షారుఖ్ బంగ్లా వద్ద ర్యాంప్ తొలగించండి:ఎంపీ
ముంబై: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ బంగ్లాకు సమీపంలో అక్రమంగా నిర్మించిన ర్యాంప్ ను తొలగించాల్సిందిగా బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని సుబర్బన్ బంద్రాలో షారుఖ్ బంగ్లాకు దగ్గరగా ఒక సిమెంట్ రోడ్డుపైన ఉన్న ర్యాంప్ తమకు ఇబ్బందిగా మారిందని స్థానికులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. అది ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసిందని వారు ఎంపీకి తెలిపారు.
దీనిపై స్పందించిన ఎంపీ పూనమ్ ఇటీవల బ్రిహ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ సీతారాం కుంతేకు లేఖ రాశారు. ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఆ అక్రమ నిర్మాణాన్ని తొలగించాలంటూ ఆమె కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. ఇది ఆ బంగ్లా యజమాని తన ప్రైవేటు వాహనాల పార్కింగ్ కు వినియోగిస్తున్నట్లు తెలిపారు.