కూలీలు వీఆర్వోను ఆరా తీయగా జాయింట్ అకౌంట్ పని పూర్తి కాలేదని , అందువల్ల తహసీల్దార్ ర్యాంపు తెరవద్దన్నారని తెలిపారు. దాంతో జట్టు సంఘాల సభ్యులు ఎమ్మెల్యే జగ్గిరెడ్డికి ఫిర్యాదు చేశారు. వెంటనే ఆయన మందపల్లి ర్యాంపుకు చేరుకోగా మేస్త్రీలు కుంపట్ల వెంకన్న,వి లక్ష్మణస్వామి, నేరేడుమిల్లి మందేశ్వరరావు, బద్దా ఏసు, యార్లగడ్డ గణేష్, నక్కా సత్యనారాయణ తదితరులు ర్యాంపులో జరుగుతున్న తీరును, తహసీల్దార్ ప్రతిపాదనపై విముఖత, ర్యాంపు మూసివేత తదితర అంశాలను ఏకరువుపెట్టారు.జగ్గిరెడ్డి తహసీల్దార్‌కు ఫోన్ చేసి అసహనం వ్యక్తం చేశారు. ఏ విషయమైనా చర్చించడానికి ర్యాంపు మూసేయాలా? కూలీలను ఖాళీగా కూర్చోపెట్టి కడుపు మాడ్చాలా? ఇది సరైన నిర్ణయం కాదు. వెంటనే గేటు తెరిపించండి అంటూ ఆదేశించారు. కొంత సేపటికి వీఆర్వో ర్యాంపునకు రాగా గేటు తాళం ఏది? అని ఆరా తీస్తే ఒకటి పోలీస్ వద్ద, మరొకటి జట్టు సంఘం మేస్త్రి కాని వ్యక్తి వద్ద వుందన్నారు. దాంతో పోలీసు అధికారులతో సంప్రదించి జగ్గిరెడ్డి తాళం తొలగించి గేటు తెరిచారు. కూలీలంతా ఒక్కమాటపై నిలవాలి కూలీలందరూ ఒక్క మాటపై నిలబడాలని జగ్గిరెడ్డి అన్నారు. లేకుంటే అధికారులకు లోకువ. దాన్ని ఆసరాగా తీసుకుని ఇలాగే పొట్ట కొడతారు అని అన్నారు. దళారులకు అవకాశం లేకుండా ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం వసూలు చేసే మొత్తం మీకే దక్కాలని అన్నారు. అధికారులు దళారులకు సహకరించేలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. మీకు ఏకష్టమొచ్చినా అందుబాటులో వుంటానని జగ్గిరెడ్డి కూలీలకు భరోసా ఇచ్చారు. జగ్గిరెడ్డి వెంట రావులపాలెం ఎంపీపీ కోట చెల్లయ్య, జెడ్పీ ప్రతిపక్ష నాయకుడు సాకా ప్రసన్నకుమార్, రాష్ట్ర వైఎస్సార్సీపీ ప్రచార కార్యదర్శి ముసునూరి వెంకటేశ్వరరావు, మండల పార్టీ కన్వీనర్ ముత్యాల వీరభద్రరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు సాదు చెంచయ్య, గ్రామ పార్టీ నాయకులు తోరాటి గణేష్,చింతం సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే.. ర్యాంపు మూసివేతపై తహసీల్దార్ శ్రీధర్‌ను వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే చర్యలు తీసుకుంటున్నామన్నారు.బాట నిర్వహణ సొమ్ము జాయింట్ అకౌంట్లో జమచేసి ఖర్చు చేయడం రాజమండ్రి డివిజన్లో అమలు జరుగుతుందని, ఆ విషయం చర్చించేందుకు ర్యాంపు మూసి చేసి మేస్త్రీలను రమ్మని కబురు పంపితే వారు రాలేదని అన్నారు. -
క్యాట్‌వాక్ చేసిన సాక్షిమాలిక్, యోగేశ్వర దత్
-
పశువుల అక్రమ రవాణాపై నిఘా
జంగారెడ్డిగూడెం రూరల్ : జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న పశువుల సంతపై ప్రత్యేక నిఘా పెడుతున్నామని జంతు నివారణ జిల్లా సంస్థ ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి ఎన్సీహెచ్ భాను అన్నారు. సోమవారం జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డులో జరుగుతున్న సంత తీరును ఎస్సై ఎ.ఆనందరెడ్డితో కలిసి భాను పరిశీలించారు. గత నెల 25న ‘పాపం పశువులు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తపై ఆయన స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా పక్క రాష్ట్రాలకు చెందిన లారీల్లో గోవుల అక్రమ రవాణాను ఎందుకు ప్రోత్సహిస్తున్నారంటూ ర్యాంపు వద్ద సీసీ కెమెరాలు ఎందుకు ఏర్పాటు చేయలేదంటూ భాను మార్కెట్ యార్డు సిబ్బంది ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశించిన నిబంధనలు ఎక్కడా కానరావడం లేదన్నారు. ర్యాంపు సీసీ కెమెరాల లేవని, షెడ్లు, మంచినీరు వంటి సదుపాయాలు కూడా లేవని భాను తెలిపారు. పరిశీలన నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్టు చెప్పారు. -
ఆవులకు అందాల పోటీలు!
హరియాణాః ఆవులకు పాలిచ్చే విషయంలో పోటీలు పెట్టడం చూశాం. అలాగే ఎడ్ల బండి పోటీలగురించీ విన్నాం. కానీ హరియాణా ప్రభుత్వం మాత్రం ఇప్పుడు ఆవులకు అందాల పోటీలు నిర్వహిస్తోంది. తొలిసారిగా రోఠక్ జిల్లా ఆ పోటీలకు వేదిక కానుంది. ఫ్యాషన్ షోలో పాల్గొన్న వాటిలో ఎంపికైన వాటికి బెస్ట్ కౌ, బెస్ట్ బుల్ అవార్డులు అందిస్తారు. యజమానులు అందంగా అలంకరించి తెచ్చిన ఆవులు, ఎద్దులు ర్యాంప్ పై క్యాట్ వాక్ కూడ చేసి చూపరులను అలరించనున్నాయి. పోటీల్లో పాల్గొని విజేతలైన ఆయా ఆవులు, ఎద్దుల యజమానులకు లక్ష రూపాయల చొప్పున బహుమానం అందిస్తారు. దేశీ ఆవులకు నిర్వహించే ఫ్యాషన్ షో కు హరియాణా సిద్ధమైంది. ఆవులు ర్యాంప్ పై క్యాట్ వాక్ చేసి.. ఇప్పడు అందర్నీ ఆకట్టుకోనున్నాయి. రాష్ట్రంలోని రోఠక్ జిల్లా, బహుఅక్బర్పూర్ గ్రామంలో జరిగే ఆవుల సౌందర్య పోటీల్లో అన్నింటికంటే అందంగా ఉన్న, అత్యధిక పాలను అందించే ఆవులను ఎంపిక చేసి బెస్ట్ కౌ, బెస్ట్ బుల్ అవార్డులు అందిస్తారు. వాటి యజమానులకు లక్ష రూపాయల చొప్పున బహుమానం కూడ ఇస్తారు. ఆవుల అభివృద్ధికోసం పశుపాలనా విభాగం ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి హరియాణా గోసేవా ఆయోగ్ ఛైర్మన్ భానే రాం మంగళా ముఖ్య అతిథిగా హాజరౌతారు. ఇతర నగర ప్రముఖులు, అధికారులు, నాయకుల అధ్యక్షతన జరిగే కార్యక్రమం మే 6, 7 తేదీల్లో జరగనున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. 'కౌ ర్యాంప్ క్యాట్ వాక్' షో... బహుఅక్బర్ పూర్ వెటర్నరీ కళాశాల ప్రాంగణంలో జరగనున్నట్లు నోడల్ అధికారి ప్రేమ్ సింహ్ వెల్లడించారు. ఈ ర్యాంప్ షోలో ఆరు రాష్ట్రాలకు చెందిన వివిధ దేశీ ఆవులు పాల్గొంటాయని తెలిపారు. పోటీల్లో పాల్గొనాలనుకునే ఆయా పశువుల యజమానులు మే 5 తేదీ సాయంత్రానికి కార్యక్రమ స్థలానికి చేరుకోవాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. మే 6వ తేదీ ఉదయం, సాయంత్రం ప్రదర్శనలో పాల్గొని ఎంపికైన ఆవులతో 7వ తేదీ క్యాట్ వాక్ కార్యక్రమాన్ని మనోరంజకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొని విజేతలైన ఆవులు, ఎద్దుల యజమానులకు వ్యవసాయ మంత్రి ఓం ప్రకాష్ ఘన్ ఖడ్ బహుమతులు ఇచ్చి సన్మానిస్తారు. ఆవులకు ఇటువంటి క్యాట్ వాక్ షో దేశంలోనే మొదటిసారి నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గో సంరక్షణ, అభివృద్ధి కోసం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. -
అంతా మా ఇష్టం..
అధికారం మాది..ర్యాంపు వేసి తీరుతాం టీడీపీ నాయకుల ధీమా కేసు పెట్టినా తగ్గని వైనం ఉసులుమర్రు(పెరవలి) : అంతా మా ఇష్టం.. అధికారం మాది. మేం ఏదైనా చేస్తాం. ఎవరడ్డొచ్చినా ఉసులుపర్రు వద్ద ర్యాంపు ఏర్పాటు చేసి తీరతాం అనే ధోరణిలో తెలుగుదేశం పార్టీ నాయకులు ముందుకు సాగుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉసులుపర్రు వద్ద గోదావరి ఏటిగట్టును ధ్వంసం చేసి ఇసుక ర్యాంపునకు బాట వేసేందుకు పనిని మొదలుపెట్టిన వారు గోదావరి కన్వర్జన్సీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆగలేదు. 11 మందిపై కేసు పెట్టినా ర్యాంపునకు బాట వేసే పనిని ఆపలేదు. గత రెండురోజులుగా ఈ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇవి పూర్తయితే శుక్రవారం నుంచి లేదా శనివారం నుంచి ఇసుక ఎగుమతులకు టీడీపీ నాయకులు సన్నద్ధమవుతున్నారు. వీరికి స్థానిక ప్రజాప్రతినిధి అండదండలు ఉండడం వల్లే వారు జంకూగొంకూ లేకుండా పనులు చేసుకుపోతున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. ఆ ప్రజాప్రతినిధి సిఫారసు వల్లే ఏటిగట్టును ధ్వంసం చేసిన ఘటనలో చట్టప్రకారం నాన్‌బెయిలబుల్ కేసులు నమోదుచేయాల్సి ఉండగా, పోలీసులు సాదాసీదాగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి. ఏటిగట్టును ధ్వంసం చేయడం వల్ల వరదలు వస్తే పెనుప్రమాదం సంభవిస్తుందని తెలిసినా.. నాయకులు స్వార్థంతో ర్యాంపు ఏర్పాటును ఆపడం లేదు. కలెక్టర్ భాస్కర్ బుధవారం జిల్లాలో 10 రీచ్‌లలో మాత్రమే ఇసుక తవ్వకాలకు పర్యావరణ అనుమతులు ఉన్నాయని స్పష్టం చేశారు. మిగతా చోట్ల ఇసుక తవ్వితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ హెచ్చరికలను కూడా స్థానిక టీడీపీ నాయకులు ఖాతరు చేయడం లేదు. కలెక్టర్ చెప్పిన ప్రకారం.. మండలంలోని కానూరు ర్యాంపునకు మాత్రమే అనుమతులు ఉన్నట్టు తెలుస్తోంది. తీపర్రు ర్యాంపునకు కూడా అనుమతులు లేవని, అలాంటిది ఉసులుమర్రు వద్ద ర్యాంపు ఏర్పాటు చేయడం ప్రమాదకరమని స్థానికులతోపాటు అధికారులూ చెబుతున్నారు. అయినా టీడీపీ నాయకులు ఏమాత్రం పట్టించుకోకుండా బాట పనులు చేయిస్తున్నారు. దీనిపై గోదావరి కన్వర్జన్సీ ఏఈ ఎన్.వి.సత్యనారాయణరాజును వివరణ కోరగా ముందు ఇచ్చిన ఫిర్యాదుతోపాటు పోలీసులకు తాజాగా మరో ఫిర్యాదు కూడా ఇచ్చామని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశామని వెల్లడించారు. -
ఖాదీ ఫ్యాషన్‌షోలో ’సల్మాన్’
-
మాటరాని అందమిది
కళ్లు మాట్లాడతాయి.. నవ్వు మాట్లాడుతుంది.. ఆమె రూపం మాట్లాడుతుంది. కాని ఆమె మాట్లాడలేదు. అందమైన రూపాన్నిచ్చిన బ్రహ్మ.. అంతకు మించి ఎందుకనుకున్నాడో ఏమో.. నోటి మాటను ఆమె నొసటన రాయలేదు. అయితేనేం.. ర్యాంప్‌పై వయ్యారాలు ఒలకబోస్తుంది. ప్రకటనల్లో భావాలు వర్షిస్తుంది. సిటీలో మోడల్‌గా రాణిస్తోన్న ఈమె ర్యాంప్‌పై ఎక్కడైనా కనపడితే.. శభాష్ అని పొగడాలనుకుంటున్నారా.. ఉపయోగం లేదు. ఎందుకంటే ఆమెకు వినపడదు కూడా.. అయితేనేం డెఫ్ అండ్ డంబ్ మోడల్‌గా సిటీలో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన సరిత (22) ఎన్ని అభినందనలకైనా అర్హురాలే. ..:: ఎస్.సత్యబాబు ర్యాంప్‌పై మోడల్‌గా రాణించడమంటే ఆషామాషీ కాదు. రూపం ఒక్కటే సరిపోదు. అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. చదువుంటే చాలదు. కొరియోగ్రాఫర్స్, డిజైనర్స్ చెప్పింది అలా విని ఇలా అల్లుకుపోగలగాలి. ఎందుకంటే ఇప్పుడు మోడలింగ్ అంటే ప్రతిభావంతులైన సుందరాంగుల ప్రపంచం. అలాంటి ప్రపంచంలోకి అడుగుపెట్టింది మాటరాని, వినలేని సరిత. చిన్ననాటి కలను నిజం చేసుకోవడానికి పెద్ద లోపాన్ని కూడా లెక్కచేయకుండా కృషి చేస్తోంది. ‘మాది వరంగల్. నాన్నది వ్యవసాయం. అమ్మ గృహిణి. మేం మొత్తం ఆరుగురు పిల్లలం’ అంటూ రాయడం మొదలు పెట్టింది సరిత (మా ప్రశ్నలకు సమాధానాలు రాస్తూ ఇంటర్వ్యూ ఇచ్చింది) ఆమె చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే... సారీ ఆమె రాతలోనే.. ఇంట్లో సగానికి పైగా డెఫ్ అండ్ డంబ్.. కారణం తెలియదు కానీ, మా ఆరుగురిలో ఇద్దరు సోదరులు, ఒక సోదరి కూడా నాలాగే మూగ, చెవిటి. మిగిలిన వారు బాగానే ఉన్నారు. అన్నయ్య తనలాగే డెఫ్ అండ్ డంబ్ అయిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చిన్నప్పటి నుంచి ఎక్కువగా టీవీ చూసేదాన్ని. అందులో వచ్చే ఫ్యాషన్ చానెల్ నాకు బాగా నచ్చేది. అంతేకాకుండా టీనేజ్‌లో ఉండగా బాగుంటాననే ప్రశంసలు... అప్పుడే నాకు మోడలింగ్ చేయాలనిపించేది. అయితే నాకున్న లోపం వల్ల ఆ ఆశ తీరదు కదా అని బాధపడేదాన్ని. ఈ లోపాన్ని అధిగమించడానికి సైన్ లాంగ్వేజ్ నేర్చుకుని ఇంటర్ పూర్తి చేశాను. డెఫ్ మోడల్ కాంటెస్ట్.. అదే సమయంలో మూగ చెవుడు ఉన్నవారి కోసం ప్రత్యేకంగా బ్యూటీ కాంటెస్ట్ నిర్వహిస్తున్నారని తెలిసింది. ఎలాగైనా అందులో పాల్గొనాలని నిర్ణయించుకున్నాను. అందుకే అతి కష్టం మీద ఇంట్లోవాళ్లని ఒప్పించి హైదరాబాద్ వచ్చేశాను. నెట్లో కాంటెస్ట్‌కు అప్లయ్ చేసి, ప్రిలిమినరీస్‌లో సెలక్టయ్యాను. అన్ని దశలూ దాటాను. చివరికి మిస్ డెఫ్ ఆంధ్రప్రదేశ్‌గా సెలక్టయి, 2012లో ముంబైలో జరిగిన మిస్ డెఫ్ ఇండియా పోటీల్లో సైతం పాల్గొన్నాను. 22 మంది పార్టిసిపేట్ చేశారు. నాకు కిరీటం రాకపోయినా మంచి ఐడెంటిటీ వచ్చింది. ఆ తర్వాత అడపాదడపా ర్యాంప్‌వాక్ అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్గా టాలీవుడ్ మ్యాగజైన్ లాంచ్ సందర్భంగా ర్యాంప్‌వాక్ చేశాను. అలాగే ప్రింట్ యాడ్స్ కూడా వస్తున్నాయి. అయితే రాష్ట్రస్థాయి బ్యూటీ కాంటెస్ట్ గెలిచిన మిగిలిన పేజెంట్స్ విజేతలతో పోలిస్తే తక్కువ. నాకున్న సమస్యపై చాలా మంది సానుభూతి చూపిస్తున్నారే కాని.. అవకాశాలు ఇవ్వడం లేదు. ఏదేమైనా మోడలింగ్ కెరీర్లో ముందుకే వెళ్లాలనుకుంటున్నాను. ఎప్పటికైనా మిస్ డెఫ్ ఇండియా పోటీల్లో సత్తా చాటాలనుకుంటున్నాను. ఇదీ మిస్ డెఫ్ ఇండియా కాంటెస్ట్ నేపథ్యం.. దేశంలో ఉన్న మాటరాని, వినలేని యువతుల్లో ఆత్మస్థైర్యం నింపడానికి నిర్వహిస్తున్నవే మిస్ డెఫ్ ఇండియా బ్యూటీ కాంటెస్ట్‌లు. ఆరేళ్ల క్రితమే ప్రారంభమైనా.. ఇప్పుడిప్పుడే అందరినీ ఆకర్షిస్తున్నాయి. ప్రభుత్వ సహకారంతో నడిచే డెఫ్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. మిగిలిన బ్యూటీ పేజెంట్స్కు భిన్నంగా ఈ పోటీల్లో పాల్గొనే అందగత్తెలకు ఎత్తు, అర్హతల విషయంలో పలు మినహాయింపులున్నాయి. వీరి కోసం ఇంటర్‌ప్రిటర్స్ (సైన్ లాంగ్వేజ్‌ను అర్థం చేసుకుని సాధారణ భాషలోకి తర్జుమా చేసే అనువాదకులు)ను సైతం నిర్వాహకులు ఏర్పాటు చేస్తారు. రెండేళ్ల క్రితం ముంబైలోని బిర్లా మాతృశ్రీ సభాగృహలో డెఫ్ ఎక్స్‌పోలో భాగంగా నిర్వహించిన పోటీలో అప్పటి ఆంధ్రప్రదేశ్ తరఫున సరిత పాల్గొంది. ‘మూగవాళ్లకు మాతృభాష సైన్ లాంగ్వేజ్. దీనిపై చాలామందిలో అవగాహన లేదు. సైన్ లాంగ్వేజ్‌లో మాట్లాడడంలో పరిణితి సాధిస్తే డెఫ్ అనే ఆలోచన కూడా రాదు’ అంటారు ఎక్స్పో నిర్వాహకులు, పుట్టుకతో మూగవారైన అలోక్ కేజ్రీవాల్. పాఠశాలల్లో ఖరీదైన డిజిటల్ హియరింగ్ ఉత్పత్తులు అందుబాటులో లేవు. అమెరికాలో అడ్వాన్స్డ్ వీడియో కాలింగ్ డివెజైస్ ఉన్నాయి అంటున్న అలోక్.. మాటలతో ఏకీభవిస్తారు ఈ పోటీలకు చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న మరో డెఫ్ అండ్ డంబ్ యువతి కాజల్ థావన్.. 2009లో మమతాసింగ్ అనే మూగ యువతి మిస్ డెఫ్ ఇండియాగా ఎన్నికై మిస్ డెఫ్ వరల్డ్ పోటీలకు సైతం ప్రాతినిథ్యం విహంచింది. అలాగే కనికా బాలి, అంకితాకుమారి.. వీరంతా మాట లేకున్నా మంత్రముగ్ధులను చేసే అందంతో కిరీటాన్ని గెలుచుకున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలకు ఇప్పటిదాకా సరైన ప్రాతినిథ్యం లేదనే లోటును సరిత భర్తీ చేస్తోంది. -
షారుఖ్ బంగ్లా వద్ద ర్యాంప్ తొలగించండి:ఎంపీ
ముంబై: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ బంగ్లాకు సమీపంలో అక్రమంగా నిర్మించిన ర్యాంప్ ను తొలగించాల్సిందిగా బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని సుబర్బన్ బంద్రాలో షారుఖ్ బంగ్లాకు దగ్గరగా ఒక సిమెంట్ రోడ్డుపైన ఉన్న ర్యాంప్ తమకు ఇబ్బందిగా మారిందని స్థానికులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. అది ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసిందని వారు ఎంపీకి తెలిపారు. దీనిపై స్పందించిన ఎంపీ పూనమ్ ఇటీవల బ్రిహ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ సీతారాం కుంతేకు లేఖ రాశారు. ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఆ అక్రమ నిర్మాణాన్ని తొలగించాలంటూ ఆమె కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. ఇది ఆ బంగ్లా యజమాని తన ప్రైవేటు వాహనాల పార్కింగ్ కు వినియోగిస్తున్నట్లు తెలిపారు. -
ర్యాంప్‌పై గర్భిణుల క్యాట్ వాక్!
-
స్టైలు స్టైలురా..
ర్యాంప్‌పై అందాలభామలు హొయలు పోయినట్టు.. కళ్లద్దాలు పెట్టుకుని, డిజైనర్ దుస్తులు ధరించి ఈ శునకరాజం ఎంత ఠీవిగా నడుస్తోందో చూశారా.. రెండు కాళ్లపై నడవడమే దీని స్పెషాలిటీ. ఈ శునకం పేరు షియోను. తన యజమాని ఫాంగ్(62)తో కలసి రోజు నడుచుకుంటూ మార్కెట్‌కు వెళుతుంది. చైనాలోని షాంఘై సిటీలో డిసెంబర్ 19న షియోను మార్కెట్‌కు వెళుతుండగా తీసిన చిత్రమిది. మూడేళ్ల క్రితం రోడ్డు పక్కన దొరికిన కుక్కపిల్లకు షియోను అని పేరుపెట్టి పెంచుకుంటున్నాడు ఫాంగ్. రెండు కాళ్లపై నడిచేలా తర్ఫీదునివ్వడంతో మనుషుల్లాగే నడిచేస్తోంది.. -
భద్రాచలం వద్ద గోదారిపై రెండో వంతెన
* నిర్మాణానికి రూ.80 కోట్లు * ఇప్పటికే ప్రారంభమైన పనులు * రెండేళ్లలో అందుబాటులోకి.. భద్రాచలం: భద్రాచలం వద్ద గోదావరి నదిపై మరో బ్రిడ్జి నిర్మాణానికి పనులు ప్రారంభమయ్యాయి. భద్రాచలంలో జరిగే ముక్కోటి, శ్రీరామనవమి ఉత్సవాల సమయంలో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతుండటంతో.. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతవాసులు రెండో బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో బ్రిడ్జి నిర్మాణానికి రూ.80 కోట్లు మంజూరు చేయగా, ఇటీవలే పనులు ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న బ్రిడ్జికి ఆనుకొని ఎగువ ప్రాంతంలో మరో వంతెన నిర్మిస్తున్నారు. ఇప్పట్లో గోదావరి నదికి వరదలు వచ్చే అవకాశం లేకపోవటంతో వచ్చే మార్చివరకు పనులు చేసేందుకు ఎన్‌హెచ్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. గోదావరిలో పిల్లర్ల నిర్మాణానికి ప్రస్తుతం బ్రిడ్జికి ఇరువైపులా ర్యాంప్ నిర్మిస్తున్నారు. పటిష్ట నిర్మాణానికి అనుగుణంగా ఉండేందుకుగోదావరి ఇవతలి ఒడ్డు నుంచి సార పాక అవతలి ఒడ్డు వరకు మట్టి నమూనాలు సేకరిస్తున్నారు. గతంలో ఉన్న బ్రిడ్జి మాదిరిగానే 37 పిల్లర్లు నిర్మిస్తున్నట్లు ఎన్‌హెచ్ ఈఈ చంద్రశేఖర్ తెలిపారు. పాదచారులకు సౌకర్యంగా ఉండేందుకు కొత్తగా నిర్మించే బ్రిడ్జికి ఇరువైపులా ఫుట్‌పాత్‌లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 2016 డిసెంబర్ నాటికి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. త్వరలోనే శంకుస్థాపన.. గోదావరి నదిపై నిర్మించే రెండో బ్రిడ్జి నిర్మాణం చరిత్రాత్మకంగా నిలిచిపోయే అవకాశం ఉన్నందున దీన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుతోగానీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుతోగానీ శంకుస్థాపన చేయించేందుకు ఎన్‌హెచ్ అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. వచ్చే నెలలో కేసీఆర్ భద్రాచలం వచ్చే అవకాశం ఉందని, అదే రోజు ఈ శంకుస్థాపన ఉండొచ్చని సమాచారం. అయితే వెంకయ్యనాయుడుతో శంకుస్థాపన చేయించాలని రాష్ట్ర బీజేపీ అగ్రనేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. నాడు రూ.70 లక్షలు.. నేడు రూ.80 కోట్లు భద్రాచలం వద్ద గోదావరి నదిపై ప్రస్తుతం ఉన్న బ్రిడ్జిని రూ.70 లక్షల వ్యయంతో పూర్తి చేశారు. 1959 డిసెంబర్ 16న అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ఈ పనులకు శంకుస్థాపన చేయగా, 1965 జులై 13న రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రారంభించారు. 3934 అడుగుల పొడవు, 37 పిల్లర్లు, ఒక్కో పిల్లర్ మధ్య 106.6 అడుగుల దూరంతో బ్రిడ్జి నిర్మించారు. ఇప్పటికీ ఇది పటిష్టంగానే ఉన్నప్పటికీ ఇది జాతీయ రహదారి అయినందున భవిష్యత్‌లో రవాణా అవసరాల దృష్ట్యా మరో బ్రిడ్జి నిర్మించాలని జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపడంతో కేంద్రం నిధులు మంజూరు చేయగా, పనులు మొదలయ్యాయి. -
ఫ్యాషన్ అంటే ఇష్టమే
ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేసిన సానియా మీర్జా న్యూఢిల్లీ: ధవళ కాంతులతో తనుకులీనుతున్న అనార్కలి చుడీదార్... దానిపై బంగారు రంగుతో చూడ చక్కని డిజైన్... చెవులకు జుమ్కీలు... చేతికి అందమైన రిస్ట్ వాచ్... నల్లగా నిగనిగలాడుతున్న కురులు... ర్యాంప్‌పై క్యాట్ వాక్... శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన విల్స్ లైఫ్ స్టయిల్ ఇండియా ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వస్త్రధారణ ఇది. డిజైనర్ రీతూ పాండే రూపొందించిన ఈ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో హైదరాబాద్ అమ్మాయి... తన అందంతో చూపరులను కట్టిపడేసింది. చీరలు, ప్యాంట్లు, ధోతీలు... ఇలా రకరకాల డిజైన్ దుస్తులతో ర్యాంప్‌పై హొయలు ఒలికించిన మోడల్స్‌తో కలిసి సానియా తన ప్రత్యేకతను చాటుకుంది. ఫ్యాషన్ అంటే తనకు ఇష్టమని ఈ సందర్భంగా టెన్నిస్ స్టార్ చెప్పింది. ‘ర్యాంప్‌పై వాక్ చేసేటప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. మన జీవితాల్లో ఫ్యాషన్ కూడా ఓ భాగం. నాకు అనుకూలంగా ఉంటే టీషర్ట్లు, జీన్స్, జాకెట్స్‌ను ధరిస్తుంటాను. నడుముపైకి వచ్చే దుస్తులు, మోకాలి వరకు ఉండే స్కర్టులంటే కూడా నాకు ఇష్టమే’ అని షో తర్వాత సానియా వ్యాఖ్యానించింది. దుస్తులకు కొత్త అందాన్నిచ్చే టెక్నిక్లను వాడి వీటిని రూపొందించినట్లు డిజైనర్ పాండే తెలిపింది. -
పట్టుమహిషులు
పట్టు గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమైనా, ఫ్యాషన్ ప్రపంచంలో పట్టుకు ప్రాధన్యం కల్పించడమైనా సరే.. ‘పట్టు’దలతోనే సాధ్యం అంటున్నారు ఈ మహిళలు. ‘శ్రీమతి సిల్క్‌మార్క్-2014’లో ర్యాంప్‌పై ఇటీవల మిలమిలలాడిన ఈ మిసెస్లు పట్టువస్త్రాలకు మళ్లీ మంచిరోజులు రావాలనే ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం. భిన్న నేపథ్యాలకు చెందిన వారైనా ‘పట్టు’దల వీరిని ఒకే వేదికపైకి తెచ్చింది. పట్టు వస్త్రాలపై ఈ ‘పట్టు’మహిషుల మనోగతం వారి మాటల్లోనే... పట్టుపై అవగాహన పెరగాలి.. పట్టు గురించి విద్యార్థుల్లోనే కాదు, ప్రజల్లోనూ అవగాహన పెరగాలి. పట్టు ప్రాధాన్యమేమిటో మహిళలకే బాగా తెలుసు. పట్టుపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు నా వంతు బాధ్యతగా ఈ ర్యాంప్‌వాక్‌లో పాల్గొన్నా. గత ఏడాది ఈ ఫ్యాషన్ షోలో పాల్గొనేందుకు పేరు నమోదు చేసుకున్నా, కానీ హాజరు కాలేకపోయాను. అప్పుడు ఇచ్చిన వివరాలను గుర్తుంచుకుని మరీ నిర్వాహకులు సమాచారం ఇవ్వడంతో ఈసారి పాల్గొనగలిగాను. - స్వప్నప్రసాద్, టీచర్, వసంతనగర్, కూకట్పల్లి పట్టు గొప్పదనం అర్థమైంది.. మాది రాజస్థాన్. రాజస్థాన్ సంప్రదాయ వస్త్రధారణలో చీరలకు ప్రాధాన్యం ఉండదు. ఇక్కడికొచ్చాక పట్టు గొప్పదనం అర్థమైంది. టీవీలో స్క్రోలింగ్ చూసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. కాలేజీ డేస్ ఇలాంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనేదాన్ని. పెళ్లి తర్వాత హైదరాబాద్ వచ్చేశాక ఆ లైఫ్ మిస్సయ్యానన్న దిగులు ఉండేది. పెళ్లయిన వారు సైతం తమ టాలెంట్‌ను నిరూపించుకునేందుకు హైదరాబాద్‌లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుండటం చాలా బాగుంది. - శ్వేతాచౌదరి, పార్ట్‌టైమ్ ట్యూటర్, కొండాపూర్ పట్టుచీరలంటే చాలా ఇష్టం.. మా ఆయన అభిషేక్ హైకోర్టు అడ్వొకేట్. అమ్మాయి శ్రావ్య ఇంటర్ చదువుతోంది. నేను బడ్స్ అండ్ ఫ్లవర్స్ స్కూల్లో పనిచేస్తున్నాను. చివరి నిమిషంలో ఈ కార్యక్రమం గురించి తెలియడంతో స్కూలు నుంచి నేరుగా కార్యక్రమానికి వచ్చేశాను. మన సంప్రదాయ వేడుకల్లో, పండుగల్లో పట్టువస్త్రాలకు చాలా ప్రాధాన్యం ఉంది. నాకు పట్టుచీరలంటే ఇష్టం.నా దగ్గర పట్టుచీరల కలెక్షన్ చాలానే ఉంది. - సత్యవాణి, టీచర్, కమలాపురి కాలనీ అవగాహన కార్యక్రమం ప్రశంసనీయం.. మా ఆయన ఫ్రాంక్లిన్ కంపెనీలో ట్రెజరర్. పెళ్లయి మూడున్నరేళ్లు అయింది. పెళ్లయ్యాక ఒక్కసారిగా బాధ్యతలన్నీ మీదపడతాయి. ఒతిళ్లు పెరుగుతాయి. అలాంటి ఒత్తిళ్ల నుంచి మహిళలకు రిఫ్రెష్మెంట్ కావాలి. అందులో అవేర్నెస్ కూడా ఉంటే మానసిక తృప్తి కూడా ఉంటుంది. టీవీలో స్క్రోలింగ్ చూసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. పట్టుపై అవగాహన కోసం ఈ కార్యక్రమం చేపట్టడం ప్రశంసనీయం. - శ్రుతిలక్ష్మి, ‘రేడియో అర్చన’లో ఆపరేషన్స్ ఆఫీసర్, రామంతపూర్ మా ఆయన ప్రోత్సాహంతో వచ్చాను.. మా ఆయన హరీష్, డెలాయిట్‌లో ప్రాజెక్ట్ మేనేజర్. పద్నాలుగేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నా. చిన్నప్పటి నుంచి చదువు కంటే ఎక్స్ట్రాకరిక్యులర్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం. స్కూల్, కాలేజీల్లో చదువుకునేటప్పుడు ప్రతి ఈవెంట్లోనూ పార్టిసిపేట్ చేసేదాన్ని. నా ఇంటరెస్ట్ చూసి మా ఆయన నన్ను ప్రోత్సహిస్తుంటారు. పట్టుచీరలపై అవగాహన కల్పించే అవకాశం ఉండటంతో ఈ కార్యక్రమానికి వచ్చాను. - జయ ఇంటూరి, గృహిణి పెళ్లయిన వారికీ వేదికలు ఉండటం విశేషం.. పెళ్లయి నాలుగు నెలలే అయింది. మా ఆయన నరసింహారెడ్డి, మార్కెటింగ్ ఇంజనీర్. టీవీలో స్క్రోలింగ్ చూసి వచ్చాను. పెళ్లయ్యాక ఇదో కొత్త జ్ఞాపకం. మా ఆయన ఎంకరేజ్ చేసి, ఈ కార్యక్రమానికి తీసుకువచ్చారు. ఇలాంటి వేదికలు పెళ్లయిన వాళ్లకు సైతం అందుబాటులో ఉండటం విశేషం. - అనసూయారెడ్డి, చేవెళ్ల -
షారుక్ భాయ్.. ఇదేం పని
ముంబై: సెలబ్రిటీ హోదాలో ఏది చేసినా నడిచిపోద్దేనే అపోహ ప్రముఖుల్లో ఉంటుందేమో. ఆ ప్రముఖుల జాబితా తానేమి తక్కువ కాదని షారుక్ ఖాన్ నిరూపించారు. షారుక్ వ్యవహార తీరుపై ముంబైలో స్థానికుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. షారుక్ నివాసం 'మన్నత్' సమీపంలో తన వ్యానిటీ వ్యాన్ ను పార్క్ చేసేందుకు ర్యాంప్ నిర్మించారు. అయితే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆయన నివాసం లోపల నిర్మించుకుంటే పెద్ద వివాదంగా మారకుండేది. కాని షారుక్ మాత్రం రోడ్డుకు అడ్డంగా ర్యాంప్ నిర్మించడాన్ని ముంబైలోని సామాజిక సంస్థ 'వాచ్ డాగ్ ఫౌండేషన్' బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) కు గత సెప్టెంబర్ లో ఫిర్యాదు చేసింది. షారుక్ నిర్మించిన ర్యాంప్.. బ్యాండ్ స్టాండ్ నుంచి మౌంట్ మేరి చర్చ్ కు వెళ్లే పాదచారులకు, వాహనదారులకు ఇబ్బందిగా మారిందని వాచ్ డాగ్ ఫౌండేషన్ ఫిర్యాదుపై బీఎంసీ స్పందించకపోవడంపై స్థానికులు నిరసన వ్యక్తం చేశారని ముంబైకి చెందిన ప్రముఖ దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. తాజాగా ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్, మున్సిపల్ కమిషనర్ ల దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో బీఎంసీ ఈ వివాదాన్ని సీరియస్ తీసుకుని తనిఖీ చేసేందుకు ఇంజనీర్లను పంపేందుకు సిద్దం చేస్తోంది. ముంబై మహానగరంలో షారుక్ నివాసం మన్నత్ ప్రముఖ సందర్శక స్థలాల్లో ఒకటిగా చెప్పుకుంటారు. మన్నత్ ముందు ర్యాంప్ నిర్మాణం మరోసారి షారుక్ ను వివాదంలోకి నెట్టింది. -
అదిరేలా అతిలోక సుందరి..
ఈ నగలు ధరించి అతిలోకసుందరి మరింత అదిరిపోలే.. బుధవారం రాత్రి ముంబైలో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ జ్యువెలరీ వీక్‌లో ర్యాంప్‌పై శ్రీదేవి క్యాట్ వాక్ చేసి.. అందరినీ మైమరిపించారు. -
నటించడమే బాగుంది
తరుణ్ తహిల్యాని, రోహిత్ బాల్ వంటి గొప్పగొప్ప డిజైనర్లు రూపొందించిన దుస్తులు ధరించి ర్యాంప్ వాక్ చేసినా కెమెరా ముందు నటించడమే బాగుందని చెబుతోంది కృతి సనన్. ‘వన్’ సినిమాతో టాలీవుడ్ హీరో మహేశ్‌బాబు సరసన నటించి మంచి మార్కులే కొట్టేసిన ఈ సుందరి జాకీష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్‌తో కలసి బాలీవుడ్లో అడుగు పెట్టింది. టైగర్‌ష్రాఫ్, కృతి జంటగా ‘హీరోపంతి’ సినిమా ఇటీవలే విడుదలైంది. మోడల్ రంగం నుంచి సినీ పరిశ్రమకు వచ్చిన మీకు ఏది సులభంగా ఉందని పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు కృతి సమాధానమిస్తూ... ర్యాంప్ వాక్ చేయడం కంటే కెమెరా ముందే తనకు సౌకర్యంగా అనిపించిందని చెప్పింది. ర్యాంప్‌పై నడిచేటప్పుడు ఎదుటివారిని అప్పటికప్పుడే సంతృప్తి పర్చాల్సి ఉంటుందని, తప్పులు జరిగితే సరిదిద్దుకునే సమయం అక్కడ ఉండదని, సినిమాలో అయితే ఎన్ని టేక్‌లైనా తీసుకొని సీన్ సరిగ్గా వచ్చేంతవరకు నటించే అవకాశముంటుందని చెప్పింది. ఐదేళ్లప్పుడే ర్యాంప్‌వాక్ చేసిన తాను న్యూఢిల్లీలోని ఆర్కే పురంలోగల ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నప్పుడు మోడల్ రంగంవైపు వెళ్తానని అనుకోలేదని, అలాగే మోడల్‌గా కొనసాగుతున్నప్పుడు సినీ పరిశ్రమవైపు వస్తానని అనుకోలేదని చెప్పింది. ర్యాంప్‌వాక్ చేస్తున్నప్పుడు ఒక్కోసారి చాలా ఇబ్బందిగా అనిపించేదని, నటించే సమయంలో మాత్రం అలాంటి అనుభవం ఒక్కసారి కూడా ఎదురుకాలేదని చెప్పింది. మోడలింగ్‌ను ఎప్పుడూ కెరీర్‌గా భావించలేదని, సినీ పరిశ్రమలోకి వచ్చిన తర్వాత మాత్రం నటనను కెరీర్‌గా మలచుకోవాలనే అభిప్రాయం కలుగుతోందని చెప్పింది. మే 23న విడుదలైన ‘హీరోపంతి’ తొలివారంలోనే రూ. 23 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద మంచి బోణీ చేసిందని, తొలి సినిమా విజయవంతం కావడం సంతోషంగా ఉందని చెప్పింది. కొత్తదనాన్ని, కొత్తవారిని ఆదరిస్తున్న బాలీవుడ్లో మరిన్ని అవకాశాలు వస్తున్నాయని, అయితే కథలు, పాత్రల ఎంపికలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానంది. -
కేన్సర్‌పై అవగాహనకు ‘హోప్’
న్యూఢిల్లీ: సెలబ్రిటీలు, ప్రముఖ మోడళ్లతో పాటు కేన్సర్ బాధితులు ఒక ఫ్యాషన్ షోలో క్యాట్‌వాక్ చేయబోతున్నారు. గుర్గావ్లో శనివారం కేన్సర్ సొసైటీ ఆఫ్ ఇండియా(సీఎస్ఐ)తో కలసి షాలినీ విగ్ వాధ్వా అనే పారిశ్రామికవేత్త ‘ఫెస్టివల్ ఆఫ్ హోప్’ పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కేన్సర్ బాధితుల్లో మనోధైర్యాన్ని పెంపొం దించేందుకే ఈ కార్యక్రమాన్ని 2011 నుంచి నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఫ్యాషన్ షో ద్వారా వచ్చే నిధులను సీఎస్ఐ పరిశోధనలకు వినియోగించనున్నట్లు వారు వివరించారు. ‘మూడేళ్లుగా ఫెస్టివల్ ఆఫ్ హోప్‌ను విజయవంతంగా నిర్వహించగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ఢిల్లీ నగరంలో కేన్సర్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కలిగించగలుగుతున్నాం. ప్రతి యేడాది వెయ్యికి పైగా కుటుంబాలు మాతో కలసి ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా కేన్సర్ లక్షణాలను ప్రారంభ దశలోనే కనుగొని వ్యాధి నిర్మూలనకు అందుబాటులో ఉన్న పలు చికిత్సలపై అవగాహన పెంచుకుంటున్నార’ని వాధ్వా వ్యాఖ్యానించారు. ఈ షోలో ప్రముఖ ఫ్యాషన్ డిజైన ర్లైన కనిక సలూజా, పవన్ సచ్‌దేవా, రితూ పాండే, నిమిత్రా లాల్వానీ, పెర్ని యా ఖురేషి, ఫరీన్ ప్రభాకర్, వారిజా బజాజ్, ఛాయ మల్హోత్రా పాలుపంచుకుంటున్నారు. కాగా, కేన్సర్‌పై అవగాహన పెంచేందుకు హోప్ కార్యక్రమంలో నేనూ భాగస్వామిని కావడం ఆనందంగా ఉంద’ని బజాజ్ తెలిపారు. ఈ ఫ్యాషన్ షోకు బాలీవుడ్ ఫ్యాషన్ డెరైక్టర్, కొరియోగ్రాఫర్ కౌసిక్ఘోష్ నృత్య దర్శకత్వం వహించనున్నారు. కేన్సర్ బాధితులతోపాటు క్రికెటర్ మనోజ్ ప్రభాకర్, రచయిత అలెగ్జాండ్రా వీనస్ బక్షి, మేక్ ఓవర్ నిపుణులు ఆష్మిన్ ముంజిల్, నటి-మోడల్ అయిన 1976 మిస్ ఇండియా విజేత నైనా బల్సావార్, ఐరా త్రివేది ర్యాంప్‌పై క్యాట్‌వాక్ చేయనున్నారు.