షారుక్ భాయ్.. ఇదేం పని
షారుక్ భాయ్.. ఇదేం పని
Published Wed, Aug 20 2014 3:50 PM | Last Updated on Sat, Sep 2 2017 12:10 PM
ముంబై: సెలబ్రిటీ హోదాలో ఏది చేసినా నడిచిపోద్దేనే అపోహ ప్రముఖుల్లో ఉంటుందేమో. ఆ ప్రముఖుల జాబితా తానేమి తక్కువ కాదని షారుక్ ఖాన్ నిరూపించారు. షారుక్ వ్యవహార తీరుపై ముంబైలో స్థానికుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. షారుక్ నివాసం 'మన్నత్' సమీపంలో తన వ్యానిటీ వ్యాన్ ను పార్క్ చేసేందుకు ర్యాంప్ నిర్మించారు. అయితే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆయన నివాసం లోపల నిర్మించుకుంటే పెద్ద వివాదంగా మారకుండేది. కాని షారుక్ మాత్రం రోడ్డుకు అడ్డంగా ర్యాంప్ నిర్మించడాన్ని ముంబైలోని సామాజిక సంస్థ 'వాచ్ డాగ్ ఫౌండేషన్' బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) కు గత సెప్టెంబర్ లో ఫిర్యాదు చేసింది.
షారుక్ నిర్మించిన ర్యాంప్.. బ్యాండ్ స్టాండ్ నుంచి మౌంట్ మేరి చర్చ్ కు వెళ్లే పాదచారులకు, వాహనదారులకు ఇబ్బందిగా మారిందని వాచ్ డాగ్ ఫౌండేషన్ ఫిర్యాదుపై బీఎంసీ స్పందించకపోవడంపై స్థానికులు నిరసన వ్యక్తం చేశారని ముంబైకి చెందిన ప్రముఖ దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. తాజాగా ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్, మున్సిపల్ కమిషనర్ ల దృష్టికి తీసుకువెళ్లారు.
దాంతో బీఎంసీ ఈ వివాదాన్ని సీరియస్ తీసుకుని తనిఖీ చేసేందుకు ఇంజనీర్లను పంపేందుకు సిద్దం చేస్తోంది. ముంబై మహానగరంలో షారుక్ నివాసం మన్నత్ ప్రముఖ సందర్శక స్థలాల్లో ఒకటిగా చెప్పుకుంటారు. మన్నత్ ముందు ర్యాంప్ నిర్మాణం మరోసారి షారుక్ ను వివాదంలోకి నెట్టింది.
Advertisement