అలనాటి నటి శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ (Khushi Kapoor) నటించిన కొత్త సినిమా 'లవ్‌యాపా' (Loveyapa). బాలీవుడ్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఇందులో ఆమీర్‌ఖాన్ తనయుడు జునైద్ ఖాన్‌తో జంటగా ఆమె నటించారు. యూత్‌ను ఆకట్టుకునే ప్రేమకథలా ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం 'లవ్ టుడే'కు రీమేక్‌గా 'లవ్‌యాపా' సినిమా రానుంది. అయితే, తాజాగా ప్రమోషన్స్‌లో భాగంగా ఖుషీ కపూర్ తన వ్యక్తిగత జీవితం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్యూలో భాగంగా ఇప్పటి వరకు ఎవరినైనా ప్రేమించారా..? ప్రపోజ్ చేశారా..? అని ఖుషీ కపూర్‌ను అడగ్గా.. ఆమె ఇలా చెప్పారు. తాను ఇప్పటి వరకు ఎవరికీ ప్రపోజ్ చేయలేదని షాకింక్ ఆన్సర్ ఇచ్చారు. కానీ, తనకు ఎవరైనా ప్రపోజ్ చేస్తే అందుకు సంబంధించిన ఒక ఫోటోను తీసుకోవాలని ఉందని ఆమె పేర్కొన్నారు. బాలీవుడ్ సినిమా 'ది ఆర్చిస్'లో నటించిన తన కో స్టార్ వేదాంగ్ రైనాతో ఖుషి ప్రేమలో ఉన్నారని చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. వారిద్దరూ కూడా జంటగా పలు ప్రదేశాల్లో కెమెరాల కంట కూడా పడ్డారు. ఇలాంటి సమయంలో తాను ఎవరికీ ప్రపోజ్ చేయలేదు అని ఖుషీ చెప్పడంతో నెట్టింట ఆమె వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. బహూశా బ్రేకప్ ఏమైనా చెప్పారా..? అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
2023లో విడుదలైన 'ది ఆర్చిస్' సినిమాతో ఖుషీ కపూర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. అయితే, ఈ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమాలో తనకు జోడీగా నటించిన వేదాంగ్ రైనాతో ఆమె ప్రేమలో ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
అక్కతో పోటీ లేదు..
కెరీర్ పరంగా జాన్వీకపూర్‌తో తాను పోటీ పడలేనని ఖుషీ కపూరు చెప్పారు. నిజం చెప్పాలంటే అలాంటి ఆలోచన తమ ఇద్దరిలోనూ లేదని ఆమె పేర్కొన్నారు. తాము పోటీ పడుతున్నట్లు ఎవరైనా అనుకుంటే అదొక వింతే అని ఖుషీ తెలిపారు. ఒకవేళ తామిద్దరం కలిసే ఏదైనా సినిమా చేస్తే తప్పకుండా ఎక్కువ మార్కులు జాన్వీ అక్కకే పడుతాయని ఆమె అన్నారు. ఆమె చాలా బాగా నటిస్తుంది. స్క్రీన్‌పై అక్క నటన చూస్తే చాలా ఆనందం కలుగుతుందని ఆమె తెలిపారు. 'నేను ఏదైనా చిత్రంలో బాగా నటిస్తే అక్క చాలా సంతోషిస్తుంది. చాలా బాగా చేశావ్ అంటుంది. అప్పుడు కూడా అదంతా తన విజయంగా ఆమె భావిస్తుంది.' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment