- వారం రోజుల్లో సామగ్రి సరఫరా
కంప్యూటర్లు, ఫర్నీచర్‌ల కొనుగోళ్లకు టెండర్లు
Published Wed, Oct 5 2016 7:49 PM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM
ఇందూరు:
కొత్తగా ఏర్పడనున్న కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌కు అవసరమైన కంప్యూటర్లు, ఫర్నీచర్ కొనుగోలు కోసం జిల్లా జాయింట్ కలెక్టర్ రవీందర్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం టెండర్లు నిర్వహించారు. ఆయా శాఖల నుంచి పాత ఫర్నీచర్, కంప్యూటర్లను అధికారులు విభజించి కామారెడ్డికి తరలిస్తున్నారు. అయితే కొత్త జిల్లా కలెక్టరేట్ పరిపాలన విభాగంతో పాటు కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్‌వో చాంబర్‌లతో పాటు ఆర్డీవో కార్యాలయాలకు కొత్త కంప్యూటర్లు, ఫర్నీచర్ అవసరం ఉండడంతో వాటి కొనుగోళ్ల కోసం జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం టెండర్ల ప్రక్రియ చేపట్టారు. సుమారు 50లక్షల వ్యయంతో కొనుగోళ్లు చేపడుతున్నారు. వీలైనంత ఖర్చు తగ్గించాలన్న కలెక్టర్ సూచన మేరకు ఏసీల కొనుగోళ్లను నిలిపివేశారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం 53 కంప్యూటర్లు, మూడు ల్యాప్‌టాప్‌లు, 14 లేజర్ ప్రింటర్లు, 18 మల్టీఫంక్షన్ ప్రింటర్‌లు, 3 ఫ్యాక్స్ మెషిన్‌లు, 2కేవీ యూపీఎస్‌లు 16, 5కేవీ యూపీఎస్ 1, పెద్ద జిరాక్స్ మెషిన్‌లు 5, ప్రొజెక్టర్‌లు 2, 62 కేవీ జనరేటర్ 1, 30 కేవీ జనరేటర్‌లు 3, కొనుగోలు చేయడానికి టెండర్లు పూర్తయ్యాయి. టెండర్లు దక్కించుకున్న వ్యాపారులు వారం రోజుల్లో సామగ్రిని కామారెడ్డి కలెక్టరేట్‌కు తరలించాలని జేసీ ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్‌వో పద్మాకర్, కలెక్టరేట్ ఏవో గంగాధర్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement