విరుష్క చిలిపి తగాదా ముచ్చట చూశారా? | Anushka Sharma and Virat Kohli New Manyavar Ad after Marriage | Sakshi
Sakshi News home page

విరుష్క చిలిపి తగాదా ముచ్చట చూశారా?

Published Tue, Nov 20 2018 7:17 PM | Last Updated on Thu, Mar 28 2019 6:18 PM

Anushka Sharma and Virat Kohli New Manyavar Ad after Marriage - Sakshi

ముచ్చటైన జంట టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ నటించిన మన్యవార్-మాహే  ప్రకటన గుర్తుందా..ఈ స్వీట్‌ అండ్‌ సెలబ్రిటీ కపుల్‌ పెళ్లికి ముందు చేసిన ఈ యాడ్‌తో   అందరి చూపులనూ కట్టిపడేశారు. అన్యోన్యమైన జంట అంటే ఇలా ఉండాలి అన్నట్టు నటించి ఆకట్టుకున్నారు. అయితే తాజాగా పెళ్లి తరువాత..వీరి వివాహ వార్షికోత్సవానికి కేవలం కొన్ని వారాల ముందు చేసిన అదే మన్యవర్-మోహే ప్రకటన ఇపుడు హల్‌చల్‌ చేస్తోంది. పెళ్లికి ముందు ప్రమాణాలు, పెళ్లి తరువాత ప్రయాణం..ఈ చిలిపి తగాదాలతో చూడముచ్చటగా అద్భుతంగా ఉన్న ఈ యాడ్‌ను చూసి ఆనందించాల్సిందే..

అనుష్క శర్మ  తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ యాడ్‌ వీడియోను పోస్ట్‌ చేశారు. దీంతో లక్షలాది లైక్‌లు, కమెంట్ల వెల్లువ కురుస్తోంది. ముఖ్యంగా ఈ యాడ్‌ చూసిన అభిమానులు ‘బెస్ట్‌ కపుల్‌ ఆఫ్‌ ది వరల్డ్‌’ అంటూ తెగ మురిసిపోతున్నారు. అటు బాలీవుడ్‌ దర్శకుడు కరణ్‌ జోహార్‌, ధడక్‌ దర్శకుడు శశాంక్‌ ఖైతాన్‌ కూడా తాజా ప్రకటన  చూసి విరాట్‌-అనుష్క జంటపై ప్రశంసలు కురిపించారు.

వ్యాపార ప్రమోషన్‌లో  వాణిజ్య ప్రకటనలకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతాకాదు.  ఇక సదరు యాడ్‌లకు సెలబ్రిటీల స్పెషల్‌ ఎట్రాక్షన్‌ తోడైతే వినియోగదారులను ఆకట్టుకోవడం చాలా సులువు. ఆ కోవలోనిదే.  ఇండియన్‌ సల్వార్‌ సూట్‌,  సాంప్రదాయ, డిజైనర్‌ వివాహ దుస్తులకు పెట్టింది పేరైన  మాన్యవర్‌-మాహే  ప్రకటన కూడా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement