Vedang Raina
-
ఓటీటీలో 'జిగ్రా' స్ట్రీమింగ్.. అధికారిక ప్రకటన
ఆలియా భట్ భారీ యాక్షన్ మూవీ జిగ్రా ఓటీటీలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఆలియా భట్, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబరు 11న హిందీతో పాటు తెలుగులో కూడా విడుదలైంది. అయితే, ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం ఈ చిత్రం అందుకోలేకపోయింది. ఈ సినిమాలో సత్య పాత్రలో ఆలియా భారీ యాక్షన్ సీన్స్‌లో మెప్పించినప్పటికీ కథలో పెద్దగా బలం లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద భారీగా నష్టాలను మిగిల్చింది. ఆలియా భట్ తమ్ముడి పాత్రలో వేదాంగ్ అద్భుతంగా నటించారు.అక్కాతమ్ముళ్ల సెంటిమెంట్‌తో వాసన్ బాల దర్శకత్వంలో రూపొందిన జిగ్రా సినిమాను కరణ్ జోహార్, అపూర్వా మెహతా, ఆలియా భట్, షాహిన్ భట్, సోమెన్ మిశ్రా నిర్మించారు. అయితే, జిగ్రా ఓటీటీలో విడుదల కానున్నట్లు చాలారోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. అయితే, డిసెంబర్ 6న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. హిందీతో పాటు దక్షిణాది భాషలు అన్నింటిలోనూ విడుదల కానుంది.జిగ్రా కోసం సుమారు రూ. 90 కోట్లు ఖర్చు చేశారు నిర్మాతలు. అయితే, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 30 కోట్ల లోపే కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. జిగ్రాతో రూ. 60 కోట్లకు పైగానే నిర్మాతలు నష్టపోయినట్లు సమాచారం. జిగ్రా తర్వాత మరో రెండు సినిమాల్లో అలియా భట్ నటిస్తుంది. అల్ఫా, లవ్ అండ్ వార్ ప్రాజెక్ట్‌లలో ఆమె భాగం కానుంది. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న 'అలియా భట్' యాక్షన్ మూవీ
ఆలియా భట్ భారీ యాక్షన్ మూవీ జిగ్రా ఓటీటీలోకి రానుంది. ఆలియా భట్, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబరు 11న హిందీతో పాటు తెలుగులో కూడా విడుదలైంది. ఇందులో సత్య పాత్రలో ఆలియా భారీ యాక్షన్ సీన్స్‌లో దుమ్మురేపింది. అంకుర్ పాత్రలో వేదాంగ్ అద్భుతంగా నటించారు. అయితే, బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఈ చిత్రం మెప్పించలేదు.అక్కాతమ్ముళ్ల సెంటిమెంట్‌తో వాసన్ బాల దర్శకత్వంలో రూపొందిన జిగ్రా సినిమాను కరణ్ జోహార్, అపూర్వా మెహతా, ఆలియా భట్, షాహిన్ భట్, సోమెన్ మిశ్రా నిర్మించారు. అయితే, జిగ్రా ఓటీటీలో విడుదల కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. డిసెంబర్ 6న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కథనాలు వస్తున్నాయి. హిందీతో పాటు దక్షిణాది భాషలు అన్నింటిలోనూ విడుదల కానుంది.జిగ్రా కోసం సుమారు రూ. 90 కోట్లు ఖర్చు చేశారు నిర్మాతలు. అయితే, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 30 కోట్ల లోపే కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. జిగ్రాతో రూ. 60 కోట్లకు పైగానే నిర్మాతలు నష్టపోయినట్లు సమాచారం. జిగ్రా తర్వాత మరో రెండు సినిమాల్లో అలియా భట్ నటిస్తుంది. అల్ఫా, లవ్ అండ్ వార్ ప్రాజెక్ట్‌లలో ఆమె భాగం కానుంది. -
షారుఖ్ ఖాన్ కుమార్తెపై యంగ్ హీరో ఇంట్రెస్టెంగ్ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ముద్దుల తనయ, నటి సుహానా ఖాన్‌పై యంగ్ హీరో వేదాంగ్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె మేకప్ వేసుకోవడానికి చాలా సమయం తీసుకుంటుందని, షూటింగ్ సమయంలో ఆమె టీమ్ అంతరాయం కలిగించేదని చెప్పారు. ఆయన కీలకపాత్రలో నటించిన తాజా చిత్రం ‘జిగ్రా’. ఆలియా బట్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా వేదాంగ్ రైనా మీడియాతో ముచ్చటించారు. (చదవండి: రానాకి ఇంతకంటే బెటర్ ప్రశంస ఉండదేమో?)ఈ సందర్భంగా తొలి సినిమా కోస్టార్ సుహానా ఖాన్‌పై ఎప్పుడైనా కోపం వచ్చిందా అని విలేకరి ప్రశ్నించాడు. దీనిపై వేదాంగ్ స్పందిస్తూ.. ‘సుహానా చాలా మంచి అమ్మాయి. అందరితో కలిసిసోతుంది. కోపం వచ్చేలా ఆమె ప్రవర్తించదు. కానీ ఒక విషయంలో మాత్రం నాకు కొంచెం చిరాకుగా అనిపించేంది. ఆమె రెడీ కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. షూటింగ్ సమయంలో మేమంతా రెడీ అయి ఆమె కోసం ఎదురు చూసేవాళ్లం. దాదాపు గంట లేట్‌గా సెట్‌పైకి వచ్చేది. (చదవండి: పెళ్లి గురించి అమితాబ్ ప్రశ్న.. జునైద్ ఖాన్ ఆన్సర్‌కు తండ్రి షాక్)షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ‘జుట్టు బాలేదు..మేకప్ సరిగా లేదు’అంటూ ఆమె టీమ్ మధ్యలో అంతరాయం కలిగించేంది. దాని వల్ల మా బృందం అంతా ఇబ్బంది పడింది. ఇందులో సుహానాది తప్పులేదు. ఆమె పాత్ర అలా డిజైన్ చేశారు. అందుకే మేకప్‌కి ఎక్కువ సమయం తీసుకునేది’అని వేదాంగ్ చెప్పారు.