సారా అలీ ఖాన్.. బాలీవుడ్‌లో ఎంటర్ అవడానికి ఆమెకున్న నటనా వారసత్వం ఒక ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగపడి ఉండొచ్చు కానీ ఆమె నిలబడింది మాత్రం అచ్చంగా తనలోని ప్రతిభతోనే! ఫ్యాషన్‌లోనూ ఆ స్టార్ స్టయిల్ సెపరేటే! అమ్మ, నానమ్మ.. మేనత్తల ఇన్‌ఫ్లుయెన్స్ ఇంచ్ కూడా ఉండదు. ఆమెకు ఆ ప్రత్యేకతను అలంకరిస్తున్న బ్రాండ్స్‌లో ఇవీ ఉన్నాయి.. చిన్న వస్తువు క్కూడా బోలెడంత ఖర్చు పెడుతుంటారు సెలబ్రిటీలు అని అనుకుంటారు కదా! కానీ నన్ను మినహాయించొచ్చు. ఎందుకంటే నేను అంతగా ఖర్చు పెట్టను.. ముఖ్యంగా డ్రెసెస్ మీద. పెద్ద పెద్ద ఫంక్షన్స్‌కి, షోస్‌కి కూడా నేను రెంటల్ డ్రెసెస్‌నే ఫ్రిఫర్ చేస్తాను!
పునీత్ బలానా..
‘వార్డ్‌రోబ్‌లోని మన కలెక్షన్.. మన ఫ్యాషన్ గురించే కాదు, మన గురించీ చెప్తాయి’ అంటాడు పునీత్ బలానా. అందుకే అతని డిజైన్స్ అన్నిటిలోనూ తన స్వస్థలమైన రాజస్థాన్ సంస్కృతి ప్రతిబింబిస్తుంటుంది. ఆధునికతకు దేశీ సంప్రదాయాన్ని జోడించిన డిజైన్స్ అతని ప్రత్యేకత. కాబట్టే ఈ బ్రాండ్ సెలబ్రిటీస్ ఫేవరెట్‌గా మారింది. ధర కాస్త ఎక్కువ. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. సారాఖాన్ ధరించి డ్రెస్ బ్రాండ్ పునీత్ బలానా ఖరీదు రూ. 1, 55, 000/-.
జేకేజే జ్యూలర్స్
ఇది ఎనిమిది తరాల వారసత్వ వ్యాపారం. 1868లో రతన్‌గఢ్ అనే చిన్న పట్టణంలో సత్యనారాయణ జీ మోసున్‌తో ప్రారంభమై.. నేడు జైపూర్‌లోనే ఉత్తమ ఆభరణాలను అందించే బ్రాండ్‌గా స్థిరపడింది. రాజస్థానీ సంప్రదాయ నగలను ప్రపంచ దేశాలకూ పరిచయం చేస్తుండడంతో ఈ బ్రాండ్ కీర్తి అంతర్జాతీయ స్థాయికీ చేరుకుంది. ధర జ్యూలరీ డిజైన్, నాణ్యత పై ఆధారపడి ఉంటుంది. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేసే వీలుంది. ఇక సారాఖాన్ ధరించిన జేకేజే జ్యూలర్స్ ధర ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.
--దీపిక కొండి
(చదవండి: ఆ ఊరిలోని మహిళలంతా ఐదు రోజులు దుస్తులు లేకుండా ఎందుకుంటారో తెలిస్తే..షాకవ్వుతారు!)
Comments
Please login to add a commentAdd a comment