ఆస్ట్రేలియా వెళ్లనున్న రామ్‌ చరణ్‌.. కారణం ఇదేనా..? | RC 16: Ram Charan To Undergo Transformation In Australia? | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా వెళ్లనున్న రామ్‌ చరణ్‌.. కారణం ఇదేనా..?

Published Wed, Jun 19 2024 1:43 PM | Last Updated on Wed, Jun 19 2024 1:59 PM

Ram Charan Went To Australia

పాన్‌ ఇండియా హీరో రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తున్న చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రకటన వచ్చి ఇప్పటికే చాలా రోజులైంది. రీసెంట్‌గా పూజా కార్యక్రమం కూడా జరిగింది. కానీ, రెగ్యులర్‌ షూటింగ్‌ పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు..? ఇతర నటీనటులు ఎవరు..? వంటి అప్‌డేట్స్‌ గురించి అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకున్న RC16 ప్రాజెక్ట్‌ ఇక పట్టాలెక్కడమే ఆలస్యం అని తెలుస్తోంది.

ఈ చిత్రం కోసం రామ్ చరణ్ పూర్తిగా తన మేకోవర్‌ను మార్చుకోనున్నారట. ఈ సినిమాలో చరణ్‌ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని తెలుస్తోంది. అందుకు తగ్గట్లు కనిపించాలంటే మరింత కసరత్తులు తప్పవని ఆయన భావించారట. అందుకోసం ఆస్ట్రేలియా వెళ్లేందుకు చరణ్‌ సిద్ధం అవుతున్నారట. గేమ్ చేంజర్ చిత్రం పూర్తి అయిన వెంటనే వెళ్లనున్నట్లు సమాచారం. అక్కడ చరణ్ ఫిజికల్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత RC16 షూటింగ్ అక్టోబర్‌లో మొదలయ్యే అవకాశం ఉన్నట్లు టాక్‌.

'ఉప్పెన' తర్వాత బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తోన్న చిత్రమిది. స్పోర్ట్స్‌ డ్రామాగా, గ్రామీణ నేపథ్యంలో కథ సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో రామ్‌చరణ్ సరికొత్తగా కనిపిస్తారని, అందుకోసం ప్రత్యేక మేక్ఓవర్ తప్పదని మేకర్స్‌ ప్లాన్‌ చేశారని టాక్‌. రామ్ చరణ్ కోరుకున్న శారీరక రూపాన్ని పొందాలంటే కనీసం రెండు నెలలపాటు కఠినమైన శిక్షణ తీసుకోవాల్సిందేనని సూచించారట. దానికి కోసం ఆస్ట్రేలియాను ఎంపిక చేశారట.

జాన్వీకపూర్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా కనిపించనుంది. రెహమాన్ సంగీతం  అందించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, వృద్ధి సినిమాస్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు కలిసి ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని  నిర్మిస్తున్నాయి. RC16 పేరుతో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు 'పెద్ది' అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారని తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement