సెలబ్రిటీలు, ప్రముఖ మోడళ్లతో పాటు కేన్సర్ బాధితులు ఒక ఫ్యాషన్ షోలో క్యాట్‌వాక్ చేయబోతున్నారు. గుర్గావ్‌లో శనివారం కేన్సర్ సొసైటీ ఆఫ్ ఇండియా(సీఎస్‌ఐ)తో కలసి షాలినీ విగ్ వాధ్వా
న్యూఢిల్లీ: సెలబ్రిటీలు, ప్రముఖ మోడళ్లతో పాటు కేన్సర్ బాధితులు ఒక ఫ్యాషన్ షోలో క్యాట్‌వాక్ చేయబోతున్నారు. గుర్గావ్‌లో శనివారం కేన్సర్ సొసైటీ ఆఫ్ ఇండియా(సీఎస్‌ఐ)తో కలసి షాలినీ విగ్ వాధ్వా అనే పారిశ్రామికవేత్త ‘ఫెస్టివల్ ఆఫ్ హోప్’ పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కేన్సర్ బాధితుల్లో మనోధైర్యాన్ని పెంపొం దించేందుకే ఈ కార్యక్రమాన్ని 2011 నుంచి నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఫ్యాషన్ షో ద్వారా వచ్చే నిధులను సీఎస్‌ఐ పరిశోధనలకు వినియోగించనున్నట్లు వారు వివరించారు. ‘మూడేళ్లుగా ఫెస్టివల్ ఆఫ్ హోప్‌ను విజయవంతంగా నిర్వహించగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది.
ఈ కార్యక్రమం ద్వారా ఢిల్లీ నగరంలో కేన్సర్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కలిగించగలుగుతున్నాం. ప్రతి యేడాది వెయ్యికి పైగా కుటుంబాలు మాతో కలసి ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా కేన్సర్ లక్షణాలను ప్రారంభ దశలోనే కనుగొని వ్యాధి నిర్మూలనకు అందుబాటులో ఉన్న పలు చికిత్సలపై అవగాహన పెంచుకుంటున్నార’ని వాధ్వా వ్యాఖ్యానించారు. ఈ షోలో ప్రముఖ ఫ్యాషన్ డిజైన ర్లైన కనిక సలూజా, పవన్ సచ్‌దేవా, రితూ పాండే, నిమిత్రా లాల్వానీ, పెర్ని యా ఖురేషి, ఫరీన్ ప్రభాకర్, వారిజా బజాజ్, ఛాయ మల్హోత్రా పాలుపంచుకుంటున్నారు. కాగా, కేన్సర్‌పై అవగాహన పెంచేందుకు హోప్ కార్యక్రమంలో నేనూ భాగస్వామిని కావడం ఆనందంగా ఉంద’ని బజాజ్ తెలిపారు. ఈ ఫ్యాషన్ షోకు బాలీవుడ్ ఫ్యాషన్ డెరైక్టర్, కొరియోగ్రాఫర్ కౌసిక్‌ఘోష్ నృత్య దర్శకత్వం వహించనున్నారు. కేన్సర్ బాధితులతోపాటు క్రికెటర్ మనోజ్ ప్రభాకర్, రచయిత అలెగ్జాండ్రా వీనస్ బక్షి, మేక్ ఓవర్ నిపుణులు ఆష్మిన్ ముంజిల్, నటి-మోడల్ అయిన 1976 మిస్ ఇండియా విజేత నైనా బల్సావార్, ఐరా త్రివేది ర్యాంప్‌పై క్యాట్‌వాక్ చేయనున్నారు.